వార్తలు

తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు..

0

తెలంగాణలో ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రాగాల మూడు రోజుల్లో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల,పెద్దపల్లి, వరంగల్ పట్టాన, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షంతో పాటు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం నాడు ఈ జిల్లాలలో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలతో పాటు ఈదురుగాలులు, వడగళ్ల వర్షం సంభవించే అవకాశం ఉంది.

 

Leave Your Comments

ప్రొద్దుతిరుగుడు విత్తనాలు తినడం వలన కలిగే ఆరోగ్య లాభాలు..

Previous article

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం రూ.1,500 కోట్లు బడ్జెట్ కేటాయింపు..

Next article

You may also like