ఆహారశుద్ది

పండ్లు, కూరగాయలు తాజాగా ఉండాలంటే..తీసుకోవాల్సిన జాగ్రత్తలు

0

చాలామంది వారానికి సరికూడా కాయగూరలు, పండ్లను ఒకేసారి కొని ఇంటికి తెచ్చుకుంటారు. ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో పండ్లు, కాయగూరల్ని కొనడం వల్ల అవి వారం పాటు తాజాగా ఉండవు. మనం ఎంత జాగ్రత్తగా ఫ్రిజ్ లో పెట్టినప్పటికీ ప్రత్యేకించి ఈ వేసవిలో కొన్ని కాయగూరలు వడలిపోయి అవకాశం ఉంటుంది. మరి అలా జరగకుండా ఉండాలంటే వాటిని ఫ్రిజ్ లో అమర్చే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
దాదాపు అన్ని వంటకాల్లో ఉపయోగించే కూరగాయ టమాటో. అందుకే కిలోలకు కిలోలు వీటిని కొంటుంటారు చాలామంది ఈ క్రమంలోనే అన్నీ పండినవి కాకుండా కొన్ని పచ్చిగా ఉన్న టొమాటోలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇలా పూర్తిగా పండని టొమాటోలను గది ఉష్ణోగ్రత వద్ద, సూర్యకాంతి తగలకుండా నిల్వ చేస్తే రెండు మూడు రోజుల్లో పండుతాయి. అప్పుడు వాటిని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.
వెనిగర్, ఉప్పు, చక్కెర కలిపిన మిశ్రమంతో బయటి నుంచి తెచ్చిన కూరగాయలు, పండ్లను శుభ్రం చేసి ఫ్రిజ్ లో నిల్వ చేస్తే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
కొన్ని రకాల పండ్లు, కూరగాయలు ఇథలీన్ వాయువును విడుదల చేస్తాయి. అది ఆ పండ్లు, కాయగూరల్ని త్వరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. తద్వారా వీటి పక్కన నిల్వ చేసే ఇతర కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతాయి. కాబట్టి యాపిల్స్, ఆప్రికాట్స్, కర్భుజా .. వంటి ఇథలీన్ విడుదల చేసే పండ్లను ఫ్రిజ్ లో నిల్వ చేసినప్పటికీ వాటిని ఆకుకూరలకు దూరంగా ఉంచాలన్న విషయం గుర్తు పెట్టుకోండి.
కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే జిప్పర్ బ్యాగ్స్లో పెట్టి ఫ్రిజ్ లో నిల్వ చేయాలి. అలాంటి బ్యాగులు అందుబాటులో లేకపోతే మామూలు కవర్లకే చిన్న చిన్న రంధ్రాలు చేయచ్చు. ఫలితంగా కాయగూరలకు గాలి తగిలి అవి కూలిపోకుండా ఉంటాయి.
ద్రాక్ష పండ్లను నిల్వ చేసే ముందు వాటిని నీటితో బాగా కడిగి .. తడిలేకుండా ఆరబెట్టాలి. అనంతరం టిష్యు పేపర్లలో చుట్టి ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
వెల్లుల్లిని గది ఉష్ణోగ్రత వద్ద తేమ తగలని ప్రదేశంలో నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాటు తాజాగా ఉంటాయి.
బంగాళాదుంపలు, ఉల్లిపాయలను సాధారణ బుట్టల్లో గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి.
ఇక కట్ చేసిన కాయగూరల్ని బేకింగ్ సోడా ద్రావణంలో కడిగి నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. ఇలా శుభ్రం చేయడం వల్ల వాటిపై ఉన్న దుమ్ము ధూళీ కూడా తొలగిపోతాయి.
అరటి పండ్లను ఫ్రిజ్ లో పెట్టడం కంటే బయట ఉంచితేనే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిని ఫ్రిజ్ లో పెట్టడం వల్ల వాటి తొక్క త్వరగా నల్లగా మారుతుంది.
పుదీనా, కొత్తిమీర త్వరగా కుళ్లిపోవడం మనం గమనిస్తాం. అలా జరగకూడదంటే వాటిని పేస్ట్ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. లేదంటే వాటి కాడలను కత్తిరించి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Leave Your Comments

అస్పరాగస్ మొక్కల సాగు విధానం..

Previous article

మార్చి 29న హైదరాబాద్ లో సేంద్రియ మేళా..

Next article

You may also like