వ్యవసాయ పంటలు

Red Sorghum Cultivation: ఈ పంటని ఖరీఫ్, రబీ రెండు కాలాలలో పండిస్తూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు..

2
Red Sorghum Cultivation
Red Sorghum

Red Sorghum Cultivation: మన తెలుగు ప్రజలు తెలుపు, పసుపు జొన్నలను మాత్రమే ఆహారంగా వినియోగిస్తారు. ఎర్ర జొన్నలను పశువులకు దానగా ఉపయోగిస్తారు. వేరే దేశాల ప్రజలు ఎర్ర జొన్నలను కూడా ఆహారంగానే వినియోగిస్తున్నారు.జొన్న పంటను కరిఫ్, రబీ రెండు కాలాలకు అనువైన పంట. కావున నేలను సిద్ధం చేసుకునే ముందు గత పంట వ్యర్ధాలను చేకలు నుండి పూర్తిగా తొలగించాలి. చివరి దుక్కికి ముందు పశువుల ఎరువు ఎకరానికి 4 టన్నులు వేసుకొని చివరి దుక్కి వేసుకొని విత్తనం వేసుకోవడానికి సిద్దంగా ఉంచుకోవాలి.

ఇసుక నేలలు సారత్వం ఎక్కువ ఉన్న నేలలు, చౌడు నేలలులో పంట దిగుబడి తక్కువ రావడం జరుగుతుంది. మిగిలిన ఎర్ర నేలలు, నల్ల రేగడి నేలలు, చౌక నేలలు జొన్న పంటకు అనువైనవి. నల్ల రేగడి నేలలో నీరు నిల్వ ఉండకుండా నేల సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి.

ఒక్క ఎకరానికి 3-4 కిలోల వరకు అవసరం పడుతాయి. విత్తనశుద్ధి కోసం ఒక్క కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం, 3 గ్రాముల థయోమితాక్సోం లేదా తైరం లేదా కష్టాన్ కలుపుకొని విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తనాల మధ్య దూరం, సళ్ళ మధ్య దూరం 45 సెంటి మీటర్లు మొక్కల మధ్య దూరం 12-16 సెంటి మీటర్ల దూరాలు ఉండేలా చూసుకోవాలి.

Also Read: Agricultural Electricity Connections: విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం రికార్డు.!

Red Sorghum Cultivation

Red Sorghum Cultivation

ఎకరానికి పంట కాలంలో 28-35 కిలోల నత్రజని, 18 కిలోల బాస్వరం, 12 కిలోల పోటాష్ లు అవసరం పడుతాయి. బాస్వరం, పోటాష్ విత్తనాలు విత్తేముందు పూర్తిగా చివరి దుక్కిలో వేసుకోవాలి. నత్రజనిని రెండు సమ భాగాలుగా చేసుకొని ఒక్క సగభాగాన్ని విత్తేటప్పుడు మిగిలిన సగభాగాన్ని పంట మోకాలు ఎత్తుకు పెరిగినప్పుడు వేరుసుకుంటే సరిపోతుంది.

విత్తనాలను విత్తిన 2 రోజుల లోపు పెండిమిదలిన్ లేదా అట్రాజిన్ ఒక్క లీటర్ నీటికి 3 మిల్లిలిటర్లు కలుపుకొని పిచికారి చేసుకోవాలి.
జొన్న పంటలో తెగుళ్ల కంటే పక్షుల వల్ల జరిగే నష్టమే ఎక్కువగా ఉంటుంది. జొన్న కంకుల మీద పచ్చి కోడి గుడ్ల నీలాన్ని రెండు లీటర్ల నీటికి ఒక్క గుడ్డు చొప్పున కలుపుకొని వారం రోజులకు ఒక్కసారి పిచికారి చేసుకోవాలి. మెరుపు తీగెలు పంట చుట్టూ ఏర్పాటు చేసుకోవాలి.

కంకులకు తొడుగులు ఏర్పాటు చేసుకోవాలి. పంటను రైతులు ఒక్కే వద్ద ఎక్కువ విస్తీర్ణంలో పంటను వెయ్యాలి. ఉదయం, సాయత్రం సమయాల్లో శబ్దాలు చెయ్యాలి. మనిషి రూపం పోలిన బొమ్మలను పంట చేనులో ఏర్పాటు చెయ్యాలి. ఇలా చేయడం వల్ల పక్షుల నుంచి పంటని కాపాడుకోవచ్చు. దాని వల్ల రైతులు పండించిన పంటకి నష్టం జరగదు, మంచి దిగుబడి వస్తుంది.

Also Read: Canopy Cultivation: పందిరి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు

Leave Your Comments

Agricultural Electricity Connections: విద్యుత్‌ కనెక్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వం రికార్డు.!

Previous article

Cabbage – Onion Prices: ఉల్లిగడ్డ ధర పెరిగితే .. ఈ కూరగాయ ధర కూడా పెరుగుతుంది.!

Next article

You may also like