Brown Planthopper: తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు అవుతున్న పంటలలో వరి పంట అగ్రస్థానంలో ఉంది. ఇతర పంటలు వేసినప్పటికీ వరి సాగుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు రైతన్నలు. అయితే ఈ పంటను అధికంగా వెంటాడుతుంది సుడిదోమ. ఈ సుడిదోమ ను ముందే గుర్తిస్తే నష్టం నుంచి బయటపడొచ్చు. సరైన సమయంలో గుర్తించినట్లయితే భారీ నష్టం వాటిల్లుతుంది. దీన్ని గుర్తించడం ఎలా అంటే సుడిదోమ రెండు రంగుల్లో ఉంటుంది. గోధుమ రంగు దోమ, తెల్ల వీపు సుడిదోమ… గోధుమ రంగు దోమ ఆడ దోమలు మగవారి కంటే పెద్దగా ఉంటాయి.
సుడి దోమలు రెక్కలున్నవి, లేనివి ఉంటాయి. వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పుడు రెక్కలున్న దోమలు అభివృద్ధి చెందుతాయి. తల్లి దోమ 300-500 గుడ్లను ఆకు తొడిమ లో గాని లేదా మధ్య ఈనేలో గాని పెడుతుంది. ఈ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పెద్ద పురుగులు గా మారుతాయి. ముఖ్యంగా వరి (Paddy) పొట్ట దశలో ఆశిస్తుంది. తెల్లవీపు పచ్చదోమ ఇవి గోధుమ రంగు దోమ కంటే చిన్నగా ఉంటాయి. తెల్ల పురుగుల మందు రెక్కలు కలిసే చోట చివర నల్లటి మచ్చ ఉంటుంది. ఇవి 6 -8 గుడ్లను వరి దుబ్బుల మొదళ్ళ దగ్గర ఆకు తొడిమ లోపలి కణజాలంలో పెడతాయి. ఈ గుడ్లు విడి విడిగా ఉంటాయి. పిల్ల పురుగులు తెల్లగా ఉండి 8-28 రోజుల్లో పెద్ద పురుగులు గా మారుతాయి. ముఖ్యంగా ఈ దోమ వరి పిలకలు వేసే దశలో ఆశిస్తుంది .
వరి పంటను అధికంగా నత్రజని అందించడం వల్ల సుడిదోమ పంట పొలాల్లో వ్యాప్తి చెందుతుంది. పంట మొదటి దశలలో క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోపాస్, లామ్షా సైహలోత్రిన్, సింథటిక్ పైరిధ్రాయడ్ మందులను వాడడం వల్ల కూడా సుడిదోమ వ్యాప్తి చెందుతుంది. అధిక తేమ ముఖ్యంగా వరి పంట చిరు పొట్ట దశలో ఉన్నప్పుడు కురిసే అధిక వర్షాలు దోమ ఉదృతి పెరగడానికి దోహద పడుతుంది. అంతేకాదు అధికంగా నీటిని పెట్టి ఉండడం వల్ల కూడా వరి పంటలో సుడిదోమ వచ్చే అవకాశం ఉంది.
Also Read: Minister Niranjan Reddy: ఎరువుల సరఫరా మరియు నిల్వల పై ఉన్నతస్థాయి సమీక్ష.!
సుడిదోమలు వరి దుబ్బుల మొదళ్ళను ఆశించి నష్ట పరుస్తాయి. దీంతో మొక్కలు గిడసబారి పోషకాలు అందక పసుపు రంగుకు మారి సుడులు సుడులుగ ఎండిపోతుంది. వీటి ఉధృతి అధికంగా ఉన్నప్పుడు వరి కంకి వరకు కూడా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. సుడి దోమలు ఆకులపై విసర్జించే తేనె లాంటి జిగురు పదార్థం వల్ల మసి తెగులు సోకుతుంది. సుడిదోమలు (Brown Planthopper) గ్రాసిస్టంట్ వంటి వైరస్ తెగుళ్లు కుడా వ్యాప్తి చేస్తాయి.
రైతులు ప్రతినిత్యం వరి దుబ్బలు మొదలను గమనిస్తూ ఉండాలి. వరి దుబ్బుకు 20కి మించి సుడిదోమలు కనిపిస్తే ప్రతి రెండు మిల్లీ లీటర్లకు 30 సెంటీమీటర్ల వెడల్పులో పాయలు తీసి గాలి వెలుతురు దుబ్బలకు తగిలేలా చూడాలి. పంటలో వెంటనే నీటిని తీసివేసి ఆరుతడి పద్ధతిలో పంటకు నీటిని అందించాలి. నత్రజని అధిక మొత్తంలో వాడకుండా తగిన మోతాదులో వాడాలి. ఈ సుడిదోమ ను ప్రధాన పొలంలో గుర్తించిన తర్వాత 1.5 గ్రా ఎనిఫేట్ ను ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి.లేదంటే 0.5 గ్రా పైమెట్రోజిన్ ను ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
పిచికారి చేసేటప్పుడు పాయలు తీసుకుని మొక్కల మొదళ్ళ భాగంలో పడేలాగా పిచికారి చేసి ఈ సుడి దోమలను అరికట్టాలి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. గింజ పోసుకునే దశ లో చీడపీడలు ఆశించే అవకాశం ఉంది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలతో మందులను పిచికారి చేయాలి. సరైన జాగ్రత్తలు పాటిస్తే పంట దిగుబడి వస్తుంది
Also Read: Ivy Gourd Profits: ఏడాది పొడవునా ఆదాయం పొందే దొండకాయ.!