వ్యవసాయ పంటలు

Rice Grains Auction: యాసంగి ధాన్యం బహిరంగ వేలం.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌.!

0
Telangana Paddy Procurement
Rice Grains

Rice Grains Auction: ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, నిల్వచేసుకోవడానికి గోదాములు సౌకర్యం లేక రైతులు, వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గడిచిన రెండు సీజన్లలో సంబంధించి కోటి టన్నులకు పైగా ధాన్యం నిల్వలున్నాయి. మరో కోటి టన్నులకు పైగా ధాన్యం వచ్చే అవకాశం ఉంది. అయితే నిల్వచేసుకోవడానికి గోదాముల సౌకర్యం లేదు. వర్షాలు కురిస్తే ధాన్యం రంగు మారుతుంది. రైస్‌ మిల్లుల్లో స్థలం లేక ఇప్పటికీ కొన్ని మిల్లులో ధాన్యం బస్తాలు ఆరుబయటే దర్శనం ఇస్తున్నాయి.

మరోవైపు నాణ్యత ప్రమాణాలు లేవంటూ భారత ఆహార సంస్థ బియ్యాన్ని తీసుకోవడంలో నిరాకరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని బహిరంగ వేలం లో విక్రయించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. పౌరసరఫరాల శాఖ 66.02 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సేకరించి మిల్లర్లకు అప్పగించింది. ఈధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ కింద మరాడించి 44.22 లక్షల టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి ఇవ్వాల్సి ఉంది. నిల్వ చేసేందుకు స్థలం లేక మిల్లర్లు ఆరుబయటే ఉంచేశారు.

Also Read: రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయుటకు చేపట్టాల్సిన వ్యూహాత్మక చర్యలు.!

Mtu-1282 Paddy Seeds

Rice Grains Auction

రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయం

ఈఏడాది కొన్ని కారణాల వల్లన రైస్‌ మిల్లుల్లో ధాన్యం నిల్వలు పూర్తిగా పేరుకుపోయాయి. ఈనేపధ్యంలో సీఎంఆర్‌ డెలివరీ, ధాన్యం మిల్లింగ్‌పై సమీక్ష అనంతరం ఈనిర్ణయం తీసుకున్నారు. వేలం ప్రక్రియ కోసం రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. సభ్యులుగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ ఎండీ, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ ఉంటారు.రాష్ట్రంలో ఎంత ధాన్యం నిల్వ ఉందో పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు..

శాంతి కుమారి ఉత్తర్వులు జారీ

బహిరంగ వేలం వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నాణ్యత లేదంటూ కొర్రీలు పెడుతోంది. ఏమి చేయలేని పరిస్ధితుల్లో ధాన్యం వేలానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈమేరకు తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రెండు సీజన్లకు సంబంధించి కోటి టన్నులకు పైగా ధాన్యం నిల్వ ఉంది. మరో కోటి టన్నులకుపైగా ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కొన్ని సమస్యలు వల్లన రాష్ట్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని బహిరంగ వేలం లో విక్రయించాలని నిర్ణయం తీసుకుంది ఈఏడాది వర్షాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి రైస్‌ మిల్లుల్లో ఉన్న ధాన్యం నిల్వలను వేలం వేసేందుకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో ఎంత ధాన్యం నిల్వ ఉందో పరిశీలించి రాష్ట్ర స్థాయి కమిటీ ధర నిర్ణయిస్తుంది.

Also Read: పండ్ల తోటల్లో చేపట్టవలసిన పనులు, సూచనలు.!

Leave Your Comments

Plants Cultivation: 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం.!

Previous article

Oil Palm Cultivation: రోజురోజుకు పెరుగుతున్న ఆయిల్‌పామ్‌ సాగు.!

Next article

You may also like