మన దేశంలో ప్రధాన నూనెగింజ పంట అయిన ఆవాలు ధర ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఆవాలు కొన్ని నగరాల్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ రేటుకు అమ్ముడవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర రూ. 4650 ఉండగా, మండీలలో దీని రేటు క్వింటాల్ కు రూ. 5500 పలుకుతుంది. దీంతో రైతులు ప్రభుత్వ మండీలలో విక్రయించకుండా నేరుగా వ్యాపారులకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలు రైతులకు కాస్త ఊరటనిస్తున్నాయి. మీరు కూడా ఆవాలు పండించటం ద్వారా ఎక్కువ లాభాలను సంపాదించాలనుకుంటే సాంప్రదాయ పద్దతికి దూరంగా వెళ్లి సేంద్రియ పద్ధతిలో అవలంభిస్తే కనీస లాభాలు పొందుతారు.
ఆవాల సాగు ప్రధానంగా హర్యానా, రాజస్థాన్, పంజాబ్,మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్రలలో జరుగుతుంది. కానీ ఆవ నూనెను దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలలో వంటల కోసం వినియోగిస్తారు. ఆవ నూనెలో లభించే ఔషధ గుణాల కారణంగా ఎల్లప్పుడూ మార్కెట్లో ఉంటుంది. ఆవ నూనెలో ఇతర తినదగిన నూనెలను కలపడాన్ని ప్రభుత్వం గతంలోనే నిషేధించింది.
సేంద్రియ విధానంలో ఆవాల సాగు:
సాంప్రదాయ ఆవాల సాగుకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. సేంద్రియ ఆవాల సాగు కోసం మొదట భూమిని దున్ని చదును చేయాలి. తరువాత ఎకరా విత్తనాలకు 5 క్వింటాళ్ల చొప్పున వర్మీకంపోస్ట్ మిక్స్ చేయాలి. ఆపైన మొలకెత్తిన ఆవగింజలను రెండు, మూడు సార్లు నీటిలో ముంచి పొలంలో చల్లాలి. ఫంగస్ ను నివారించడానికి ట్రైకోడెర్మా విరిడేను ఉపయోగించవచ్చు. మంచి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలను వాడితేనే మంచి దిగుబడి వస్తుంది.
నీటిపారుదల, కలుపు నివారణ:
విత్తనాలు చల్లిన 20 – 25 రోజుల తరువాత పొలానికి నీళ్లు పెట్టాలి. పొలంలో కలుపు మొక్కలను ఆవాల మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే పీకివేయాలి. కలుపు తీయడం వల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి. దిగుబడి కూడా బాగా ఉంటుంది. చాలా మంది రెండుసార్లు కలుపు తీస్తారు. పొలంలో కలుపు ఎక్కువగా లేకపోతే ఒక్కసారి తీస్తే సరిపోతుంది.
పంట సిద్దమైన తరువాత మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి. సాధారణంగా రైతులు ఆవాలను నేరుగా అమ్ముతారు. మీరు ఆవాలు అమ్మే బదులు ఆవ నూనెను అమ్మితే లాభం ఎక్కువగా ఉంటుంది. సేంద్రియంగా పండించిన ఆవ నూనెకు మంచి డిమాండ్ ఉంటుంది.
సేంద్రియ పద్ధతిలో ఆవాల సాగు..
Leave Your Comments