Polyhouse Rose Cultivation: పూలలో రారాణి గులాబి , ప్రేమకు చిహ్నం గులాబి , పుష్పాలంకరణలో గులాభిది ప్రత్యేక స్ధానం, గులాభి ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. దేశవాళీ, హైబ్రిడ్ బయట ప్రదేశాల్లో సాగు చేస్తుండగా ఇటివల వచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో పాలిహౌస్ లో గులాబి సాగును చేపట్టారు మరి కొంత మంది రైతులు. గులాభిని ఒకసారి నాటితే మూడు నాలుగు సంవత్సరాలు పాటు దిగుబడులను తీయవచ్చు. గులాబీ సాగును రైతులు వాణిజ్య సరళిలో చేపడుతున్నారు. అంతేకాకుండా వివిధ ఉత్పత్తుల తయారీలో ఈ పువ్వులను వాడుతారు. అందుకే మార్కెట్లో గులాభి పువ్వుల కు మంచి డిమాండ్ ఉంది. ఈపంట సాగుకు తేమ శాతం తక్కువగా ఉండి, రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. గులాభికి ఎగుమతి అవకాశాలు కూడా ఉన్నాయి. నాటిన దగ్గర నుంచి 4-5 సంవత్సరాల వరకు మంచి దిగుబడిని పొందవచ్చు.
శాస్త్రీయ విధానాలు వైపు మళ్ళింపు
మారుతున్న కాలానికి అనుగుణంగా సాగు విధానంలో రైతులు కొత్త ఒరవడిని సృష్టిస్తున్నారు. ఆరుగాలం కష్టించి పని చేస్తున్న రైతులకు పెట్టుబడులు రాక సతమతవుతున్నారు. సంప్రదాయ పంటలను వదిలి శాస్త్రీయ విధానాలు వైపు వెళ్లుతున్నారు. నేపథ్యంలో రైతులు గులాభిని సాగుచేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గులాభిలో మొళకలను శాస్ర్తవేత్తలు తెలియజేస్తున్నారు.
Also Read: Plant Nursery: అన్ని మొక్కలు లభించే చోటు నర్సరీ.!
గులాభి మొక్కలకు కొత్త చిగుళ్లు వస్తాయి. కావున కొమ్మ కత్తిరింపులు తప్పనిసరిగా చేయాలి. సంవత్సరానికి ఒకసారి అంటే అక్టోబర్, నవంబర్ మాసలలో కొమ్మ కత్తిరింపులకు అనుకూలంగా ఉంటాయి. మొక్కలు ఎంత గుబురుగా ఉంటే అంత ఎక్కువగా పూలు పూస్తాయి. మొగ్గలు వచ్చే దశలో తప్పనిసరిగా ఎరువుల సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అప్పుడే మనం ఎక్కువ దిగుబడులను సాధించగలము
పువ్వులను విదేశాలకు ఎగుమతి
పూలసాగు అంటేనే శ్రమతో కూడుకున్న పని, అంతేకాకుండా సాగులో కూడా పెట్టుబడుల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఇంత కష్టపడి పంట పండించడం ఒక ఎత్తు అయితే మార్కెట్ చేసుకోవడం మరో ఎత్తు. ప్రణాళిక బద్దంగా పండించి మార్కెట్ చేస్తే మంచి లాభాలు వస్తాయి. ఒక్కొక్క గులాభి ధర రూ.5 దాకా పలుకుతుంది. ఎకరాలో ఏడాదికి 8నుంచి 10 దాకా దిగుబడులను తీస్తున్నారు. వచ్చిన పువ్వులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు, 7 రకాల గులాబీలను పండిస్తున్నారు. తమిళనాడు నుంచి మొక్కలు దిగుమతి చేసుకోని ఇక్కడ నాటుతున్నారు. ఒక్కో గులాబి మొక్క 12 నుంచి 13 దాకా పలుకుతుంది. పాలిహౌస్ లో గులాభి సాగుచేస్తే చీడపీడల బెడద ఉండదు.
Also Read: Millets Cultivation: వర్షాధార పంటగా చిరుధాన్యాలు సాగు.!