Snake Gourd Farming: దేశంలో పండించే తీగజాతి కూరగాయల్లో పొట్ల ఒక్కటి. ఇది చూడటానికి పొడవుగా ఉన్నదన దీనిని స్నేక్ గార్డు అని అంటారు. దీనిలో విటమిన్ ఎ.బి.సి మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పీచు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. పొట్లకాయ పచ్చడి, ఫై, పకొడి, బజ్జిలు తయారీలో పొట్లకాయను విరివిరిగా వాడుతారు. వివిధ రకాల పొట్లకాయలున్న చారాల ఉన్నవి, లేనివి ఆకుపచ్చ పొట్లకాయను ఎక్కువగా వాడుతారు. ప్రస్తుత్తం కూరగాయల మార్కెట్లో చిట్టి పొట్లకాయలకు ఆధిక గిరాకి ఉంది. పొట్లకాయ పంటకాలం 120-130 రోజులు ఉంటుంది. ఎకరానికి 600-800 విత్తనం అవసరమవుతుంది. విత్తే ముందు తెగులు సోకకుండా విత్తన శుద్ధి చేసుకోవాలి.
ఎకరాకు 15 టన్నుల పొట్లకాయల దిగుబడి
ఖరీఫ్ పంట అయినా పొట్లకాయను మే రెండో వారంలో విత్తుకోవచ్చు. అంతే కాకుండా శాశ్వత పందిళ్లపై వేయడం ద్వారా తెగుళ్లును అరికట్టవచ్చు. దిగుబడి ఎక్కువ రావడానికి పందిరి చాలా దోహదపడుతుంది. రెండు మూడు రోజులకు నీటి తడులను అందిస్తూ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఎకరాకు 15 టన్నుల పొట్లకాయల దిగుబడిని తీయవచ్చు. పొట్లకాయకు నీరు నిలిచే బంకమట్టి నేలలు అనుకూలం.
పొట్లసాగుకు నేలను నాలుగు, ఐదు సార్లు దుక్కి దున్నాలి. ఎకరానికి 8-10 టన్నుల ఎరువు వేసి కలియ దున్నాలి. విత్తనం వేసే ముందు సేంద్రియ ఎరువులను తయారుచేసుకోవాలి. ఇలా చేయడం వల్లన దిగుబడి ఎకరానికి 12 నుంచి 15 టన్నులు వస్తాయి. వీటికి మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈనేపధ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాల రైతులు ప్రణాళిక ప్రకారం పొట్లకాయలను పండిస్తున్నారు. ఖర్చులు పోను ఎకరానికి 2-2.50లక్షల లాభం వస్తుందని రైతులు అంటున్నారు.
Also Read: Palamuru Rangareddy Lift Irrigation Scheme: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఈనెల 16న ప్రారంభం.!
ఉద్యానశాఖ రాయితీ
ముఖ్యంగా పొట్లకాయను సాగుచేసేటప్పుడు నేలను మల్చింగ్ చేసుకోవాలి. అంతేకాకుండా నాలుగు వైపుల డ్రిప్ ను ఏర్పాటు చేసుకుంటే తక్కువ నీటితో ఎక్కువ అద్బుతమైన లాభాలను పొందవచ్చు. ఈవిధంగా మనం పొట్లకాయను సాగుచేసుకుంటే రైతుకు స్థిరమైన ఆదాయం వస్తుంది.
ఈ శాశ్వత పందిర్ల ద్వారా సంవత్సరమంతా అనగా 365 రోజులు దిగుబడులను తీయవచ్చు. మార్కెట్ లో పొట్లకాయకు గిరాకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రైతులు ఆ పంటపై ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా పెట్టుబడి కూడా చాలా తక్కువగా ఉండడంతో రైతులు ఈ పంట వేయడానికి ముందుకు వస్తున్నారు. పందిరికి, డ్రిప్ కు ఉద్యానశాఖ రైతులకు రాయితీలతో ఇవ్వడంతో పాటు అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
Also Read: Groundnut Insect Management: వేరుశనగలో రసం పీల్చు పురుగుల సమగ్ర యాజమాన్యం.!