వ్యవసాయ పంటలు

Mosambi: జూదంలా మారిన బత్తాయి సాగు

2
Fertilizer and Water Management for Citrus Orchards
Fertilizer and Water Management for Mosambi Orchards

Mosambi: భూమి ఎంత ఆరోగ్యంగా ఉంటే పంట అంత బాగా పండుతుంది. అయితే భూమిని ఎంత ఆరోగ్యంగా ఉంచుకోవాలనిదే రైతు తానుకు తాను వేసుకోవాలన్న ప్రశ్న. రసాయనాలతో పంటలు బాగా పండుతున్నాయని మోతాదుకు మించి పంటలను వేస్తున్నారు. దీనివల్ల భూమిలో భూసారం తగ్గిపోయి సాగులో సమస్యలన్ని పెరిగి రైతులు నిలదొక్కక లేని పరిస్ధితులు ఏర్పడాయి. దీంతో అన్నదాతలు అన్ని విధాల నష్టపోతున్నారు. అంతేకాకుండా వాతావరణ మార్పులు, ఆశిస్తున్న తెగుళ్లు, భారీగా ధరలు పడిపోవడంతో బత్తాయి సాగు రైతన్నకు సాగు జూదంలా మారించి. కనీసం పెట్టుబడులు కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

అమాంతం పడిపోయిన ధరలు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 50వేల ఎకరాల్లో రైతులు బత్తాయిని సాగు చేస్తున్నారు. అయితే వాతావరణ మార్పుల, ఇప్పుడు వర్షాభావం వెంటాడటం వల్లన దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. అంతేకాకుండా బత్తాయిలో వేసవిలో వచ్చే కత్తెర కాయకు సాధారణంగా టన్ను రూ.30వేల నుంచి రూ.40వేల వరకు ధర ఉండేది. ఈఏడాది మాత్రం రూ.15వేల రూ.30వేలకు మించి ధర పలకడం లేదు. అంతేకాకుండా ఈ సంవత్సరం అధికంగా మంగు నల్లి సోకి పంట దిగుబడులన్ని తగ్గిపోయాయి. దీనితో పాటు ఈఏడాది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో బత్తాయి సాగు విస్తీర్ణం పెరగడం వల్ల అధిక దిగుబడులను తీశారు. దీంతో రేట్లు అమాంతం పెరిగిపోయాయి.

Also Read: Insect Pests of Rose Plants: గులాబీ లో తెగుళ్ల బెడద, సస్యరక్షణ చర్యలు.!

Mosambi

Mosambi

ప్రస్తుతం కాయకు టన్ను రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ధర ఉంది. ఏటా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు ధర పలికేది. బత్తాయి అధికంగా ఎగుమతి జరిగే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడం తో పాటు మహారాష్ట్ర నుంచి బత్తాయి ఎగుమతులు పెరగడంతో ధరలు పడిపోవడానికి కారణంగా వ్యాపారస్తులు భావిస్తున్నారు. ఇక్కడ నుండి ఢిల్లీకి కాయలు వెళ్తున్న వాటికి డిమాండ్ తగ్గడంతో ధరలపై తీవ్ర ప్రభావం పడింది. ఫలితంగా బత్తాయి రైతులు పూర్తిగా నష్టపోతున్నారు.

సత్వరమే ప్రభుత్వం ఆదుకోవాలి

ఈఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల తెగుళ్లు వ్యాపించాయి. ఎన్నో మందులను పిచికారి చేసిన లాభం లేకపోయింది. పెట్టుబడులు పెరుగుతున్నాయి కానీ తెగుళ్లను నియంత్రించ లేక పోతున్నామని రైతులు అంటున్నారు. కళ్ల ముందే తోటలు నిలువునా ఎండి పోతుండటంతో రైతులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ప్రస్తుతం కాయకు ఉన్న ధరల ప్రకారం ఎకరానికి రూ.20వేల ఆదాయం కూడా లేకపోవడంతో రైతులు నష్టాలపాలయ్యారు. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తేమ, అకాల వర్షాలతో తోటలు దెబ్బతింటున్నాయి. నష్టపోయిన తోటలకు పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Also Read: Africa Innovative Agriculture: ఆఫ్రికా దేశాల్లో వినూత్న వ్యవసాయం.!

Leave Your Comments

Insect Pests of Rose Plants: గులాబీ లో తెగుళ్ల బెడద, సస్యరక్షణ చర్యలు.!

Previous article

Intercropping Onion: రెండు ఋతువులు మధ్య అంతర పంటగా ఉల్లి సాగు.!

Next article

You may also like