Inter Cropping: ఉద్యాన పంట రారాజు అయినా మామిడిని రైతులు సాగు చేస్తుంటారు. అయితే ఏడాదిలో పంట దిగుబడి ఒక్కసారి రావడంతో మామిడిలో అంతరపంటగా అల్లంను వేయడానికి రైతులు ముందుకు వస్తున్నారు. అల్లంతో రైతులు లాభాలను అర్జిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో సుమారు కొన్ని వేల ఎకరాలలో అల్లం సాగు చేయబడుతుంది. మామిడిలో సకాలంలో పూత నిల్వ ఉండకపోవటం అలాగే పిందే కూడా రాలడం వల్ల రైతులు ఎంతో నష్టపోతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా మామిడిలో అంతరపంటగా అల్లం సాగు చేస్తూ లాభాలను గడించవచ్చు.
అల్లం సాగు ద్వారా ఎకరాకు 12 టన్నుల పండిస్తూ టన్ను ఒక్కొంటికి రూ. 25000 చొప్పున మొత్తంగా మూడు లక్షల రూపాయలు రాబడి పొందొచ్చు అలాగే మామిడి సాగు నుండి ఎకరాకు ఐదు నుంచి పది టన్నుల పండిస్తూ టన్నుకు 5000 చొప్పున 50,000 మొత్తంగా, రైతుకు అన్నీ ఖర్చులు పోను 2 లక్షల వరకు అన్నదాతలకు మిగులుతుంది. కాబట్టి మామిడిలో అంతరపంటగా అల్లం సాగు చేయడం వల్ల రైతులకు లాభాలు చేకూరుస్తున్నాయి.
ఎర్ర, చల్కా, గరప నేలలు అనుకూలం.
అల్లం సుగంధ ద్రవ్యంగా ప్రసిద్ధి చెందింది. తాజా అల్లంను వంటకాలలో విరివిగా వాడతారు. పచ్చి అల్లం మీద ఉన్న పొట్టు తీసి సున్నపు నీళ్లలో శుద్ధి చేసి ఎండబెట్టిన అల్లంను సొంటిగా వాడతారు. దీన్నే ఉదర వంటి సంబంధమైన రోగాలకు వాడతారు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంకు అనువైనది. పాక్షికంగా ఉన్న ప్రాంతాలలో కూడా అల్లం పెరుగుతుంది. సముద్రమట్టానికి 1500 మీటర్లు ఎత్తు వరకు గల ప్రదేశాలలో అల్లం పంటను సాగు చేసుకోవచ్చు. ఎర్ర, చల్కా మరియు గరపనేలలు దీనికి అనుకూలం.
Also Read: Jaivik India Award 2023: ఏపీలో సేంద్రియ వ్యవసాయానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు.!
తేమతో కూడిన వేడి వాతావరణం దీనికి అనుకూలం. మన రాష్ట్రంలో ఏప్రిల్ మొదటి వారం నుండి మే చివరివారం వరకు అల్లంను విత్తుకోవచ్చు. మే నెలలో విత్తుకోవాలంటే నీటి వసతి ఉండాలి. ప్రాంతాల వారిగా చూస్తే సమయంలో పెద్దగా మార్పులు ఉండవు. దుంపలను విత్తేందుకు వర్షపాతం లేదా నీటి వసతి కావాలి. దీనివల్ల వర్షాలు పడే లోపల మొక్కలు భూమిలో బాగా నిలదొక్కుకొని పెరిగి ఉంటాయి. అనంతరం అధిక వర్షాలు పడినా కానీ మొక్కలు నిలబడగలుగుతాయి. వాతావరణం అనుకూలంగా లేనప్పుడు లేదా భూమి తయారీ ఆలస్యం అయినప్పుడు మే ఆఖరి వరకు కూడా ఎత్తుకోవచ్చు. విత్తడం ఆలస్యం అయితే దుంప కుళ్ళు ఎక్కువగా రావడమే కాకుండా దిగుబడులు తగ్గుతాయి.
ఉపయోగించే విధానాన్ని బట్టి పంట కోత
మొక్కలు లేత దశలో ఉన్నప్పుడు కలుపు ఎక్కువగా ఉంటుంది. జూన్ సెప్టెంబర్ నెలల మధ్య మూడు నాలుగు సార్లు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. కలుపు తీసిన తర్వాత పైపాటుగా నీరు కట్టి మల్చింగ్ చేయాలి. కలుపు తీసిన ప్రతిసారి భూమిని పైన గులభరచాలి. మొక్కల చుట్టూ మట్టిని ఎగదోసి పాత మల్చింగ్ తీసి కొత్త మల్చింగ్ వేయాలి. వర్షాకాలం చివర్లో ఏడు రోజులు ఒక్కసారి వేసవిలో నాటిన తొలి రోజుల్లో నాలుగు రోజులకు ఒకసారి అక్టోబర్ లో వారానికి ఒకసారి నీరు పెట్టాలి. వర్షాకాలంలో నీరు నిల్వ ఉంచకుండా జాగ్రత్త వహించాలి.
అల్లంను ఉపయోగించే విధానాన్ని బట్టి పంట కోత యొక్క సమయాన్ని నిర్ణయించాలి. ప్రధానంగా అల్లంను వివిధ రకాలుగా ఉపయోగిస్తారు. పచ్చి అల్లం కొరకు దుంపలు విత్తిన ఆరు మాసాల తర్వాత తవ్వడం ప్రారంభించాలి. ఎండిన అల్లం కొరకు ఆకుల పసుపు రంగుకు మారి ఎండిపోవడం ప్రారంభమైనప్పుడు అంటే నాటి 8 తర్వాత కోత ప్రారంభించాలి. అంటే నాటిన ఎనిమిది నెలలు తర్వాత కోత ప్రారంభించాలి.
Also Read: Increase Banana Yield: అరటి తోట ఇలా సాగు చేస్తే రైతులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుంది..