Insect Pests of Rose Plants: పూల మొక్కలలో గులాబీ పువ్వుకు ప్రత్యేక స్థానం ఉంది. గులాబీ పూలు చాలా అందంగా అనేక రంగులలో ఉండటమే కాకుండా మంచి సువాసన కూడా ఇస్తాయి. అందుకే ఈ పువ్వును క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అని అంటారు. అంతేకాకుండా పూల మొక్కల్లో రారాణిగా గుర్తించారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో పండించే రోజా పూలకు మంచి గిరాకి ఉంది. ముఖ్యంగా పాలా హౌస్ పూలు సాగు చేసే రైతులు ప్రధాన ఎంపిక గులాబీనే.
గులాబి సాగును రైతులు ఎక్కువగా సాగుచేస్తున్నారు. కానీ చీడపీడల కారణంగా సరైన దిగుబడులను తీయలేకపోతున్నారు. జూలై ఆగస్టు మాసాలలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ రాత్రులు చల్లగా ఉండటం వలన గులాబీ పంటలో తామర పురుగుల ఆశించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. తామర పురుగులు గులాబీ పంటను ఆశించి ఆకులు మరియు పూమొక్కలు, పూల నుండి రసాన్ని పిల్చి పంటతో తీవ్ర నష్టం కల్పిస్తాయి.
దీనిని అధిగమించటానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే తామర పురుగులను సమర్ధవంతంగా అధిగమించవచ్చు. ఈపురుగుల జీవిత చక్రం 13-19 రోజుల్లో పూర్తవుతోంది. తల్లి పురుగు గుడ్లను ఆకుల పొరులలో చొప్పించి పెడుతోంది. ఈ గుడ్లు 5 -6 రోజుల్లో పొదిగి పిల్ల పురుగులు బయటికి వస్తాయి. ఈపిల్ల పురుగులు ఏర్పడి వర్ణం కలిగి ఉండి చాలా వేగంగా కదులుతాయి. ఇవి చూడటానికి తల్లి పురుగును పోలి ఉంటాయి. కానీ రెక్కలు ఉండవు. తల్లి పురుగులు గోధుమ నలుపు రంగులో ఉంటాయి.
Also Read: Africa Innovative Agriculture: ఆఫ్రికా దేశాల్లో వినూత్న వ్యవసాయం.!
తల్లి మరి పిల్ల పురుగులు ఆకుల అడుగుభాగం లో చేరి అడుగుభాగం నుండి పత్రహరితాన్ని రసాన్ని పిలుస్తాయి. ఈ గుంపులుగా చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల ముడుచుకొని ఎండిపోతాయి. ఆకుల పై భాగం గోధుమ రంగులోకి మారుతుంది. క్రింది భాగంలో వెండివల్లె మెరిసే చారలను గమనించవచ్చు. మొక్కలు గోధుమ రంగులోకి మారి ఎండిపోతాయి. పూలను ఆశించినప్పుడు పూల రెక్కల పైన ఎక్కడ పైన తెల్లని గీతలు మచ్చలు ఏర్పడతాయి. పూలు వాడిపోయి రాలిపోతాయి.
సస్యరక్షణ చర్యలు
తోటలను కలుపు మొక్కలు లేకుండా ఎప్పుటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వేసవిలో లోతు దుక్కులు దున్నడం వల్లన కోశస్ధ దశలలో నాశనం చేయవచ్చు. బెట్ట పరిస్థితుల్లో వీట్టి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని సక్రమంగా అందించాలి. ఫాగర్స్ ద్వారా నీటిని పిచికారి చేస్తే ఉధృతిని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా యూరియా భాస్కరం పొటాషం ఎరువులను ఒక1.8:3 నిష్పత్తిలో ప్రతి మొక్కకు 100 గ్రాములు చొప్పున రెండు మూడు సార్లు పిచికారి వేయాలి.
గులాబీ మొక్కలకు సూర్యరశ్మి బాగా కలిగిన వాతావరణం నీడ పడకుండా ఉండే ప్రదేశాలలో పెంచాలి. నీడ ఉన్నట్లయితే పురుగులు తెగల బెడద అధికంగా ఉండి మొక్కలు సన్నగా బలహీనంగా మారుతాయి. దీనివల్ల కిరణ జన్య సంయోగ క్రియ శ్వాసక్రియ. హార్మోన ఉత్పత్తి అధికంగా జరిగి పూ మొగ్గల అభివృద్ధి మరియు దిగుబడి అధికంగా ఉంటుంది.
Also Read: Cover Crops: ఈ పంటలు పెంచడం ద్వారా రైతుల నేల నాణ్యత పెరుగుతుంది.!