Tomato Cultivation: ప్రపంచంలో అత్యధికంగా సాగుచేయు కూరగాయల్లో టమాట ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో టమాట సుమారుగా74,108 హెక్టార్లలో సాగుచేయబడుతూ 14,08,052 టన్నుల దిగుబడినిస్తుంది. సంరక్షణ ఆహారంలో ఇది ముఖ్యమైనది. దీనిలో విటమిన్ సి, ఆస్కార్ బిక్ ఆమ్లం, విటమిన్ బి , విటమిన్ ఏ పుష్కలంగా లభిస్తాయి. టమాటాలు పచ్చిగ లేక పండిన తర్వాత కూరగాయగా వండ వచ్చును. దీని నుంచి పచ్చళ్ళు, సాస్, సూప్, కెచెప్లను తయారుచేయవచ్చుడు.
టమాటాను సంవత్సరం పొడవునా అన్ని ఋతువులలో పండించవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనువైనవి. ఎక్కువ ఉష్ణోగ్రతలు గాని 38 డిగ్రీ సెలసిస్ కన్నా ఎక్కువ, తక్కువ ఊష్ణోగ్రతలు గాని 10 డిగ్రీ సెలసిస్ కన్నా తక్కువ తట్టుకోలేదు. కాత బాగా తగ్గుతుంది. ఉష్ణోగ్రత 15-20 డిగ్రీ సెలసిస్ ఉన్నప్పుడు కాపు బాగా కాసి పండు మంచి రంగు, నాణ్యతను కలిగి ఉంటుంది. టమాటా పండ్లు పక్వానికి వచ్చినపుడు పండులలో ఎరుపు రంగు లైకోపిన్ అనే పదార్ధం వలన వస్తుంది.
Also Read: Expensive Mushrooms: ఈ పుట్టగొడుగుల ధర తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం.!
బాగా నీరు ఇంకే నేలలు, బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలిక పాటి నేలల్లో వర్షాధార పంటగా పండించవచ్చు. శీతాకాలంలో ఇసుకతో కూడిన గరప నేలల్లో, బరువైన బంక నేలల్లో సాగు చేయవచ్చు. నేల ఉదజని సూచిక 6 నుండి 7 ఉంటే ఈ పంట సాగుకు మంచిది. వేసవిలో ఈ పంటను వాతావరణం చల్లగా ఉండే చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పలమనేరు ప్రాంతాలలో, వైజాగ్ జిల్లాలోని అరుకులోయ ప్రాంతాలలో సాగు చేయవచ్చు.
కలుపునావారణకు ఎకరాకు పెండిమిథాలిన్ 1.25 లీ లేదా అలాక్లోర్ 1.0 లీ. తేలికనేలలు, 1.26లీ బరువునేలలు లేదా మెట్రిబుజిన్ 300గ్రా. చొప్పున 200 లీ. నీటిలో కలిపి తడినేలపై పిచికారి చేయాలి. మెట్రిబుజిన్ అనే మందును అదే మోతాదులో నాటిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
భూమిలో తేమను బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు కట్టాలి. వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది. నాటిన 65-70 రోజులకు కోతకు వస్తుంది. ఆ తరువాత 45-60 రోజుల కాయలు వస్తాయి. టమాటాను అమ్మే ప్రదేశం యొక్క దూరాలను బట్టి పంటను కోస్తారు. ఆకు పచ్చ రంగుదశ పండు బాగా వృద్ధి చెంది ఆకుపచ్చగా ఉన్న కాయలను దూర ప్రాంతాలకు రవాణాకు కోస్తారు. పక్వం చెందిన దశ స్థానిక మార్కెట్ లో తీసుకొని రైతులు మంచి లాభాలు పొందుతున్నారు.
Also Read: Rainy Season Suitable Crops: ప్రస్తుత్త వర్షాలకు వేసుకోదగ్గ పంటలు