Goat Farming: చాలా మంది రైతులు వ్యవసాయం మీద కాకుండా వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా ఆధారపడి అధిక లాభాలను అర్జిస్తున్నారు. అయితే ఈ నేపద్యంలో ప్రసుత్తం తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం వచ్చే అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో మటన్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో మేకల, గొర్రెల పెంపకంపై దృష్టి పెడుతున్నారు. ఆరుబయట ఎక్కడైనా గొర్రెల పెంపకాన్ని చేపట్ట వచ్చు లేదా దొడ్డిలో షెడ్డు వేసి గొర్రెలను, మేకలను పెంచవచ్చును. మెట్ట సేద్యం లో గొర్రెల పెంపకం అనేది ముఖ్యమైనది. కొద్దిపాటి పెట్టుబడితో సన్నకారు, చిన్నకారు రైతులు, భూమి లేని వ్యవసాయ కూలీలు గొర్రెల పెంపకం అనేది లాభసాటి ఉపాధిగా ఉంటుంది.
తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షలు
ప్రస్తుతం నెలంతా కష్టపడిన కూడా ఖర్చులు కూడా సరిపోవడం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారు. ఏ బిజినెస్ చేయాలన్న చేతిలో చిల్లిగవ్వ ఉండటం లేదు. అందుకే పెట్టుబడి విషయానికి వచ్చేసరికి వెనుకడుగు వేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో నెలకు రెండు లక్షల రూపాయల ఆదాయం తెచ్చే మేకల పెంపకం, గొర్రెల పెంపకం మంచి లాభాలను తెచ్చిపెడుతోంది.
Also Read: National Bamboo Mission: 50 శాతం సబ్సిడీ..ఎకరానికి రూ.4 లక్షల ఆదాయం.!
ప్రస్తుతం మటన్‌కు ఉన్న విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో గ్రామాల్లో మేకల పెంపకంపై దృష్టి పెడితే మంచి లాభాలను గడించవచ్చు. ఈరంగంలో అనుభవం ఉన్నా లేకపోయినా చాలా సింపుల్‌గా ఈపెంపకంతో మంచి రాబడిని పొందవచ్చు. అంతేకాకుండా వీటి అమ్మకంతో నెలకు రెండు లక్షల ఆదాయం కూడా సంపాదించవచ్చు. తక్కువ పెట్టుబడి తో వ్యాపారం చేయాలనుకున్న వారికి ఇదో మంచి అవకాశం ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం
గొర్రెల పెంపకంలో పెద్దగా తీసుకోవలసిన అతి జాగ్రత్తలేవీ ఏమి లేవు. పైగా పర్యావరణానికి గొర్రెలు తేలికగా అలవాటు పడి పోతాయి. రోజు రోజుకు మాంసం ధర పెరుగుతుంటుంది. ప్రతిసారి గొర్రె ఒక్కింటికి 1-2 గొర్రె పిల్లలను ఈనుతుంది . గొర్రె ఒక్కింటికి 20-30 కి. గ్రా. మాంసం లభిస్తుంది. పశుపోషణను కొనసాగించేందుకు గ్రామీణ ప్రాంతాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నారు. రాష్ట్రాన్ని బట్టి వీటి కొనుగోలుపై సబ్సిడీని మంజూరు చేస్తున్నారు. అయితే వీటి పెంపకం వ్యాపారం కోసం, వాతావరణం అనేది చాలా ముఖ్యమైనది. ఆవులు లేదా గేదెలు వంటి ఇతర జంతువుల కంటే పొడి వాతావరణంలో జీవించగలిగే మేకలను ఉత్పత్తి చేయడం ఉత్తమం.
Also Read: Plant Genome Saviour Community Award 2023: వరి సేద్యంలో కృష్ణాజిల్లా యువ రైతుకు జాతీయ అవార్డు.!