PJTSAU 9th University Foundation Day Celebrations: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 9వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు రాజేంద్రనగర్ లోని విశ్వవిద్యాయలయం ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ శ్రీ కృష్ణదేవ రావు ప్రొఫెసర్ జయశంకర్ స్మారకోపన్యాసం ఇచ్చారు. అనంతరం సుస్థిరాభివ్రుద్ధి-వ్యవసాయం అన్న అంశంపై ఆయన ప్రసంగించారు. జయశంకర్ సార్ వంటి విద్యావేత్త పేరుని ఈ విశ్వవిద్యాలయానికి పెట్టడం అందరికీ గర్వకారణం అని అన్నారు. ఈ మధ్యనే తమ విశ్వవిద్యాలయం రైతుల కోసం అగ్రి-లీగల్ ఎయిడ్ క్లినిక్స్ పేరిట కొత్త కార్యక్రమం ప్రారంభించిందని తెలిపారు.
పర్యావరణ పరిరక్షణని దృష్టిలో పెట్టుకొని సుమారు 50 ఏళ్ళ క్రితమే సుస్థిరాభివ్రద్ధి భావన పై చర్చ మొదలైందని దేవరావు పేర్కొన్నారు.ప్రస్తుతం దీని ప్రాధాన్యత మరింత పెరిగిందని అన్నారు.మానవ అభివృద్ధి ,పర్యావరణ పరిరక్షణ లని విడదీయలేమన్నారు. సహజ వనరులని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూనే పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చమని మన ముందున్న సవాల్ అని ఆయన అభిప్రాయపడ్డారు. సుస్థిరాభివృద్ధి లో వ్యవసాయ రంగానిది ప్రధాన భూమిక అని దేవరావు పేర్కొన్నారు. గత కొన్నేళ్ళుగా నూతన ఆవిష్కరణలు,హరిత విప్లవం తోడ్పాటు తో దేశం ఆహార స్వయం సమృద్ధి సాధించిందన్నారు. అదే సమయంలో భూసార క్షీణత,భూ గర్భ జలాలు తగ్గిపోవటం, జీవ వైవిధ్య క్షీణత,జల కాలుష్యం వంటి దుష్ప్రభావాల ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.
Also Read: Oil Palm Cultivation: తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగు భళా.!
సుస్థిర వ్యవసాయం అనేది ప్రస్తుతం చాల ముఖ్య అవసరం అని ఆయన వివరించారు.ఆహార,పౌష్టికాహార భద్రత తీర్చడానికి ప్రత్యేక వ్యూహాలు అవసరమన్నారు.భూసారాన్ని పరిరక్షిస్తూ,సమర్ధ నీటి యాజమాన్య పద్ధతులు అవలంబిస్తూనే,సరి అయిన నిల్వ పద్ధతులు అనుసరిస్తూ ఉత్పత్తి,ఉత్పాదకతలు పెంచవలసిన అవసరముందని వివరించారు.సేంద్రీయ వ్యవసాయ విధానాలపైనా దృష్టి పెట్టాలన్నారు.
ఈ అంశాల పై రైతుల్లో అవగాహన పెంపొందించటానికి అందరూ కృషి చేయాలన్నారు.సుస్థిర వ్యవసాయం ద్వారా సుస్థిర అభివృద్ధి సాధించటానికి వ్యవసాయ విద్యార్థులు,పరిశోధకులు, విధాన నిర్ణేతలు,రైతులు సమష్టి గా పని చేయాలని కృష్ణ దేవరావు పిలుపునిచ్చారు. ఈసందర్భం గా ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ఐకార్ మాజీ డిప్యూటీ డైరక్టర్ జనరల్ డాక్టర్ ఈ ఏసిద్ధిఖీ కి పీ జే టీ ఎస్ ఏ యూ జీవిత కాల పురస్కారం అందచేసారు. అదే విధంగా అత్యుత్తమ పనితీరు కనపర్చిన బోధన, పరిశోధన, బోధనేతర సిబ్బంది, ఉత్తమ రైతులకి పురస్కారాలు అందచేసారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ మాజీ ఉపకులపతులు, వర్సిటీ అధికారులు, బోధన, బోధనేతర, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
Also Read: Coconut Crop: కొబ్బరి పంట యాజమాన్యం.!