Rugose Spiraling Whitefly: మన దేశంలో కల్పవృక్షంగా పిలువబడే ఈ కొబ్బరి కోట్లాది మందికి జీవనోపాధి కల్పిస్తోంది. భారత దేశంలో 2021-22 సం॥లో కొబ్బరి పంట 2.18 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణం సాగుతో 21,206 మిలియన్ కాయల ఉత్పత్తి మరియు 9,678 కాయల ఉత్పాదకత హెక్టారుకు నమోదు చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో కొబ్బరి చెట్ల కు అనేక చీడపీడలు బారిన పడి కాయల ఉత్పత్తి, ఉత్పాదకత అనేది తగ్గుతుంది. ఈ చీడపీడల్లో ముఖ్యమైనది అన్యదేశపు సర్పిలాకార తెల్లదోమ, అలేరోడికస్ రుగియాపర్కలేటుస్ మార్టిన్.
దిగుబడి నష్టం :
ఈ తెల్లదోమ అమెరికా నుండి కొబ్బరి మొక్కలను దిగుమతి చేసుకోవడం ద్వారా మన దేశానికి ప్రవేశించింది. కొబ్బరితో పాటు ఆయిల్ పామ్, మామిడి, సపోట వంటి వాటిని ఆశించి దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు. ఈ తెల్ల దోమ యొక్క అపరిపక్వ మరియు వయోజన దశలు ఆకుల నుండి రసాన్ని పీల్చినప్పుడు, తేనె స్రావాన్ని విడుదల చేయడం వల్ల ఆకులు, ఈనల పై మసి అచ్చు ఏర్పడుతుంది. తద్వారా చెట్లకు కిరణ జన్య సంయోగక్రియ చర్య మరియు శక్తిని మరింత క్షీణింపజేసి, కాయల యొక్క దిగుబడి రూపంలో ప్రతిబింభిస్తుంది.
మన రాష్ట్రంలో కొబ్బరి సాగులో రకాలైన ఈస్ట్ కోస్ట్ టాల్, పొట్టి రకమైన గంగా బొండం, సంకర రకమైన గోదావరి గంగలో ఈ తెల్ల దోమ తాకిడిని గమనించవచ్చు. మరీ ముఖ్యంగా పొట్టి, సంకర రకాల్లో ఈ తెల్ల దోమ ఎక్కువగా ఆశిస్తుంది.
కాయల దిగుబడి నష్టం విషయానికి వచ్చేసరికి గోదావరి గంగ హైబ్రిడ్‌లో 7-29 శాతం, ఈస్ట్ కోస్ట్ టాల్ లో 6-25 శాతం నష్టం వాటిల్లుతుంది. ఈ రుగోజ్ తెల్ల దోమ ఉధృతి ఎక్కువ అయ్యేకొద్ది కొబ్బరి ఆకుల నత్రజని స్థాయి గణనీయంగా తగ్గి, పత్రహరితాన్ని కోల్పోయి, కిరణ జన్య సంయోగక్రియ చర్య పై ప్రతికూలం గా ప్రభావితం చేస్తుంది. తద్వారా కాయల దిగుబడి గణనీయంగా తగ్గి, నష్టం వాటిల్లుతుంది.
ఈ తెల్ల దోమ సమర్థవంతమైన నివారణ కొరకు రసాయన పురుగు మందుల పై ఆధారపడి, దాని విచక్షణా రహిత వినియోగం వలన పురుగు పునరుద్ధరణకు, రసాయన అవశేషాలు చుట్టుకుంటాయి. తద్వారా మానవులకు విషపూరితం కాకుండా పర్యావరణ అనుకూలమైన జీవనియంత్రణ పద్ధతులు ఎంచుకోవాలి.
నివారణ పద్ధతులు :
1. కొబ్బరి చెట్టుకు పసుపు జిగురు అట్టలు సంస్థాపన చేయటం వలన, ఈ తెల్ల దోమ పసుపు రంగుకు ఆకర్షించబడి, అతుకుంటాయి.
2. ఈ రూగోస్ ఉధృతి మొదలైనప్పుడు తక్షణమే అజాడిరక్టిన్ 10,000 పిచికారి చేయటం వలన ఈ తెల్లసొన యొక్క గుడ్లు, పిల్ల దశలు పై ప్రభావవంతంగా ఉంటాయి.
3. ఇంకా ఎంటోమోపతోగేనిక్ ఫంగై ద్రావణం అయినటువంటి ఐశారియా ఫ్యూమసరోసీయా కు టీపాల్ (జిగురు మిశ్రమం) కలిపి పిచికారి చేయాలి.
4. ప్రయోగశాలలో తయారు చేసిన ఎన్ కార్సియా గుడెలోపే అనే బదనికలు విడుదల చేయటం ద్వారా తెల్ల దోమ యొక్క పిల్ల దశలో గుడ్లు పెట్టి తదుపరి దశలకు వెళ్లకుండా ఆపుతుంది.
5. డా. వై. యస్. ఆర్. హెచ్ యు – ఉద్యాన పరిశోధన స్థానం వాళ్ళు ప్రయోగశాలలో ప్రమాణీకరించబడిన సహజ శత్రువు అపెర్టోక్రైసా ఆస్తర్ అనే పరాన్న బక్కు గుడ్లు ఏ 500-600 ఒక్క చెట్టు ఆకుల క్రింద భాగానికి క్లిప్పింగ్ చేయటం వలన ఈ తెల్ల దోమను అరికట్టవచ్చు. ఈ పరాన్న బక్కు యొక్క గ్రబ్స్ (పిల్ల దశలు) తెల్ల దోమ గుడ్లు, పిల్ల పురుగులు తిని తెల్లదోమను అరికడుతుంది.