చీడపీడల యాజమాన్యం

Watermelon Cultivation: పుచ్చ సాగు విధానం, తెగుళ్ళు, చీడపీడలు నివారణ.!

1
Watermelon Cultivation
Watermelon

Watermelon Cultivation: పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుతకాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాల్లో సాగుచేస్తున్నారు. కానీ ఈ పంట దిగుబడి పొడి వాతావరణంలో అధిక దిగుబడులను పొందవచ్చు. అధిక విస్తీర్ణంలో సాగుచేస్తున్న రైతులు పూర్తి విస్తీర్ణన్ని ఒకేసారి కాకుండా దఫా, దఫాలుగా కొన్ని రోజుల వ్యత్యాసంతో విత్తుకోవాలి. దీనివల్ల మార్కెటింగ్ కి అనువుగా ఉంటుంది. ధరలను అంచవేయ్యలేము కావున ధరల వ్యత్యాసాలు మొత్తానికి సగటు ధర లభిస్తుంది.

పుచ్చ సాగుకు అనువైన నేలలు నీరు ఇంకే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, సారవంతమైన ఇసుక నేలలు, ఉదజని సూచిక 6-7 ఉన్న నేలలు అనువైనవి. విత్తనం వేసే ముందు భూమిని 2-3 సార్లు దున్నుకోవాలి. నేలమొత్తం వదులుగా అయ్యేల దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25-30 కిలోల యూరియ, మ్యూరేట్ ఆఫ్ పోటాష్ వేసుకొని చివరి దమ్ము చేసుకొని భూమిని విత్తనానికి సిద్ధం చేసుకోవాలి.

Also Read: Marigold Cultivation: బంతిపూలు ఏడాది పొడవునా సాగు.. రైతులకి మంచి లాభాలు.!

Watermelon Cultivation

Watermelon Cultivation

మన రైతులు బోదెల పద్ధతి, ఎత్తు బెడ్ల పధ్ధతి ఈ రెండు పద్ధతుల్లో విత్తుకుంటారు. బోదెల పద్ధతి కానీ, ఎత్తు బెడ్ల పద్ధతి ద్వారా కానీ విత్తనం విత్తేప్పుడు జిగ్ జాక్ పధ్ధతి అనుసరించి ఎత్తు బెడ్లకు రెండు వైపులా లేదా బోదేకు రెండు వైపుల మొక్కల మధ్య 75 సెంటి మీటర్లు, సాలుల మధ్య దూరం 120 సెంటి మీటర్ల దూరాలను పాటిస్తూ విత్తన్నని విత్తుకోవాలి.

మొక్క వయస్సు 25-30 రోజుల మధ్య ఉన్నపుడు ఎకరానికి 30-32 కిలోల యూరియ వేసుకోవాలి. మొక్క వయస్సు 55-60 రోజుల మధ్య ఎకరానికి 15 కిలోల యూరియ, మ్యురియేట్ అఫ్ పోటాష్ వేసుకోవాలి. మొక్కకి 3-4 ఆకులు ఉన్న సమయంలో 1 లీటర్ నీటికి 3 గ్రాముల బోరాక్స్ పిచికారి చేసుకోవలెను. దీనివల్ల బోరాన్ లోపం నిర్ములించబడుతుంది. కాయలలో పగుళ్ళను నివారించవచ్చు. అలాగే పూత దశలో పిచికారి చేసుకోవాలి.

మొక్క మీటరు పొడవు పెరిగిన సమయంలో మొక్క యొక్క చివర్లను తుంచి వెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల పక్కకొమ్మలు చిగురించి మొక్క గుబురుగు తయారవుతుంది దీనివల్ల అధిక దిగుబడులను పొందవచ్చు. పుచ్చ సాగులో మల్చింగ్, డ్రిప్ పద్ధతి ద్వారా సాగు చెయ్యడం వలన దిగుబడులను పెంచుకోవచ్చు. దీనివల్ల కలుపును నివారించవచ్చు, నీటి వృధను అరికట్టవచ్చు, వేసవి సమయంలో నీటిని అందించడం సులువుగా ఉంటుంది అలాగే ఎరువులను కూడా సులువుగా అందించవచ్చు. ఈ పద్ధతి ద్వారా సాగు చేస్తే కొంత వరకు అధిక దిగువడులను పొందవచ్చు.

విత్తనం నాటుకున్న 48 గంటలలోపు 1 లీటర్ నీటికి 5 మీ.లీ పెండిమిదలిన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మల్చింగ్ పద్ధతి ఉపయోగించడం ద్వారా కలుపును కొంత వరకు నిర్ములించవచ్చు.

పుచ్చ పంటను ఎక్కువగా వేసవిలో సాగు చేస్తాం కావున ఈ పంటకు నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అందుకే నీటి సౌలభ్యం ఉన్నపుడు మాత్రమే ఈ పంటను ఎంచుకోవాలి. విత్తనం నాటిన వెంటనే నీటిని అందించడం మొదలుపెట్టాలి. 5-7 రోజులకు ఒక్కసారి నేల స్వభావాన్ని బట్టి, నేల తేమ తగ్గకుండా నీటిని అందిస్తూ ఉండాలి. పూత, కాత మొదలయ్యే సమయాల్లో నీటి వత్తిడి ఉండకుండా చూసుకోవాలి. కాయలు పక్వానికి వచ్చే సమయంలో నీటిని అందించడం తగ్గించాలి. ఈ సమయంలో నీటికి ఎక్కువగా అందిస్తే కాయలు తక్కువగా వస్తాయి. అలాగే కాయ రుచి, నాణ్యత తగ్గుతుంది. డ్రిప్ పద్ధతి ఉపయోగించి మొక్కలను నాటినప్పుడు ఉదయం సమయంలో రోజుకి 20-30 నిమిషాల పాటు నీటిని అందించాలి.

తెగుళ్ళు, చీడపీడలు:

పండు ఈగ :

పండు ఈగ యొక్క లార్వాలు కాయలలోకి చొచ్చుకుపోయి కాయలను కుళ్ళిపోయేలా చేస్తాయి. ఈ పురుగు నివారణకు ముందస్తుగా పంట చేనులో పూతదశలో క్యూలూర్ ఎరలను ఏర్పాటు చేసుకోవాలి. క్యూలూర్ అందుబాటులో లేని సమయములో 10 లీటర్ల నీటిలో 100 మీ.లీ మలాథియాన్, 100 గ్రాముల బెల్లం కలుపుకొని వెడల్పాటి పళ్ళెంలో ఈ ద్రవాన్ని పోసి పంట చేనులో అక్కడ, అక్కడ ఎరలుగా ఉంచాలి. దీనివల్ల ఈ పండు ఈగ కాయలను ఆశించక ముందే నివారించవచ్చు. పంటకు ఆశించిన వెంటనే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మీ.లీ మలాథియాన్ లేదా 2 ml క్లోరిపైరిఫాస్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.

Aslo Read: GramHeet Startup: రైతులకు వరంగా మారిన గ్రామ్ హిత్ స్టార్టప్.!

Pests and Diseases in Watermelon Cultivation

Pests and Diseases in Watermelon Cultivation

ఎర్ర నల్లి:

పొడి వాతావరణ పరిస్థితులలో ఈ ఎర్రనల్లి పురుగు ఎక్కువగా ఆశిస్తుంది. దీనిని గుర్తుంచడం చాల కష్టం. ఈ పురుగు ఆకు యొక్క అడుగు బాగామునకు చేరి రసాన్ని పిలుస్తూ పంటకు నష్టం కలిగిస్తుంది. దీని నివారణ చర్యకు 1 లీటర్ నీటికి 1.5 మీ.లీ స్పెరోమెసిఫిన్ లేదా 3 మీ.లీ ప్రోపర్ గైడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.

తెల్ల దోమ:

జిగురు కలిగిన పసుపు రంగు అట్టలను చేనులో ఏర్పాటు చేసుకోవలెను. వీటి ఉధృతి ఎక్కువగా ఉంటే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 3 మీ.లీ ఇమిడాక్లోప్రిడ్ లేదా 2 గ్రాముల ఎసిటామిప్రిడ్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.

Also Read: PM Kisan Tractor Scheme: సగం ధరకే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు.. ఎవరు అర్హులు.?

తామర పురుగు:

తామర పురుగు ఆకులు ముడతలుగా, పసుపు రంగుకు మారి మొక్క ఎదుగుదల తగ్గిపోతుంది. నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2 మీ.లీ ఫిప్రోనిల్ కలుపుకొని పిచికారి చేసుకోవలెను.

Also Read: Solar Dehydration Units in AP: రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు..

Leave Your Comments

Marigold Cultivation: బంతిపూలు ఏడాది పొడవునా సాగు.. రైతులకి మంచి లాభాలు.!

Previous article

Cucumber Cultivation: కీరదోసకాయ పంట రక్షణ, నివారణ చర్యలు.!

Next article

You may also like