Best Farmer Award: రోజురోజుకు పెరుగుతున్న జనాభా, మారుతున్న ప్రజల జీవన శైలి, ఆహారపు అలవాట్ల కారణంగా వ్యవసాయ విధానంలో అనేక మార్పులు వస్తున్నాయి. ప్రధానంగా రసాయన, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ విధానంలో క్షేత్ర స్థాయిలో రైతులు అవలంబిస్తున్నారు. అయితే పుట్టుకొస్తున్న కొత్త రోగాల కారణంగా చాలా వరకు కొనుగోలుదారులు సేంద్రియ విధానంలో పండించే పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రైతులు సైతం కొనుగోలు దారులకు అనుగుణంగా అదే విధానంలో సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకృతి సాగు చేస్తూ వరి సాగులో వినూత్నంగా 150 రకాల వంగడాలను రూపొందించి వాటిని కాపాడుతున్న తెలంగాణ కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన గారంపల్లి శ్రీకాంత్‌కు తమిళనాడులోని ‘ఈశా ఫౌండేషన్’ బెస్ట్ ఫార్మర్ అవార్డు వరించింది.
26న భారతీయ సంప్రదాయ బియ్యం పండుగ
ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు ఆధ్వర్యంలో ‘సేవ్ సాయిల్’ కార్యక్రమం ద్వారా ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. ప్రకృతి వ్యవసాయంలో విత్తనం అనేది చాలా కీలకం కాబట్టి ప్రకృతి వ్యవసాయ విధానంలో అక్కడ దొరికే దేశీ విత్తనాలను వాడి ఎలాంటి ఎరువుల అవసరం లేకుండా కావాల్సిన పంటను పండించుకుని మిగిలిన పంటను భూమిలోనే వదిలేయడం జరుగుతుంది.
ఈ విధంగా రైతులు వారి అవసరాలను బట్టి వారి విధానంలో మార్పు ఉంటుంది. ఈనేపధ్యంలో నేల సంరక్షణకు కోసం శ్రీకాంత్ పాటుపడుతున్నాడు. అందులో భాగంగా గత నెల 26న భారతీయ సంప్రదాయ బియ్యం పండుగ’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Also Read: PM Kisan Scheme: పీఎం కిసాన్ రూ.12000 అందాయా?
తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న 5వేల మంది రైతులకు ఆహ్వానం పలికారు. ఇందులో పాల్గొన్న గారంపల్లి శ్రీకాంత్ ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలో సాగు చేస్తున్న విధానాన్ని వివరించారు. తాను కాపాడుతున్న 150 రకాల వరి వంగడాలను అందజేశారు. శ్రీకాంత్‌ను సాగు విధానాని చూసి అందరు నివ్వెరపోయారు.
ఈ క్రమంలో జూలై 30న జరిగిన కార్యక్రమంలో తెలంగాణ నుంచి బెస్ట్ ఫార్మర్ అవార్డుకు శ్రీకాంత్‌ను ఎంపిక చేయగా, అవార్డును కార్యక్రమ నిర్వాహకులు శ్రీముగ అందించారు. కాగా, ఉత్తమ రైతు అవార్డును అందుకున్న శ్రీకాంత్‌కు పలువురు అభినందనలు తెలిపారు.
Also Read: Nursery Management in Vegetables: కూరగాయల సాగులో నారుమడుల యాజమాన్యం.!