వ్యవసాయ పంటలు

Hill Brooms and Pepper: కొండ చీపుర్లు, మిరియాల సాగుకు ప్రోత్సాహం.!

2
Hill Brooms
Hill Brooms

Hill Brooms and Pepper: ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 4 వేల ఎకరాల్లో మిరియాలు, వెయ్యి ఎకరాల్లో కొండ చీపుర్లు పంటలను సాగు చేయించాలని ప్రణాళికను సిద్ధం చేసింది. దీనిని గిరిజన సాంస్కృతిక శిక్షణా సంస్థ ద్వారా ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాలో కొండ చీపుర్లు మరియు మిరియాల సాగును ప్రోత్సహించేందుకు న ఆర్థిక సాయం అందించే ప్రక్రియ ను కొనసాగించాలని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

పంటను ఎలా సాగుచేయాలో దాని మీద రైతులకు శిక్షణ, పంట చేతికొచ్చిన తర్వాత మార్కెటింగ్ మీద మెలకువలు వంటి మీద రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పలు జిల్లాల్లో సాగులో అనుసరిస్తున్న పద్ధతులను చూపించడం ద్వారా ఎలా దిగుబడులు పెరుగుతాయి. తద్వారా ఆదాయం ఎలా పెరుగుతుంది అనే అంశాలమీద రైతులకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఈ ఏడాది కొండ చీపుర్లు, మిరియాల సాగుకు సాయం మరింత పెంచాలని కేంద్రం నిధులను విడుదల చేసింది.

లయ’ అనే స్వచ్ఛంద సంస్థ తో రైతులకు శిక్షణ

కొండ చీపుర్లు, మిరియాల సాగు పెంచేందుకు గిరిజన రైతులకు శిక్షణ ఇవ్వడం, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ ఉన్న సాగు విధానాలను చూపించడం అంతేకాకుండా సాగు విస్తీర్ణం పెంచేందుకు ప్రణాళికలు రూపకల్పన వంటి అంశాలను గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థకు అప్పగించింది. దీంతో గత ఏడాది అల్లూరి జిల్లాలో పాడేరు, హుకుంపేట, పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలాల్లో సుమారు 16 గ్రామాల్లో 200 ఎకరాల్లో కొండ చీపుర్లు పెంపకం చేపట్టారు. గిరిజనులకు ఆర్థికంగా సహాయం అందించేందుకు కొండ చీపుర్లు సాగుతో పాటు ‘లయ’ అనే స్వచ్ఛంద సంస్థతో గిరిజన రైతులకు శిక్షణ ఇప్పించారు.

Also Read: Stylo (Stylosanthes guianensis): స్టైలో లో ఏకవార్షికాలు మరియు బహువార్షికాలు.!

Black Pepper

Black Pepper

నాగాలాండ్‌ రాష్ట్రంలో కొండచీపుర్ల సాగుచేసే ప్రాంతాలకు వారిని తీసుకెళ్లి అవగాహన కల్పించారు. అక్కడ సాగుచేస్తున్న ముక్కలను తీసుకువచ్చి కొండ చీపుర్ల మొక్కల మధ్య సాగు చేశారు. దీంతో ఎకరాకు ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వచ్చిందని గిరిజన రైతులు చెబుతున్నారు. వీటిని ఒక్కసారి నాటితే 20 ఏళ్లపాటు దిగుబడిని గిరిజనులు తీసుకోవచ్చు. ఈఏడాది 1,000 ఎకరాల్లో కొండ చీపుర్ల పంటను సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించామని, దీనిలో భాగంగా ఇప్పటికే రైతులకు శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు.

నూతనంగా మిరియాల సాగు

మిరియాల సాగుకు పాడేరు డివిజన్‌ అత్యంత అనుకూల ప్రాంతం. గత ఏడాది 1,700 ఎకరాల్లో మిరియాల సాగు చేపట్టిన రైతులకు శిక్షణ ఇచ్చారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాలకు తీసుకెళ్లి అక్కడ సాగు విధానాలు గురించి వివరించారు, దీంతో గత ఏడాది ఒక్క పొదకు సగటున 2.5 కిలోల నుంచి ఐదు కిలోలకు దిగుబడి పెరిగింది. ఈ ఏడాది కూడా చింతపల్లి, పాడేరు, జి.మాడుగుల మండలాల్లో నాలుగు వేల ఎకరాల్లో మిరియాలు సాగు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా రైతులకు శిక్షణ ఇస్తున్నారు. కొండ చీపుర్లు, మిరియాల సాగు కోసం రైతులకు శిక్షణ, ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లడం, పంట కోతకు వచ్చే సమయంలో ప్రాసెసింగ్‌కు అవసరమైన యంత్రాలకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ గత ఏడాది రూ.1.15 కోట్లు విడుదల చేసిందని విశాఖలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస డైరెక్టర్‌ తెలియజేశారు. ఈ ఏడాది కొండ చీపుర్లు సాగులో శిక్షణ, ఇతర కార్యక్రమాలకు రూ.50 లక్షలు, మిరియాల సాగు కోసం రూ.60 లక్షలు విడుదల చేసిందన్నారు.

Also Read: Azolla: పశువుల మేతగా ఎండబెట్టిన అజోల్లా, పెరిగిన పాల దిగుబడులు.!

Leave Your Comments

Stylo (Stylosanthes guianensis): స్టైలో లో ఏకవార్షికాలు మరియు బహువార్షికాలు.!

Previous article

Coconut Crop: కొబ్బరిలో అదనపు ఆదాయం.!

Next article

You may also like