Oil Palm Cultivation: తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు అనేది రోజురోజుకు పెరుగుతోంది. కారణం ఉద్యానశాఖ కల్పిస్తున్న ప్రోత్సాహాకాలు సాగుపై రైతులు మక్కువ పెంచుకుంటున్నారు. అయితే దీర్ఘకాలపంట అయినా ఆయిల్‌పామ్ సాగు ద్వారా దీర్ఘకాలం లాభాలు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వాలు అన్నదాతలకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేసే దిశగా చర్యలు చేపట్టింది. రాయితీలు, మొక్కలు, డ్రిప్ పరికరాలు వంటివి అందించి ప్రోత్సహిస్తోంది. ప్రధాన పంటలు అయినా వరి, పత్తి, కంది, మొక్కజొన్న లకు మద్దతు ధర దక్కక రైతులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు దీర్ఘకాల పంటలను ఎంచుకుంటున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వరి, పత్తి పంటలకు రైతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. వరి సాగు విస్తీర్ణం మరింత పెరగడంతో ధాన్యం కొనుగోళ్లలో ఏర్పడుతున్న ఆటుపోట్లతో గట్టెక్కేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోంది. అంతేకాకుండా ఆయిల్‌పామ్ సాగుకు అనువైన నేలలు ఉన్నాయని ప్రభుత్వ సర్వే పేర్కొంది.
Also Read: 10 ఎకరాల్లో 9 వేల రకాల మొక్కల పెంపకం.!
ఇందులో భాగంగా 2021-22 ఆర్థిక సంవత్సరంలో 426 ఎకరాల్లో, 2022-23లో 3,210 ఎకరాలకు పైగా ఆయిల్‌పామ్ సాగు జరిగింది. ఈ సాగు విస్తీర్ణం మరింత పెంచేందుకు ఉద్యాన-పట్టు పరిశ్రమ, వ్యవసాయ శాఖ అధికారులు, ఉపాధి హామీ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోంది. మార్కెట్లో ఒక్క మొక్క ధర రూ.250 ఉండగా ప్రభుత్వం రూ.20లకే ఇస్తోంది. ఉపాధి పథకం ద్వారా మొక్కలను పెంచడం చేస్తున్నారు. అంతేకాకుండా అంతర పంటగా పత్తి, మిరప, పప్పు ధాన్యాల సాగు చేస్తున్నారు. దీని ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రత్యేక దృష్టి సారించారు. ఈసాగుపై ఆసక్తి కల్గిన రైతులు పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా జిరాక్స్ లు, పాస్‌ఫొటోలతో ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ ఉంది. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
Also Read: కాసుల వర్షం కురిపిస్తున్న వాక్కాయ సాగు.!