Cluster Beans: మెట్ట ప్రాంతాలకు అనువైన కూరగాయల్లో గోరుచిక్కుడు ఒకటి. దీనిని అంతరపంటగా కూడా సాగుచేసుకోవచ్చు. గోరుచిక్కుడు పంట ఉష్టమండల పంట 40 డిగ్రీల ఎండను తట్టుకుంటుంది. సారవంతమైన ఒండ్రు నేలలు, ఎర్ర గరప నేలలు దీనికి చాలా అనుకూలం. విత్తనం వేసేముందు నాలుగు సార్లు దుక్కి దున్నాలి. చివరి దుక్కిలో 10టన్నుల పశు వ్యర్ధం వేయాలి. ఎకరాకు 4,5 కిలోలు గోరుచిక్కుడు విత్తనం అవసరమవుతోంది. పచ్చిరొట్ట కోసం సాగుచేసే రైతులకు 12-15 కేజీల విత్తనం సరిపోతుంది. ఇది 90-120 రోజుల పంట ఇది. చాలా సులభమైన పంట.
ఈ గోరుచిక్కుడు పంటను వేయడంవల్లన తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడులను తీయవచ్చు. తక్కువ పెట్టుబడితో పండించగల ఆస్కారం ఉన్న పంట ఈగోరు చిక్కుడు దీనికి అన్ని నేలలు అనుకూలంగా మార్చుకోవచ్చు. విత్తిన 50-60 రోజుల తరువాత కోత మొదలవుతుంది. ఎకరాకు 25-30 కింటాళ్ల దిగుబడిని తీస్తారు. ఎకరాకు 8-1 2 క్వింటాళ్ల ఎండిన గోరుచిక్కుళ్లు వస్తాయి.
చీడపీడలు చాలా తక్కువ
గోరుచిక్కుడు విత్తనాలను జూన్, ఆగస్టు, సెప్టెంబర్ మాసాలలో విత్తుకుంటారు. గోరు చిక్కుడులో హైబ్రీడ్ రకాలను మనం ఎంచుకోవడం వల్లన 7 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి తీయడానికి అస్కారం ఉంది. దీనిలో చీడపీడలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి రైతులు పంట వైపు మగ్గుచూపుతే తద్వారా మంచి లాభాలు తీయవచ్చని ఆధికారులు అంటున్నారు. అంతేకాకుండా హైబ్రీడి విత్తనాలు కింద హెక్టారుకు 20000 వేల రూపాయిలు ఇస్తున్నారు. కావున రైతులు ఈఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. మరియు ప్రభుత్వం నుంచి కూరగాయల సాగుకు రాయితీలు అందుతున్నాయి.
Also Read: Brown Planthopper: వరి పంటలో సుడిదోమ … సస్యరక్షణ చర్యలు పాటిస్తే అధిక దిగుబడి…!
అంతర సేద్యం కూడా చేయవచ్చు
కూరగాయలు సాగు చేసే రైతులు ఎక్కువగా సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. సాగులో రసాయనాలను ఎక్కువగా వాడటం ద్వారా దిగుబడులు తగ్గుతున్నాయన్ని అందుకే పాలేకర్ విధానాలు అయినా సేంద్రియ వ్యవసాయం (Organic Farming) వైపు మక్కువ చూపుతున్నామని అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేయడం ద్వారా రైతులు (Farmers) నాణ్యమైన దిగుబడులను తీయగలుగుతున్నారు. దీనిలో అంతర సేద్యం కూడా చేయవచ్చు.
ఈ పంటకు ఎటువంటి పురుగులు ఆశించవు. దీనికి కూలీల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కోత కోసే సమయంలో వారానికి మూడు సార్లు కూలీలు అవసరం ఆవుతారు. మార్కెట్లో రేటు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు పంటను కోసి అమ్ముకోవచ్చు. గ్రామస్ధాయిలోనే మనం మార్కెటు చేసుకుంటే డబ్బు ఆదాతో పాటు రవాణా ఖర్చులు కూడా మిగులుతాయి.
Also Read: Minister Niranjan Reddy: ఎరువుల సరఫరా మరియు నిల్వల పై ఉన్నతస్థాయి సమీక్ష.!