పశుపోషణ

Quail Farming: కంజు పిట్టల పెంపకంలో ఆదాయం.!

1
Quail Farming
Quail Birds

Quail Farming: కంజు పిట్టలనే పరిఘ పక్షులు అని అంటారు. అవి చూడటానికి చిన్నవిగా, మన పిచ్చుకల మాదిరిగా, కొంచెం పెద్దగా ఉండి కరెంటు తీగల మీద అలా తారస పడుతూ ఉంటాయి. అవి అడవి జాతికి చెందినవి. పెడ్డులో పెంచుకోవడానికి జపనీస్ క్వయిల్ అనువైన రకం. ఈజపనీస్ క్వయిల్ ను మాంసం గుడ్లు ఉత్పాదన కోసం పెంచుకోవచ్చు. మిగతా కోళ్ల రకాలతో పోలిస్తే కంజు పిట్టలకు వ్యాధి నిరోధకత చాలా ఎక్కువ. ఎటువంటి టీకాలు అవసరం లేదు.

ఈపిట్టలు 5 వారాల వయస్సుకే మాంసం కోసం అమ్ముకోవచ్చు. మరల ఆరో వారం నుంచి గుడ్డు పెట్టడం మొదలు పెడుతాయి. ఐదు వారాల వయస్సులో ఇవి 100-200 గ్రా వరకు బరువు తూగుతాయి. వీటి మాంసంలో మాంసకృత్తులు మిగతా కోళ్ల మాంసం కంటే అధిక మోతాదులో లభిస్తాయి. దేశంలోని మొత్తం కోళ్ల సంఖ్యలో 1.8 శాతం కంజు పిట్టలున్నాయి. మారిన ఆహారపు అలవాట్లు పెరిగిన తలసరి ఆదాయం కలిగిన అవగాహన వల్ల నేడు రైతులు ప్రత్యామ్నాయ కోళ్ల పట్ల మక్కువ చూపిస్తున్నారు. అటువంటివాటిలో కంజు పిట్టల పెంపకం ఒకటి.

కంజు పిట్టల పెంపకం

కంజు పిట్టల ఉదర భాగం బూడిద రంగు కలిగి శరీరం మొత్తం ముదురు నుంచి లేత గోధుమ రంగులో ఉంటుంది. బయట మార్కెట్లో పిల్లలు లభ్యం అవుతాయి. పిల్లలు ఏడు తొమ్మిది గ్రాముల బరువు ఉండి సున్నితంగా ఉంటాయి. వీటికి మొదటి వారంలో 95, 99 ఫారన్ హిట్ వరకు వేడిని అందించాలి. మొదటి వారంలో తీసుకునే జాగ్రత్తలు దాదాపు ఫారన్ హిట్ కోడి పిల్లల బ్రూడింగ్ మాదిరిగానే చేసుకోవాలి కాకపోతే కంజు పిట్టలు చిన్నపాటి శరీరం వలన వాటికి మామూలు ఇతర కోడి పిల్లల కంటే అధిక ఉష్ణోగ్రతను అందించాలి.

Also Read: ఏడాదంతా ఆదాయాన్నిచ్చే ఆకుకూరల సాగు.!

Quail Farming

Quail Farming

ఒక బ్రీడర్ 100- 150 అంగుళాలు వెడల్పుగా ఉంటే దానిలో 250- 300 వరకు పిల్లలను ఉండవచ్చు. మొదటివారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతను ఐదు ఫారెన్ హిట్ చొప్పున తగ్గిస్తూ అది 70- 75 ఫారం హిట్ వచ్చేవరకు బ్రీడింగ్ చేయాలి. దాదాపు మూడు వారాల వయసు వచ్చేసరికి ఈకలు బాగా పెరిగిన తరువాత మగ ఆడ కంజులను వేరు చేయవచ్చు. సాధారణంగా ఆడపక్షులు ఉదర భాగంలో ఉండే ఈకల పైన నల్లటి మచ్చలు ఉండి మగవాటి కంటే అధిక బరువు తూగుతాయి. మగ పక్షులు ఉదర భాగం గోధుమ వర్ణంలో ఉంటుంది

గుడ్లు పెట్టే కోళ్ల పెంపకం

కంజు పిట్టలు ఆరో వారం నుంచి గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి. అవి 13 -14 వారాలు వచ్చేసరికి గుడ్లు ఉత్పత్తి 90-95 శాతానికి చేరుతోంది. ఏడాదికి దాదాపు 250 270 గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. గుడ్లు 10 12 గ్రాముల బరువు ఉండి, పెంకు కొంచెం నల్లని మచ్చలతో ఉంటుంది. పోషణ పరంగా కోడిగుడ్డు కంటే రెండు శాతం అధిక మాంసకృతులు ఇందులో లభ్యమవుతాయి. కంజు పిట్టలకు, మిగతా కోళ్ల కంటే కొంచెం అధిక మోతాదులో మాంసకృతుల అవసరం. బయట మార్కెట్లో ప్రత్యేకంగా కంజు పిట్టలు దాణా లభిస్తే దొరికిన దాణాకి కొద్ది మోతాదుల అవసరం మేరకు సోయా చెక్కని కలిపి వాడుకోవాలి. సాధారణంగా కంజులు మొదట అయిదు వారాల వయసు వరకు 500-600 గ్రాముల వరకు దాణా తింటాయి. గుడ్లు పెట్టే దశలో దాదాపు రోజుకు సగటు 25 గ్రాములు దాణా అవసరం.

Also Read: స్థిరమైన ఆదాయాన్నిచ్చే లిల్లీ పూల సాగు.!

Leave Your Comments

Green Leafy Vegetables Cultivation: ఏడాదంతా ఆదాయాన్నిచ్చే ఆకుకూరల సాగు.!

Previous article

Tilapia Fish: తిలాపియా చేపల అమ్మకం తో ఉపాధి.!

Next article

You may also like