Leafy Vegetables Cultivation: వ్యవసాయమంటేనే కష్టాల, నష్టాల సాగు. కండ బలాన్ని గుండె నిబ్బరాన్ని పంట చేనుకు అంకితమిచ్చే రైతుకు ఈరోజుల్లో నష్టాలు, కష్టాలు అనేవి సర్వసాధారణమయ్యాయి. అన్నదాతలు ఎప్పుడైతే పురుగుమందుల వెంటపడ్డారో అప్పుడే రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. పెట్టుబడి కొండంత అవుతుంటే దిగుబడి, రాబడి మాత్రం గోరంతే వస్తోంది. దీంతో రైతులు నష్టాల భారీన పడుతున్నారు. ఈనేపధ్యంలో రైతులు తన సాగు పంధాను మార్చుకోవాలని అనుకుంటున్నారు. అయితే వీటన్నింటినీ ఎదురించి ప్రకృతి విధానంతో ఆకు కూరల సాగుచేస్తూ లాభాలు పొందుతున్నారు అన్నదాతలు
తక్కువ పెట్టుబడితో ఆధిక లాభాలు
ప్రకృతి విధానంలో వ్యవసాయం చేస్తూ ఆకుకూరలను అధికంగా సాగు చేస్తున్నారు. పురుగుమందుల వాడడం వల్ల నష్టాలను తెలుసుకున్న రైతులు ప్రత్యామ్నాయ పద్ధతిలో సేంద్రియ సాగు విధానాన్ని ఎంచుకున్నారు. ఈవిధానంలో సుమారు వంద ఎకరాల్లో రైతులు ఆకుకూరలు సాగు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడి,శ్రమతో ఆధిక లాభాలను ఆర్జిస్తున్నారు. దీంతో మిగిలిన రైతులు కూడా ఆకుకూరల సాగుకు మొగ్గు చూపుతున్నారు. తోటకూర, గోంగూర, పాలకూర, మెంతికూర, పుదీనా, చుక్కకూర, బచ్చలికూర, కరివేపాకు వంటివి ఎక్కువగా పండిస్తున్నారు. ఇరువైపుల ఎట్టు చూసిన కనుచూపు మేరలో పచ్చగా ఆకుకూరలు దర్శనం ఇస్తున్నాయి.
Also Read: Cotton Cultivation Management Practices: పత్తి పంటలో సమగ్ర యాజమాన్య విధానాలను పాటిస్తే మేలు.!
ఇళ్లలో ఉన్న కొద్ది పాటి ఖాళీ స్ధలంలో కూడా ఆకుకూరలు వేసి మహిళలు కుటుంబ ఆవసరాలను తీర్చుకుంటున్నారు. ఆకుకూరలు సాగు చేసేందుకు ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల ఖర్చవుతుందని ఈసాగులో 50 వేల వరకు డిమాండ్ ను బట్టి ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. పంట చేతికి 15 రోజుల్లో వస్తుందని కూలీల అవసరం కూడా పెద్దగా లేకపోవడం ఈపంటకు కలిసి వచ్చిందని రైతులు అంటున్నారు.
రోజుకు 1000 నుంచి 1500 ఆకు కూరల కట్టలు
రసాయన ఎరువులను ఎక్కువగా వాడటం ద్వారా పెట్టుబడి పెరగడంతో పాటు దిగుబడులు కూడా తగ్గాయని రైతులు అన్నారు. సేంద్రియ వ్యవసాయ విధానంలో పెట్టుబడులు తగ్గి దిగుబడుల పెరిగాయని దీనిద్వారా ఆధిక లాభాలను అర్జిస్తున్నామని రైతులు అంటున్నారు. రోజుకు 1000 నుంచి 1500 ఆకు కూరలు అమ్ముకుంటున్నామని రైతులు అంటున్నారు. మార్కెట్ అవసరం లేకుండానే పొలం దగ్గరే పంటను అమ్ముకుంటున్నారు. పురుగుమందులు వాడి ఖర్చులను పెంచుకోవడం కంటే సేంద్రియ వ్యవసాయం మిన్న అని అకుకూరల రైతులు అన్నారు.
Also Read: Steps to Boost Grape Yield: ద్రాక్ష దిగుబడిని పెంచడానికి రైతులు అనుసరించాల్సిన మార్గాలు.!