Zero-Budget Natural Farming: రైతులు లాభమైన, నష్టమైన ఆదాయాన్ని ఇచ్చే పంటలను వేసుకుంటున్నారు. తమకున్న కొద్దిపాటి కమతంలోనే పంటలను సాగు చేసుకుంటూ తమ ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది రైతులు దీర్ఘకాలిక పంటల జాబితాలో పండ్ల తోటలను వేసుకొని లాభాలను అర్జిస్తున్నారు. ముఖ్యంగా పండ్ల తోటలు సాగు చేసే రైతులు దిగుబడి పొందాలంటే కనీసం ఒక సంవత్సరం దాకా ఎదురు చూడాలి. మామిడి, బత్తాయి, ఆయిల్ ఫామ్ లాంటి పంటలు అయితే దిగుబడి పొందాలంటే కనీసం 3 సంవత్సరాల దాకా ఎదురు చూడవలసి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కొంత మంది రైతులు వ్యవసాయ అనుబంధ రంగాలను ఎంచుకుంటున్నారు. మరికొంత మంది అంతర పంటలను సాగు చేసుకుంటున్నారు. దీనికి అనుబందంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీరోబడ్జెట్ నాచురల్ ఫామింగ్ శాఖకు చెందిన అధికారులు ఏటిఎం మోడల్ నమూనాను రైతులకు పరిచయం చేస్తున్నారు. ఈమోడల్లో రైతులు నిత్యం పంటలనుంచి ఆదాయం గడించవచ్చు. మామిడి తోటలో ఈఏటిఎం మోడల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు.
మామిడిలో ఈఏటిఎం మోడల్
రైతులు మామిడిలో సేంద్రియ వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. ప్రకృతి వ్యవసాయం గురించి తెలుసుకొని అప్పటి నుంచి రసాయనాలను ఆపి పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారు. అవసరాన్ని పిచికారీ చేస్తూ వస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పెట్టుబడులు బాగా తగ్గాయి. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో మారిన తర్వాత దిగుబడి, నాణ్యత పెరగడంతో పాటు పెట్టుబడులు తగ్గాయన్నారు. కాబట్టి మామిడి సాగు లాభదాయకం గా ఉందని కానీ దిగుబడి సంవత్సరంకు ఒక్కసారి మాత్రమే రావడం వలన సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే డబ్బు అందుబాటులో ఉంటుందని సమస్యకు పరిష్కారంగా జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ అధికారులు ఏటిఎం పద్ధతి గురించి తెలుసుకున్నామని అన్నారు. ఈఏటిఎం మోడల్లో రైతులు నేలను సక్రమంగా సద్వినియోగం చేసుకోవడంతో పాటు మామిడి తోటలలాంటి పండ్ల తోటల మధ్యలో ఏటిఎం మోడల్లో పంటలు సాగు చేసినపుడు కలుపు సమస్య తగ్గడంతో పాటు ప్రధాన పంటకు పోషకాలు సక్రమంగా అంది దిగుబడి బాగుంటుంది.
నిత్యం ఆదాయాన్ని ఇచ్చే పంటలు
ఈమోడల్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే రైతుకు ప్రతి రోజు ఆదాయం కల్పించాలి. అందుకు అనుగుణంగా వివిధ రకాల ఆకుకూరలు అయినా వంగ, మిరప, టమాట, బెండ లాంటి కూరగాయలు, ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ లాంటి దుంప జాతి కూరగాయలు, అలసందల లాంటి పప్పు జాతి పంటలు సాగు చేస్తున్నారు. ఆకుకూరలు నాటిన 20 రోజుల నుంచి దిగుబడి రావడం మొదలవుతుంది. ఆతరువాత వంగ, మిరప, టమాట లాంటి కూరగాయలు, ముల్లంగి, క్యారెట్ బీట్రూట్ లాంటి దుంప జాతి కూరగాయలు ఆతరువాత అలసందలు, మొక్కజొన్న దిగుబడి వస్తుంది. కాబట్టి రైతుకు ప్రతినిత్యం ఆదాయం రావాలనే లక్ష్యంతో మొదలు పెట్టిన ఏటిఎం మోడల్ని రైతులు సాగు చేసి విజయం సాధించాడు. జీరోబడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ సిబ్బంది ద్వారా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకుని తమ రసాయన సేద్యాన్ని ప్రకృతి సేద్యంలో మార్చడం వలన మనకు పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడి, నాణ్యత పెరిగింది.
Also Read: