ఆరోగ్యం / జీవన విధానం

విటమిన్ – సి వలన కలిగే లాభాలు..

0

విటమిన్ – సి ఇప్పుడు అందరికీ బాగా సుపరిచితమైన విటమిన్. కరోనా వైరస్ నేపధ్యంలో విటమిన్ – సి  ప్రాధాన్యత చాలా పెరిగింది. అయితే ప్రకృతి సిద్ధంగానే కావాల్సినంత విటమిన్ – సి లభిస్తుందనే సంగతి మర్చిపోతున్నాం. చాలా వరకు పండ్లు, కాయలు సీజన్ ను బట్టి లభిస్తాయి. ఏ కాలంలో ఏ పండ్లు తింటే మంచిదో దాని ప్రకారమే ప్రకృతి మనకందిస్తుంటుంది. చలికాలంలో ఎక్కువగా లభించే కాయల్లో ఒకటి ఉసిరికాయ. ఉసిరికాయలంటే కేరాఫ్ విటమిన్ – సి గా చెప్పవచ్చు. చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయల్ని తింటే చాలా రకాల అనారోగ్య సమస్యల్నించి  విముక్తి పొందవచ్చు. చలికాలంలో ఉసిరికాయల్ని ఓ భాగంగా చేసుకుంటే మరీ మంచిది. ఇప్పుడు కరోనా వైరస్ కేసులు మరోసారి పెరుగుతున్న నేపథ్యంలో ఉసిరిని ఎక్కువగా తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ప్రకృతిలో లభించేవాటిలో ఒక్క ఉసిరికాయల్లోనే విటమిన్ – సి మనకు సమృద్ధిగా లభిస్తుంది. నారింజ, నిమ్మ, దానిమ్మ కాయల కంటే ఎక్కువగా విటమిన్ – సి ఉసిరికాయల్లోనే లభిస్తుంది. అందుకే ఎంత వీలైతే అంత ఎక్కువగా ఉసిరికాయల్ని తీసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుత సమయంలో మనకు కావాల్సింది రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే. విటమిన్ – సి ఎక్కువగా తీసుకుంటే శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం అనేది రాకుండా ఉంటుంది. శీతాకాలంలో సహజంగా జీర్ణ ప్రక్రియ సమస్య తలెత్తుతుంది. ప్రతిరోజూ ఉసిరికాయల రసాన్ని తాగితే తినే ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. ఇక డయాబెటిస్  సమస్య ఉన్నవారు ఉసిరికాయలను తినడం ద్వారా కావాల్సినంత క్రోమియం లభిస్తుంది. ఈ కారణంగా శరీరంలో ఇన్సులిన్ చురుగ్గా పనిచేస్తుంది. షుగర్ లెవల్స్ క్రమంగా తగ్గుతాయి. మరోవైపు శీతాకాలంలో ప్రధానంగా ఎదురయ్యే మరో సమస్య చర్మ సంబంధమైనవి. చర్మం పొడిబారడం, మచ్చలు రావడం వంటివి. ప్రతిరోజూ ఉసిరికాయ రసం తాగితే ఈ సమస్యలు తగ్గుతాయి. వెంట్రుకల సమస్య కూడా పోతుంది.

Leave Your Comments

ప్రకృతి వ్యవసాయంలో కీటక నాశనుల తయారీ..

Previous article

ఒక్కసారి నాటితే 5 సంవత్సరాల వరకు పుదీనాను కోసుకోవచ్చు..

Next article

You may also like