Diseases of Cattle: పశువులకు సోకే వ్యాధుల్లో గొంతు వాపు ప్రమాదకరమైనది. ఈవ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. వర్షాకాలంలో పశువులకు సూక్ష్మజీవుల వలన సంక్రమిస్తుంది. ఇది పశువుల్లో తొలకరి వర్షాలు పడినప్పుడు కలుషితమైన నీరు మేత ద్వారా రోగనిరోధక శక్తి తగ్గి వ్యాధులు వ్యాధి బారిన పడతాయి. వర్షాకాలంలో వ్యాధి ఎక్కువగా దున్నలు గేదెలలో వస్తోంది. నీరసంగా ఉన్న పశువులకు వ్యాధి త్వరగా సోకుతోంది. పల్లపు ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచే ప్రాంతాలలో ఈవ్యాధి ఎక్కువగా వస్తుంది. ఇది అంటువ్యాధి ఇతర పశువులకు సోకుతుంది. ఈవ్యాధి పాడిపశులకు సోకితే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఈవ్యాధి పాశ్చరెల్లా ముల్లోసిడా అనే సూక్షజీవి వల్లన వస్తుంది. ఈ సూక్ష్మజీవి ప్రధానంగా ఉష్ణ దేశాల్లో వ్యాపించి ఉంటుంది.
పశువు నోటి నుంచి కారే చొంగ ద్వారా వ్యాధి
రాష్ట్రంలో ఈసూక్ష్మజీ వ్యాప్తి చెందినందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున తగు జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రాంతాలలో పాడి గేదెలు ఆవులు వ్యాధి బారిపడినట్లు చెప్తున్నారు. ఎనిమిది నెలల నుంచి రెండేళ్లలోపు ఉన్న పశువులకు వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గొంతు వాపు వ్యాధి బారిన పశువులను మిగతా పశువులతో కలిపి ఉంచితే వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఒకే పాకలో ఉంచకుండా వాటిని వేరు చేయాలి. వ్యాధి సోకిన పశువు తిన్న గడ్డిని ఆర్యోగ్యకరమైన పశువు తిన్నడం వల్లన ఈవ్యాధి సోకే ఆవకాశం ఉంటుంది. వ్యాధి సోకిన పశువు నోటి నుంచి కారే చొంగ ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి పశువులను రవాణా చేసినప్పుడు వ్యాధి సోకుతుంది.
Also Read: Chekurmanis Plant: భారత దేశానికి పాకిన విదేశీ మొక్క చెకుర్మనీస్.!
ప్రతి ఏటా టీకాలు వేయించాలి..
వ్యాధికారక సూక్ష్మజీవులు పశువుల శరీరంలోనికి ప్రవేశించిన రెండు నుంచి ఐదు రోజుల్లోపు వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. జర్వం తీవ్రత 14 డిగ్రీల వరకు ఉంటుంది. చర్మం వదులుగా ఉన్న చోట ద్రవం చేరి గొంతు బాగా ఉబ్బి ఉంటుంది. చేతితో గట్టిగా ఒత్తితే గుంట మాదిరిగా ఏర్పడుతోంది. కళ్ళ నుంచి నీరు ముక్కు నుంచి ద్రవం కారుతోంది. పశువులకు శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది. ముక్కు నుంచి రసపూరితమైన ద్రవాలు కారుతూ ఉంటాయి. ఊపిరితిత్తులు శ్వాస వాహికలో పుండ్లు ఏర్పడి చీము చేరుతోంది. విపరీతంగా దగ్గు వస్తోంది. పశువు ఆయాస పడుతూ శ్వాస పిలుస్తోంది. శ్వాస మరీ కష్టమై నాలుక బయటకు తీస్తోంది.
ఒక్కోసారి వ్యాధి సోకిన పశువు లక్షణాలు 24 గంటల్లోపు మృత్యువాత పడే అవకాశం ఉంటుంది. ప్రయోగశాలలో రక్త పరీక్ష చేయించి బైపోలర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాని గుర్తించడం వలన వ్యాధిని నిర్ధారిస్తారు. పశువు చనిపోయిన తర్వాత శవపరీక్ష చేసి కూడా వ్యాధిని నిర్ధారించవచ్చు. వర్షాకాలం ముందు జూన్, జూలైలో పశుసంవర్ధక శాఖ ప్రభుత్వం వారు ఉచితంగా అందించే వ్యాధినిరోధక టీకాలు వేయించాలి. ఆతర్వాత ప్రతి ఏటా వ్యాధి నివారణ కోసం టీకాలు వేస్తూ ఉండాలి.
Also Read: Crop Protection In Agriculture: వ్యవసాయంలో రక్షక పంటల ప్రాముఖ్యత.!