NEERAE-2023: విస్తరణ విధ్యా సంస్థ వజ్రోత్సవాల సందర్భంగా జరుగుతున్న జాతీయ విస్తరణ సదస్సు రెండవ రోజు జరిగిన కార్యక్రమంలో టెక్నికల్ నిపుణుడు – ఐక్యరాజ్యసమితి డిజిటల్ వ్యవసాయం, డాక్టర్ షేక్. ఎన్. మీరా ప్రసంగిస్తూ ప్లాట్ ఫామ్ ఆధారిత, వ్యవస్థీకృత విస్తరణ విధానాలకు నాలుగవ పారిశ్రామిక విప్లవంలో తగిన ప్రాధాన్యత కల్పించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ నుంచి ఇంటర్నెట్ ఆఫ్ రైతులుగా వ్యవసాయ సంస్థలు, శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రాలు డిజిటల్ విప్లవంలో భాగం కావాలని పిలుపునిచ్చారు.
జాతీయ వ్యవసాయ పరిశోధన, విస్తరణ సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ వెంకట కుమార్ ప్రసంగిస్తూ నైపుణ్యాభివృద్ధి, నవ కల్పనల అభివృద్ధి, నిరంతర శిక్షణతోనే వ్యవసాయ విస్తరణ సేవలలో మార్పు ఆశించవచ్చని పేర్కొన్నారు. విస్తరణ సేవలు భవిష్యత్ తరాలకు మెరుగుగా అందించవలనంటే కృత్రిమ మేధ, వెబ్-2.0 లకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.
Also Read: అమృతాన్ని తలపించే .. రాజానగరం సీతాఫలం.!
న్యూఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్రనాద్ పడారియా మాట్లాడుతూ వ్యవసాయ నవ కల్పనల అభివృద్ధి జరగాలంటే నూతన వ్యవసాయ శాస్త్రీయ పద్ధతులు, విస్తరణ పరిశోధనలపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. బెంగళూరు లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఎస్.వి. సురేషా ప్రసంగిస్తూ వ్యవసాయ విస్తరణ అధికారులు, శాస్త్రవేత్తలు శాస్త్ర సాంకేతిక రంగాలలో వస్తున్న నూతన ఒరవడులను అందిపుచ్చుకొని వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈరోజు కార్యక్రమంలో డాక్టర్ జి.వి రామాంజనేయులు సుస్థిర వ్యవసాయ కేంద్రం, హైదరాబాద్, విస్తరణ సంచాలకులు డాక్టర్ వి. సుధారాణి, విస్తరణ విద్యా సంస్థ సంచాలకులు డాక్టర్ ఎం. జగన్ మోహన్ రెడ్డి, 50 కి పైగా ఉపన్యాసాలతో ఈ జాతీయ సదస్సులో శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: ప్రకృతి విలువ ఆధారిత వాణిజ్య పంటగా వెదురు.!