ఉద్యానశోభ

Crossandra Flowers: ఈ పువ్వుల సాగుతో మంచి దిగుబడితో పాటు లాభాలు ఎలా సంపాదించాలి?

2
Crossandra Flowers
Crossandra

Crossandra Flowers: సాంప్రదాయకంగా సాగుచేయబడుతున్న పూల మొక్కల్లో కనకాంబరం ముఖ్యమైనది. కనకాంబరం 30-90 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. దక్షిణ భారతదేశంలో కనకాంబరాన్ని వాణిజ్య పరంగా సాగుచేస్తున్నారు. ఇది ఉష్ణమండలపు వాతావరణంలో హెచ్చు తగ్గులను బాగా తట్టుకొంటుంది. 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలం.

అన్ని రకాల నేలల్లో సాగు చేయవచ్చు. సారవంతమైన ఒండ్రునేలలు అనుకూలం. క్షారగుణంగల నేలలు అనుకూలం కావు. విత్తనం, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరాకు షుమారు 2 కిలోల విత్తనం అవసరం. విత్తనాన్ని మే జూన్ నెలల్లో విత్తి ఆగష్టు -సెప్టెంబరు మాసాల్లో నాటుకోవాలి. ప్రతి మొక్కకు 30 సెం.మీ. ఎడంలో ఉండేలాగ నాటుకోవాలి. దీనిలో ప్రత్యేకించి రకాలు లేవు కాని ప్రాంతీయంగా వివిధ రంగుల్లో పుష్పించే రకాలు (ఆరంజి, ఎరుపు, గులాబి, పసుపు) ఉన్నాయి.

ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 14 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 24 కిలోల పొటాష్ ను ఇచ్చే ఎరువులను దుక్కిలో వేసిదున్నాలి. అటు పిమ్మట 15-20 కిలోల నత్రజని ని ఇచ్చే ఎరువును 2 దఫాలుగా నాటిన మూడు నెలలకు, 8-9 నెలల వ్యవధిలో వేసుకోవాలి.

Also Read: Chrysanthemum Flowers: శీతాకాలం రాబోతుంది.. ఇంకా ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉంటుంది.!

Crossandra Flowers

Crossandra Flowers

కనకాంబరం నీటి ఎద్దడిని తట్టుకొంటుంది. అయినప్పటికి వాణిజ్య సరళిలో సాగుచేస్తే అవసరాన్ని బట్టి 10- 15 రోజుల వ్యవధిలో నీటి తడులు ఇవ్వాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీటి యాజమాన్యం చేయవచ్చు. మొక్కలు నాటిన 2-3 నెలల తర్వాత పూత ప్రారంభమైన సంవత్సరం పొడవునా పుష్పిస్తాయి.

కనకాంబరంలో ఎండుతెగులు ముఖ్యమైనది. ఎండు తెగులు ఆశించిన మొక్క ఆకుల అంచులు పసుపు వేర్లు, మొక్క కాండం మొదలు కుళ్ళటం వలన మొక్క ఆకస్మికంగా చనిపోతుంది. కాండాన్ని చీల్చి చూస్తే లొపల గోధుమ రంగుకు మారి ఉంటుంది. దీని నివారణకు పరిశుద్ధమైన సాగు పద్ధతులు పాటించాలి. మురుగు నీరు తీసివేయాలి. నిమటోడుల నివారణకు సోలరైజేషన్ చేయాలి.

భూమిలో వేపచెక్క, ప్యురడాన్ గుళికలు వేయాలి. భూమిని లీటరు నీటికి 2 గ్రా. బినోమిల్ లేదా 3 గ్రా. మాంకోజెబ్ కలిపిన ద్రావణంతో తడపాలి. నారు మొక్కలను 2 గ్రా. బినోమిల్ లేదా 1 గ్రా. కార్బండైజిమ్ మందు ద్రావణంలో ముంచి నాటుకోవాలి. ఎలా కనకాంబరం పువ్వుల్ని సాగు చేస్తే మంచి దిగుబడి వస్తుంది.

Also Read: Disease Management in Black Gram: మినుము లో వచ్చే వైరస్ తెగుళ్ల సమగ్ర యాజమాన్యం.!

Leave Your Comments

Chrysanthemum Flowers: శీతాకాలం రాబోతుంది.. ఇంకా ఈ పువ్వులకి మంచి డిమాండ్ ఉంటుంది.!

Previous article

Spinach: పోషక అద్భుతాన్ని అందిస్తున్న ఈ కూర ఏంటో , ఎలా సాగు చేయాలో మీకు తెలుసా ?

Next article

You may also like