మన వ్యవసాయం

మొక్కజొన్నలో కత్తెర పురుగు – సమగ్ర సస్యరక్షణ

0

మొక్కజొన్నలో ప్రొటీన్లుఎమినో ఆమ్లాలు కలిగి ఉండే చక్కని ధాన్యపు పంట. మొక్కజొన్న పంటకు ఎక్కువగా కాండం తొలిచే పురుగు ఇటు ఖరీఫ్‌ అటు రబీ కాాలంలో ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది. కాని ఈ పురుగు కంటే ప్రమాదకారి అయిన ‘‘కత్తెర పురుగు’’ ప్రస్తుతం మొక్కజొన్నకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్నను ఆశించే మొవ్వు పురుగుకన్నా భిన్నంగా ఉంటుందనిరైతు గుర్తించి సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలి. లేకపోతే దీని ఉధృతి మిగతా పంట మీద కూడా ఉండి భవిష్యత్తులో ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియచేస్తున్నారు. 

కత్తెర పురుగ : 

ఫాల్‌ ఆర్మీ వార్మ్‌గా పివబడే ఈ పురుగు శాస్త్రీయనామంస్పోడోప్టిర ఫ్రుగిపెరాడ. ఇది లేపిడాప్టిరా జాతికి  చెందిన పురుగు. ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న పంటను ఆహారంగా తీసుకుంటుంది. మొక్కజొన్నను ఎక్కువగా పండించే అమెరికాఆఫ్రికా దేశాల్లో ఈ పురుగు ఉధృతి ఎక్కువ. తల్లి రెక్క పురుగు ఎక్కువ దూరం ప్రయాణించ గలిగే శక్తి ఉండటం వల్ల ఇది సుదూర ప్రాంతం ప్రయాణం చేసి ప్రస్తుతం భారతదేశంలో దీని ఉధృతి కనుగొన్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పురుగు ఆశించి తీవ్ర నష్టం కలిగిస్తుంది 

ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న మీద ఆశించి నష్టపరుస్తుంది. మొక్కజొన్న లేనప్పుడు ఇతర పంటను ఆహారంగా తీసుకుంటుంది. వరిప్రత్తిఅపరాలు సోయాజొన్నకూరగాయ పంటలు వంటి 80 రకాల మొక్కపై ఈ పురుగు నష్టం చేస్తుంది.  

నష్టపరిచే విధానం:  

 ఈ పురుగు యొక్క రెక్క పురుగు గుడ్లు పెట్టడం వల్లగుడ్లు పగిలి పిల్లగా మారిన లద్దెపురుగులు గుంపుగా ఆకు మీద పత్రహరితాన్ని గోకి తింటాయి. 

రెండవ దశలో ఈ పురుగు కాండం మొవ్వులో చేరి లోప కాండాన్ని తినివేస్తాయి. ఆకు మీద పెద్ద పెద్ద రంధ్రాలు ఏర్పడతాయి.  

శాఖీయ దశలో ఆశించినప్పుడు మొవ్వును పూర్తిగా తినివేయడం వల్ల  మొవ్వు చనిపోయే ప్రమాదముంది. పురుగు తిని విసర్జించిన మపదార్ధంతో మొవ్వంతా నిండి ఉంటుంది. 

పూత మొదలయ్యే సమయంలో ఆశిస్తే మొవ్వులోప ఉన్న పూతను కూడా రంధ్రాలు చేసి నష్ట పరుస్తాయి. పూత చనిపోయి కంకి తయారవ్వదు.  

కంకి తయారయ్యే సమయంలో కూడా ఈ పురుగు ఆశించి కంకును తిని నష్టపరుస్తుంది.  

ఈ పురుగు ఎక్కువగా మొక్కజొన్న పంటను ఆశిస్తుంది. పంట లేనప్పుడు వరిజొన్నచెరకుపత్తికూరగాయలు వంటి ఇతర 80 రకాల పంట మీద తిని బ్రతుకుతుంది. 

నివారణ : 

సమగ్ర సస్య రక్షణ విధానం ద్వారా ఈ పురుగును నియంత్రించాల్సిన అవసరం ఉంటుంది.  

ఆలస్యంగా విత్తుకునే పంటలో ఈ పురుగు ఉధృతి ఎక్కువ కనుక మొక్కజొన్న సాగుచేసే రైతు సకాలంలో ఖరీఫ్‌ కాలంలో జూన్‌లోరబీ కాలంలో నవంబర్‌లో విత్తుకుంటే మంచిది. 

సయంత్రనిలిప్రోల్‌ 19.8 G థయామిథాక్సామ్ 19.8 ఎస్‌.ఎస్‌ 4 మి.లీ./ కిలో విత్తనం చొప్పున విత్తన శుద్ధి చేసుకోవాలి.  

మొక్కజొన్నలో అంతర పంటగా లేదా చుట్టూ కంచె పంటగా నాపియర్‌ గడ్డిని వేసుకున్నట్లయితే ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది. 

తొలిదశలో పురుగు ఆశించి గుడ్లు పెట్టకుండా ఉండేందుకువిత్తిన వారం రోజుకు వేప నూనె (10000 పి.పి.ఎం) 2 మీ.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

మొక్కజొన్న విత్తిన తరువాత 3-4 రోజుకు ఎకరా పొలంలోో 8-10 లింగాకర్షక బుట్టను అమర్చి పురుగు ఉధృతి గమనిస్తూ ఉండాలి.   

ప్రతి రెండు మూడు రోజుకు పొలాన్ని పరిశీలించి పురుగు గుడ్లులేదా పిల్ల పురుగు సమూహాలు కనిపిస్తే ఏరి నాశనం చేయాలి. 

అక్షింత పురుగుఆరుద్ర పురుగు వంటివి ఈ పురుగు పరాన్న భుక్కుగా పనిచేస్తాయి. కనుక పొలంలొ వీటి సంతతిని పెంచాలి.   

ట్రైకోగ్రామా గుడ్డు పరాన్న జీవును ఎకరానికి 20,000 గుడ్లు చొప్పున ట్రైకోకార్డు ద్వారా రెండు సార్లు పొలంలో వదలాలి. 

కొటేసియాటేలోనిమాస్‌ వంటి గుడ్డు పరాన్న జీవును కూడా వాడుకోవచ్చు.  

బి.టి.ఫార్ములేషన్‌ లీటరు నీటికి 2 గ్రా. చొప్పున కలిపి పురుగు ఉధృతి గమనించిన వెంటనే పిచికారి చేయాలి. మరియ రిలేయి వంటి శిలీంద్రజాతికి చెందిన జీవరసాయనం వాడి కూడా పురుగును అదుపు చేయవచ్చు.  

మూడవ దశ లద్దె పురుగును ఆకర్షించడానికి విషపు ఎరను సాయంత్రం వేళలో పొలంలో ఉంచాలి. విషపు ఎర తయారీకి 10కిలో తవుడు, 2 కిలో బెల్లం కలిపి ఒక రాత్రంతా పులియబెట్టిదానికి 500 మి.లీ. మోనోక్రోటోఫాస్‌ లేదా 300 గ్రా. థయోడికార్బ్‌ మందును కలిపి ఉండుగా చేసి పొలంలో  ఉంచాలి. 

పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటేనివారణకు ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 5% ఎస్‌.జి. 80 గ్రా. ఎకరానికి 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

పంట విత్తిన 40 – 45 రోజు దశలో లద్దె పురుగు నివారణకుస్పైనోసాడ్‌ 45 % ఎస్‌.సి 0.3 మి.లీ. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

పురుగు ఉధృతి తీవ్రతరం అయినప్పుడులామ్డా సైహలోత్రిన్‌ 20 % ఇ. సి మందు 200 మి.లీ. మందును ఎకరానికి 200 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. 

మందు పిచికారీ చేసేటప్పుడు మొవ్వు సుడుల్లో పడే విధంగా పిచికారీ చేస్తే పురుగు నివారణ సాధ్యమవుతుంది.  

Leave Your Comments

దేశవాళీ విత్తనమే మేలు.. మిద్దె తోట నిపుణులు రఘోత్తమ రెడ్డి

Previous article

నేరేడు పండు ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like