Sheep Caring in Rainy Season: వ్యవసాయ అనుబంద రంగాలైన పాడి పరిశ్రమ తరువాత అత్యంత ఆదరణ పొందిన రంగం జీవాల పెంపకం. ప్రస్తుత వాణిజ్య సరళిలో చాలామంది జీవనోపాధి కోసం గొర్రెల ఫారాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఉపాధిని పొందుతూ లాభాలను అర్జిస్తున్నారు. పెంపకదారులు తమకున్న కొద్ది స్థలంలోనే ఫారాలను ఏర్పాటు చేసుకొని ఆదాయాన్ని పొందుతున్నాడు. అయితే వర్షాకాలంలో గొర్రెల పెంపకందారులకు కొంత గడ్డుకాలమే అని చెప్పాలి.
ముఖ్యంగా ఆరు బయట తిరిగే మేకలు గొర్రెలు పచ్చిగడ్డిని తింటూ, చెరువులో, మురికి కాలువల్లో నీటిని తాగుతూ, తొలకరి జల్లులకు తడుస్తూ ఉండటం వల్ల పలు రకాల రోగాలకు గురౌతాయి. వానాకాలంలో ఎక్కువగా చిటుక రోగం, గాలికుంటు, నీలినాలుక, పిపిఆర్ వంటి రోగాలు వచ్చి చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటి నుంచి జీవాలను రక్షించడానికి పలురకాల జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యాక్టీరియా వల్ల కలిగే రోగాలు
గొర్రెలకు మేత పుష్కలంగా దొరికిన వ్యాధులు సోకే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జల్లులకు మొలచిన గడ్డి తిని చిటుకు వ్యాధి వస్తుంది. అన్ని వయసు గొర్రె లన్ని ఈ వ్యాధికి గురవుతాయి. అందువలన తొలకరి జల్లులు కురిసే ఒక నెల ముందు చిటుకు వ్యాధి టీకాలను గొర్రెలకు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి గొర్రెలను కాపాడవచ్చు. వర్షాకాలంలో చిత్తడినేలలో ఎక్కువసేపు తిరగడం వలన బ్యాక్టీరియా వలన కాలి పుండు వ్యాధి సోకుతుంది. వ్యాధి సోకిన గొర్రెల కుంటుతూ నడుస్తాయి. ఈ వ్యాధికి టీకాలు ఉండవు కాబట్టి గొర్రెలను బురద నేలలో తిరగకుండా జాగ్రత్తగా చూడాలి.
Also Read: పంటను తినేస్తున్న నులి పురుగులు.!
గొర్రెల్లో అధిక నష్టాన్ని కలిగించే మరొక రోగం పిపిఆర్. దీనిని పారుడు రోగం అని అంటారు. ఇది సూక్ష్మాతిసూక్ష్మ మైన జీవుల వల్ల గొర్రెలకు సోకుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. నివారణే ముఖ్యం. సంవత్సరంలోపు పిల్లలకు ఈ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ. వర్షాకాలంలో ఈగలు, దోమలు బెడద ఎక్కువగా ఉంటాయి. క్యులికోయిడ్స్ అనే దోమ కాటు వలన ఆరోగ్యంగా ఉన్న గొర్రెలలో కూడా ఆర్బోవైరస్ సంక్రమించి నీలినాలుక వ్యాధికి గురౌతాయి. ఈ వైరస్ రక్తనాళంను నాశనం చేస్తాయి. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా టీకాలు వేయడం వల్ల వ్యాధిని నివారించి అధిక దిగుబడిని పొందవచ్చు. గాలికుంటు వ్యాధి సోకిన గొర్రెలకు నోరు మరియు గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి.
గొర్రెలు కుంటుతూ మేత మేయదు. ఈ వ్యాధి వ్యాపించి పెంపకందార్లకు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. ఇది గాలి ద్వారా వ్యాపిస్తుంది. అంతేకాకుండా బూజు పట్టిన ఆహారాన్ని గొర్రెలకు మేపితే అఫ్లాటాక్సికోసిస్ అనే ఫంగల్ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. అందువలన రైతులు స గొర్రెలకు ఆహారం వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. తొలకరి జల్లులకు గొర్రె పిల్లల్లో ఎక్కువగా ఊపిరితిత్తుల వ్యాధులు సోకి 30% మరణాలు సంభవిస్తాయి. వర్షాకాలంలో జీవాలు వ్యాధి బారిన పడితే వెంటనే పశు వైద్యాధికారిని కలిసి తగిన చికిత్స జీవాలకు అందించడం ద్వారా రైతులు నష్టాల బారిన పడకుండా ఉంటారు.
Also Read: టీ ట్రీ ఆయిల్ ల్లోని ఉపయోగాలు.!