భారతదేశ ప్రస్తుత ఆర్ధిక ప్రగతికి ఒకప్పుడు, ఇప్పుడు కూడా రైతులు మూల స్తంభాలు. ఈరోజు దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ స్థానంలో ఉన్న లేదా ఇంకా ఉన్నత స్థితికి వెళ్లాలన్న రైతుల పాత్ర అత్యంత కీలకమనే చెప్పవచ్చు. ఇదంతా గ్రామీణ వాతావరణంలో ఉన్న మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడే నిత్యం పాటించే సగటు రైతు వల్లే సాధ్యమైంది. కానీ రోజురోజుకు గ్రామీణ రైతాంగం రాజకీయ కోరల్లో చిక్కుకొని తమ ఉనికే ప్రస్నార్ధకంగా తయారైన పరిస్థితులు నేటి కాలంలో ఉత్తమమవుతున్నాయి. ఒకప్పుడు రైతుకు లేదా వ్యవసాయానికి కష్టం వస్తే రైతు సంఘాలు చాలా బలంగా ఉండటమే కాకుండా గ్రామ వ్యవస్థలో ఉన్న ఊరి పెద్దరికం కట్టుబాట్లు అండగా ఉండి సమస్యలను తక్షణం పరిష్కరించే దాకా పోరాడేవి. కానీ క్రమేపి గ్రామాల్లో రాజకీయంగా విభేదాలు అధిక మవ్వటం, తమ స్వార్ధ ప్రయోజనాలకు రైతుల సమస్యలను ఆసరాగా చేసుకొని విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ నాయకులు అధికమవడం వల్ల గ్రామీణ ఐక్యత దెబ్బతిని రైతాంగ సమస్యల మీద పోరాడే సరైన వ్యవస్థ లేకుండా పోయింది. నీటి పారుదల వ్యవస్థలో లోపాలు, సమిష్టి వ్యవసాయ ఆలోచన లేకపోవడం, వాతావరణ పరిస్థితుల అననుకూలతలు, ఇప్పటి పరిస్ధితులను బట్టి డిమాండ్ వున్న పంటలపై సరిjైున అవగాహన లేకపోవడం, అలానే పలు రకాల కల్తీ విత్తనాలు, పురుగుమందుల వాడకము ఇలా అనేక సమస్యలు వల్ల రైతుకు ఖర్చులు అధికమవటమే కాకుండా మరియు తగిన మద్దతు ధర లేక రైతాంగం తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి ఎన్నో సమస్యల మీద పోరాటానికి ఒకప్పుడు బలంగా ఉన్న రైతు సంఘాలు నేటి కాలంలో లేవనే చెప్పాలి. దేశంలో ప్రతి రంగంలో తమ సమస్యల మీద ప్రభుత్వంతో చర్చించి తమ రంగానికి ఎలాంటి మద్దతు కావాలో ఎలాంటి పరిష్కారాలు కావాలో చర్చించే సంఘాలు ఉన్నాయి కానీ వ్యవసాయానికి మాత్రం లేదు.
Read More: అధునాతన పద్ధతిలో దానిమ్మ సాగు లక్షల్లో ఆదాయం
ఈరోజు కృష్ణా బెల్ట్‌లో నాగార్జునసాగర్ నీటి వివాదంలో రాజకీయాలు అగ్రభాగాన్ని కనిపిస్తున్నాయి కానీ రైతుల అవసరాలు, రైతు కష్టాలు మాత్రం వెనక్కి పోయాయి. కృష్ణా నది నీటి లభ్యత మీద ఆధారపడి వున్న కొన్ని లక్షల ఎకరాలకు తగిన నీరు లేక పంటలు ఎండిన పరిస్తితులు వున్న ఈ రోజు కూడా రైతు తమ కష్టాల మీద గొంతెత్తే పరిస్థితి లేదు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి సమస్య పరిష్కారానికి ఆలోచన చేస్తే పరిస్థితి ఇంత దాకా రాదు. భవిష్యత్‌లో నైన సరిjైునిన మార్గాలు చూపించక పొతే ఇలాంటి పరిస్థితులు ఇంకా అధికమవుతూనే ఉంటాయి. కాబట్టి రైతులు, రైతు సంఘాలు, వ్యవసాయ నిపుణులు, మేధావులు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను, గ్రామీణ వ్యవస్థ అవసరాన్ని గుర్తించి వ్యవసాయ రంగానికి అండగా నిలబడి దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పురోగతి సాధించడానికి తగిన ప్రణాళికను రూపొందిస్తే, దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన వారు అవుతారు. అలానే స్వచ్ఛంద సంస్థలు కూడా వీటి అవసరాలను గుర్తించి రైతులకు అవగాహన కల్పిస్తూ వారికి అండగా నిలబడాలని కోరుకుంటున్నాము. అలానే ప్రభుత్వం ఇచ్చే రైతు సంక్షేమ పథకాలు నేరుగా రైతుకి అందించి వాటి లబ్ది పూర్తిగా రైతులకు చేరే వ్యవస్థ కోసం పోరాడాలి. అప్పుడే మన వ్యవసాయానికి తోడ్పాటు వచ్చి దేశ ఆర్థిక వ్యవస్థకి మరింత బలం చేకూరుతుంది.