Gulkhaira Farming: సాంప్రదాయ వ్యవసాయంలో లాభాలు కంటే నష్టాలనే రైతులు ఎక్కువగా చూస్తున్నారు. పెట్టుబడులకు తగట్టు దిగుబడులు రాక రైతులు అప్పుల పాలవుతున్నారు. దీంతో సాగు పంధాను మార్చుకోవాలన్న నేపథ్యంలో ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో రైతులు గుల్ఖేరా అనే ఔషధ మొక్కను సాగు చేయడం ప్రారంభించారు. ఈమొక్కకు ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఏ చెట్ల మధ్య నాటిన కూడా బతుకుతోంది. అంతేకాకుండా దిగుబడులను ఇస్తుంది. దీనిని అనేక ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈపువ్వు నుండి వచ్చే ఆకులు, కాండం, విత్తనాలు అన్ని కూడా మార్కెట్‌లో మంచి ధరలకు అమ్ముతారు. ఈ పువ్వు రైతులకు మంచి దిగుబడులను ఇస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విసిగిపోయిన రైతులు ఈ పువ్వులతో అధిక దిగుబడులను సాధించవచ్చు. మార్కెట్‌లో గుల్ఖేరా పువ్వులు క్వింటాకు పది వేల రూపాయలు పలుకుతున్నాయి.
ఈసాగుకు తెగులు, వ్యాధులు సోకవు
గుల్ఖేరా సాగు నూతన వినూత్నమైన సాగు. దీనిలో నష్టాలనే మాటే ఉండదు. అంతేకాకుండా ధరలు, దిగుబడి, మార్కెట్ వంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఈ పంటలో రాదు. ఇది ఒక గట్టి మొక్క కాబట్టి, వివిధ రకాల నేల పరిస్థితులను తట్టుకునే పెరుగుతుంది. మామూలు వ్యవసాయంలో విత్తనాలు అందుబాటులో లేకపోవడం, ఎరువులు, పురుగు మందుల, ధరలు పెరగడం, పంట దిగుబడి తగ్గడం, కూలీల కొరత వంటి కారణాలతో వ్యవసాయం పెద్ద లాభదాయకంగా కనిపించడం లేదు. చాలా మంది రైతులు వ్యవసాయంలో లాభాలను పొందలేకపోతున్నారు. గుల్ఖేరా సాగు ఎక్కడైనా సాగు చేయవచ్చు. తెగుళ్లు, వ్యాధులు వంటివి దీనికి రావు. కాబట్టి తక్కువ ఖర్చుతో, నష్టాలు లేకుండా గుల్ఖేరా సాగును చేసుకోవచ్చు. దీంతోపాటు దేశీయంగా, అంతర్జాతీయంగా గుల్ఖేరాకు డిమాండ్ ఉంది. మార్కెట్ లో రైతులు పండించిన దానికి మంచి డిమాండ్ ఉంది. ఈసాగుతో స్థిరమైన, లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నారు.
Also Read: GPS Ear Tags for Cattle: ఇంట్లో ఉండి వేలాది పశువులను కాయవచ్చు.!
అంతర పంటగా సాగు చేయవచ్చు.
ఈ మొక్కలు ఎక్కడైనా పెరుగుతాయి. ఇతర పంటలు ఉన్న భూమిలోనూ వీటిని అంతర పంటగా వేయవచ్చు. ఇతర పంటల విత్తనాలను ఎలా నాటుకుంటున్నామో ఈ పంట విత్తనాలను కూడా అలాగే నాటుకోవాలి. ఈ పంటను సాగు చేయడానికి కేవలం రూ.10 వేలు మాత్రమే ఖర్చు అవుతుంది. నవంబర్‌లో నాటితే మొక్క మేలో పరిపక్వం చెందుతుంది. మొక్క పరిపక్వం చెందినప్పుడు ఆకులు, కాండం సేకరించడం సులభంగా ఉంటుంది. కోసిన ఆకులు, కాండం మందులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నూనెలు, ఇతర ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా వీటిని వినియోగిస్తారు. గుల్‌ఖైరా సాగు అనేది చాలా సులభమైన ప్రక్రియ. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియాలోని ఉత్తరప్రదేశ్‌లో గుల్‌ఖైరా వ్యవసాయం చేసేవారి సంఖ్య పెరుగుతోంది. కన్నౌజ్, హర్దోయ్ వంటి ప్రదేశాలు ఎక్కువగా ఈ సాగును చేపట్టారు.
Also Read: Amaranthus Leaf Cultivation: తోటకూర.. అన్ని రుచుల కలిపిన ఆకు కూరని ఎలా సాగు చేయాలి?