ఉద్యానశోభ

Banana Varieties Cultivation: భారతదేశంలో అరటి పండులో ఇన్ని రకాలు సాగులో ఉన్నాయి.!

2
Banana Varieties Cultivation
Banana

Banana Varieties Cultivation: ప్రపంచంలో అరటి ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానం. మన దేశంలో 4.8 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 16.16. మిలియన్ టన్నుల అరటి ఉత్పత్తి అవుతుంది.. అంతేకాక జాతీయ స్థాయిలో అరటి పంటదే మొదటి స్థానం. దేశంలో మొత్తం పండ్ల తోటల విస్తీర్ణంలో 15% అరటిదే తమిళనాడు మహారాష్ట్ర విస్తీర్ణంలో ఉత్పాదకతలోను అరటి ముందు స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విస్తీర్ణంలో 5 వ స్థానంలో 150 వేల ఎకరాలలో సాగు చేస్తున్నారు. ఉత్పాదకతలో 21 లక్ష టన్నులతో 16వ స్థానంలో ఉంది. చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తూర్పుగోదావరి, వైజాక్, కృష్ణా, శ్రీకాకుళం,వరంగల్,రంగారెడ్డి, మెదక్ జిల్లాలో అరటిని ఎక్కువగా పండిస్తారు.

అరటిలో ప్రాధాన్యత సంతరించుకొన్న రకాలు 70 దాకా ఉన్నాయి. వీటిలో 10-12 రకాలు మన రాష్ట్రంలో శ్రీ విస్తృతంగా సాగు చేస్తున్నారు.

Banana Varieties Cultivation

Banana Varieties Cultivation

1. కర్పూర చక్కెర కేలి.

దేశంలో 70% అరటి ఉత్పత్తి ఈ రకానిదే దీని గెలలు పెద్దవిగా 10-15 కేజీ బరువుండును. గెలకు 130-175 కాయలుండి 10-12 హస్తాలతో ఉండును. 12 నెలల్లో వంట వస్తుంది. పనామ తెగుళ్ళును ఆకుపచ్చ తెగుళ్ళును బాగా తట్టుకొంటుంది. తేలిక నేలలో వర్షాభావ పరిస్థితుల్లో సాగు చేయవచ్చు.

2. తెల్ల చక్కెర కేళి

ఈ రకం ఉభయ గోదావరి, గుంటూరు జిల్లాలో సాగులో ఉంది. ఆకులో అంచులు పైకి తిరిగి ఉండటం ఈ. రకం ప్రత్యేకత గెల చిన్నగా ఉండి 6-8 కేజీల తూగుతుంది. ఒక గెలలో 5-6 హస్తాలతో 60-80 కాయలు కల్గిండును. 12 నెలల్లో వంట కోతకు వచ్చును. పనామ తెగులును తట్టుకుంటుంది. అధిక ఉష్ణోగ్రత సారవంతం కానటువంటి నేలలు కల్గిన తెలంగాణా రాయలసీమ ప్రాంతాలకు అనువైనది కాదు.

3. అమృత పాణి లేదా రసాలి

ఇది పొడవు రకం. 13-14 నెలల్లో పంటకు వచ్చును. గెల 15-20 కేజీ బరువుండి 8-10 హస్తాలతో 80-100 కాయలు కలిగి ఉండును. ఎక్కువ కాలం నిల్వ చేయుటకు పనికి రాదు. పండిన వెంటనే గెలల నుండి పండ్లు రాలిపోతాయి. పనామా తెగులు ఈ రకం పై తీవ్రంగా వస్తుంది. ఆకుమచ్చ తెగులును తట్టుకోగలదు.

Also Read: Beetroot Cultivation: బీట్ రూట్ సాగు విధానాలు, సూచనలు.!

4. రోబస్టా: (పెద్ద పచ్చ అరటి)

ఇది మధ్యరకం గెల 15-20 కేజీల బరువు 9-10 హస్తాలతో దాదాపు 125-130 కాయలు కల్గిండును. 11-12 నెలల్లో పంటకు వచ్చును. కాయలు కొంచెం పెద్దగా ఉండి వంకర తిరిగి ఉంటాయి. పండిన తర్వాత కూడా తొక్క ఆకుపచ్చగా ఉంటుంది. కాయలో గింజలు స్పష్టంగా ఉంటాయి. రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు. పనామ తెగులును తట్టుకుంటుంది. కాని వెర్రితలలు ఆకుమచ్చ తెగులు ఆశిస్తాయి.

Banana Varieties Cultivation

Banana Varieties

5. వామన కేళి (బనరాయ్) లేదా పొట్టి పచ్చ అరటి:

గట్టిగా ఉన్నందున తుఫాను గాలి తాకిడికి తట్టుకొనును. వీటి గెల 12-15 కేజీల బరువు 8-10 హస్తాలతో దాదాపు 120 కాయలు కల్గిండును. 11 నెలల్లో పంటకు వచ్చును. ఇది చాలా తీపి రకము అన్ని ప్రాంతాలకు అనువైనది. పండు పండిన పిదప తోలుపైన చుక్కలు వస్తాయి. పండిన పిదప శీతాకాలంలో పసుపుపచ్చ, వేసవి కాలంలో ఆకు పచ్చగా ఉంటాయి. ఎక్కువ కాలం నిల్వకు పనికి రావు. పనామ తెగులును తట్టుకుంటుంది.

6. బొంత

ఇవి విస్తృతంగా సాగుతోన్న రకం. 13 నెలల్లో పంటకు వచ్చును. గెల 12-15 కేజీల బరువుతో 5-6 హస్తాలను కల్గి దాదాపు 70-80 కాయలు కలిగి ఉండును. కాయలు పెద్దవిగా కొంచెం వంకరగా ఉండి అంచులు బాగా కన్పించును. అన్ని ప్రాంతాలకు అనువైన రకం ఆకుమచ్చ తెగులును తట్టుకొనును. పనామ తెగులును తట్టుకోలేదు.

7. ఏనుగు బొంత:

బొంత రకాన్ని మ్యూటేషన్ ద్వారా రూపొందించిన మేలైన రకం 13-14 నెలల్లో కాపుకు వస్తుంది. గెల 15-20 కేజీల బరువు 6-7 హస్తాలతో 75-100 కాయలు కలిగి ఉండును. రాష్ట్ర మంతటా పండించుటకు అనువైన రకం ఆకుమచ్చ మరియు పనామ తెగులును తట్టుకోలేదు.

8. గ్రైండ్నైన్:

ఇది ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకొనే శక్తి అధికంగా కల్గింటుంది. గెలల పరిమాణం సైతం ఎక్కువగా ఉంటుంది. 12 నెలల పంట కాలం ఉన్న రకం 2.2-2.7 మీ. ఎత్తు సగటు గెల బరువు 25-30 కేజీలు

9. ప్రవర్థనం:

అరటిని పిలకలు, టిష్యుకల్చర్ పద్ధతుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. కొత్తగా అరటి తోట వేయుటకు 3 నెలల వయసు గల అరటి పిలకలను తెగుళు లేని తల్లి చెట్టు నుండి ఎన్నుకోవాలి. సూది మొన ఆకులు గల పిలకలను నాటుటకు ఎన్నుకోవాలి. ఇవి అతి త్వరగా పెరిగి తక్కువ వ్యవధిలో పంటనిచ్చును. పిలకల దుంపలపై గల పాత వేర్లను తీసివేయాలి. సాధారణంగా దేశవాళి రకాలకు దుంప 1.5-2 కేజీలు కావెండస్ రకాలకు 1.25-1.5 కేజీల బరువు ఉంటుంది.

Also Read: Spinach: పోషక అద్భుతాన్ని అందిస్తున్న ఈ కూర ఏంటో , ఎలా సాగు చేయాలో మీకు తెలుసా ?

Leave Your Comments

Amaranthus Leaf Cultivation: తోటకూర.. అన్ని రుచుల కలిపిన ఆకు కూరని ఎలా సాగు చేయాలి?

Previous article

Azolla: పశువుల మేతగా ఎండబెట్టిన అజోల్లా, పెరిగిన పాల దిగుబడులు.!

Next article

You may also like