Organic Vegetable Garden: మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందించడంలో కూరగాయల పాత్ర చాలా ముఖ్యమైనది. ప్రపంచ ఆహార సంస్థ నిర్దేశించిన ప్రకారం ప్రతి మనిషి రోజుకు 300 గ్రాములు ఆహారంలో కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ మనదేశంలో మాత్రం కేవలం 230 గ్రాములు మాత్రమే లభ్యమవుతున్నాయి. కావున కూరగాయల ఉత్పత్తిని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచంలో చైనా తర్వాత భారతదేశం కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఉత్పాదకతలో వెనుకబడి ఉంది. అయితే తక్కువ సమయంలో మంచి దిగుబడి వచ్చే పంటలకే అన్నదాత ప్రాధాన్యత ఇస్తున్నారు.
పాలకూర వంటి బహువార్షిక పంటలకు ప్రాముఖ్యత పెరిగిన, టమాటా కు విపరీతమైన ధర రావడంతో మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు వైపు వెళ్తున్నారు. దీంతో మార్కెట్లో ఒక్కసారిగా కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. ఇలాంటి సమయంలోనే ఇంట్లో కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మనకు ఉన్న కొద్దిపాటి స్థలంలో కూరగాయలను సాగుచేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా పాలకూర వంటి పంటలను వేసి సంవత్సరంలో మూడు సార్లు పంటను తీసుకోవచ్చు.
Also Read: కాసుల పంట, ఒక్కసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి..
అధిక దిగుబడిని ఇచ్చే పాలకూర
సాంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు ప్రత్యామ్నాయ వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ సమయంలో ఆధిక దిగుబడిని ఇచ్చే పంటలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా పాలకూర వంటి బహువార్షిక పంటలకు కూడా ప్రాముఖ్యత పెరిగింది. దీనిలో పోషకాలు మొండుగా ఉండటంతో ఈసాగువైపు వెళ్ళుతున్నారు. ఈమధ్యకాలంలో టమాటోకు ధర రావడంతో వినియోగదారులు కూరగాయలు, ఆకుకూరల వైపు మళ్లుతున్నారు. తీగ వచ్చే పంటలు కాకుండా కొన్ని రకాల కూరగాయలను కూడా సాగు చేసుకుంటున్నారు. అందులో ఆకుకూరలను కూడా తక్కువ స్థలంలో పండిస్తున్నారు.
మెంతీ కూర, కోతిమీర, తోటకూర, పాలకూర వంటి ఆకు కూరలను సాగుచేసి లాభాలను పోందుతున్నారు. ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండా పంటలను పండిస్తున్నారు. పాలకూరను మూడు సీజన్లలో పండిస్తారు. ఫలితంగా, ఇది చాలా లాభదాయకమైన పంట అని చెప్పకోవచ్చు. చలికాలంలో మాత్రమే పాలకూర తినడానికి చాలా మంది ఇష్టపడతారు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. అంతేకాకుండా పాలకూర సాగును చాలా తక్కువ ఖర్చుతో పండించి అధిక దిగుబడిని తీస్తున్నారు.
మన ఇంట్లో బాల్కనీ, ఇంటి డాబాపై వేసుకోవచ్చు
మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక వంటి రాష్ట్రాల్లో పాలకూర సాగుకు అనుకూలంగా ఉంటుంది. పాల కూరను దాదాపు సంవత్సరం పొడవునా దీనిని పండించవచ్చు. విత్తనాలను కుండీలలో కూడా విత్తుకోవచ్చు. లేదా మన ఇంట్లో బాల్కనీ, ఇంటి దాబాపైన వేసుకోవచ్చు. ముందుగా మనం ఎక్కడైతే సాగు చేయాలని అనుకుంటున్నామో అందులో పాలకూర విత్తనాలను నాటుకోవాలి. వరుసలలో విత్తనాలు విత్తేటప్పుడు రెండు వరుసల మధ్య 25-30 సెం.మీ దూరం ఉంచాలి. మొక్కలను దట్టంగా నాటితే పంట ఎదుగుదల తగ్గే అవకాశం ఉంది. ఇది ఆకు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. దీంతో పంట నాణ్యత పడిపోతుంది. నేలలో తేమ కూడా ఉండేలా చూసుకోవాలి. ఇలా ఇంట్లోనే కూరగాయల సాగు చేసి అధిక లాభాలను పొందవచ్చు.
Also Read: నిమ్మ తోటల్లో అధిక దిగుబడులకు రైతులకు మేలైన సూచనలు.!