Africa Innovative Agriculture: ఎడారి ప్రాంతాలుగా ఉండి కరువుతో ఇబ్బంది పడుతున్న ఆఫ్రికా లాంటి దేశాలు నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టాయి. పంటలు పండే పొలాలు వానలు లేక నీటి చాయలు లేక అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని కొనసాగిస్తూ కరువును ఎదుర్కొనటం ఎలాగో ప్రపంచానికి నేర్పిస్తుండటం గమనార్హం. కొత్త నీటి సంరక్షణ పద్ధతులను అవలంబిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
కొత్త ఆలోచనకు శ్రీకారం
ఆఫ్రికా దేశాలు ఎడారి ప్రాంతాలుగా ఉండే ప్రాంతాల్లో పంటలు పండని ప్రదేశాల్లో ఆయా పొలాల్లో అర్థ చంద్రకారపు గుంతలు తవ్వి వాన నీటిని అందులో ఇంకింప చేసే విధంగా వారు కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. వీటిని ఇంకుడు గుంతలుగా వాళ్ళు వినియోగించుకోవడం విశేషం. దక్షిణాఫ్రికాలోని వెస్ట్ సాహెల్ లో రైతులు సారాన్ని కోల్పోయిన భూములను పునరుజ్జీవింపచేసేందుకు, ఎడారికరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు లోతు తక్కువ గల గుంతలు తవ్వి మంచి ఫలితాలను రాబడుతున్నారు.
Also Read: Cover Crops: ఈ పంటలు పెంచడం ద్వారా రైతుల నేల నాణ్యత పెరుగుతుంది.!
వాన నీటిని సంరక్షించేందుకు
ఒక వాలుకు అడ్డంగా గుంతలు తవ్వి తద్వారా వచ్చిన మట్టిని కింది వైపు గట్టిగా వేసి వర్షం ద్వారా వచ్చే నీటిని ఆ గుంటలో చేరుకునేలా ప్రాణాలికలు వేశారు. ఆభూమిలోకి ఆవర్షపు నీరు ఎక్కువగా ఇంకటం తద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డుకోవడం జరుగుతోంది. దీని ద్వారా భూమి పైపొర మట్టి కూడా కోతకు గురికాకుండా కాపాడుకుంటున్నట్లు అక్కడి రైతులు పేర్కొంటున్నారు. ఎడారీకరణ బారిన పడిన రైతులు తమ ఆనందాన్ని వ్యక్తపరచడంలో జాయ్ పిట్స్ అనే పేరును పొందారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాలు రాబట్టెల ఇటువంటి వ్యవసాయాన్ని చేపట్టడం గమనార్హం. ఈవిధానంలో వర్షాల వల్ల భూమిలో నేల కోత పైపొర కొట్టుకుపోకుండా వాన నీటిని సంరక్షించేందుకు ఈపద్ధతి బాగా పనిచేస్తుంది. ఇక్కడి రైతులు కూడా ఈవిధానంలో వ్యవసాయం చేస్తే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
Also Read: Papaya Cultivation: ఈ పంట సాగు ద్వారా రెండు సంవత్సరాల వరకు దిగుబడి వస్తుంది.!