GramHeet Startup: అనేక కష్టనష్టాలకు పండించిన పంటను కాస్త మంచి ధరకు అమ్ముకోవాలని ప్రతి రైతు ఆశ పడుతాడు. కానీ పంట వచ్చినప్పుడు గిట్టుబాటు రాదు. ధర వచ్చినప్పుడు అమ్ముకుందామంటే గోదాముల కొరత. అంతేకాకుండా అందుబాటులో ఉండవు. దీంతో దళారులు చెప్పిన రేటుకు అమ్మేసి రైతులు నష్టపోతున్నారు. తక్కువ ధరకు అమ్ముకొని కన్నీళ్లతో ఇంటి బాట పట్టిన వారు ఎందరో అలాంటి వాళ్లకు వరంగా మారింది.
గ్రామ్ హిత్ స్టార్టప్ దుక్కి దున్ని, విత్తనం వేసి సాగుచేసి పంటను చీడపీడల నుంచి కాపాడుకోవడం ఒకెత్తు అయితే, అపంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం మరో ఎత్తు ఈ తరుణంలో రైతులు ఎదుర్కొనే సమస్యలు అన్ని ఇన్ని కావు. అందుబాటులో నిల్వ వసతి లేకపోవడంతో ప్రైవేటు గిడ్డంగుల మీద ఆధారపడి వలసి వచ్చింది. అవి కూడా దూర ప్రాంతాల్లో ఉండటంతో రవాణా చార్జీలు కూడా భారంగా ఉండేది. అందుకే రైతులు పంట చేతికి రాగానే తక్కవ ధరకే అమ్ముకునే వారు. కొంతమందికి మార్కెట్ మీద అవగాహన ఉండదు. అంతేకాకుండా కుటుంబ అవసరాల కోసం రైతులు అమ్ముకుంటారు. వీటిన్నింటికి చెక్ పెడుతోంది. గ్రామ్ హిత్. గిట్టుబాటు ధర వచ్చే దాకా పంట నిల్వ చేసుకోవడం తో పాటు అవసరమైన రైతులకు రుణాలు అందిస్తోంది.
Also Read: PM Kisan Tractor Scheme: సగం ధరకే ట్రాక్టర్ కొనుక్కోవచ్చు.. ఎవరు అర్హులు.?
ఇంటికే గిడ్డంగి
మహారాష్ట్రలోని యావత్మాల్ జిల్లాకు చెందిన పంకజ్ మహల్, శ్వేత రాత్రే వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చారు. వీరు యావత్మాల్ సమీపంలోని పరుడ్ టుకాలో రైతుల కోసం ‘గ్రామోహిత్ అనే డిజిటల్ ప్లాట్ ఫామ్ ను ఏర్పాటు చేశారు. పంట పండించే రైతులు, దాన్ని కొనుకునే వ్యాపారులు ఒకే చోటకు చేర్చి దళారులతో పని లేకుండా చేయడం గ్రా మోహిత్ లక్ష్యమని అన్నారు. పంట చేతికొచ్చింది మొదలు అమ్మి పెట్టే వరకు ఈసంస్ధ రైతుల వెంట ఉంటుంది. అలాగే పది గ్రామాలకు ఒక గిడ్డంగి చొప్పున –మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లలో నాలుగువందల స్టోరేజీలను ఏర్పాటు చేశారు. అలాగే సొంతంగా షిప్పింగ్ కంటైనర్ల మాదిరి స్టోరేజీలను తయారు చేశారు. ఒక్కో దాంట్లో రెండు టన్నుల ధాన్యం పైనే నిల్వ చేసుకోవచ్చు. వాతావరణ పరిస్థితులను బట్టి లోపల ఉష్ణోగ్రత ఉంటుంది. దీనిని పొలంలో గాని. ఇంటి ఆవరణలో గాని పెట్టుకోవచ్చు. పంటను గిడ్డంగులకు తరలించే పరిస్థితి లేనప్పుడు రైతులు ఈ కంటైనర్ ను బుక్ చేసుకోవచ్చు.
దీనిలో అమ్మకం చాలా తేలిక
మార్కెట్లో పంటకు ఎంత రేటు పలుకుతుందో ఏరోజుకు ఆరోజు వాయిస్ మెసేజ్ ద్వారా రైతులకు సమాచారమిస్తారు. ధర ఎక్కువగా ఉంటే అమ్ముకోమని సలహా ఇస్తారు. అది కూడా ఆన్లైన్ లో ఓ క్లిక్ చేస్తే చాలు కొనుక్కున్న వారు నేరుగా రైతుల దగ్గరకే వచ్చి పంటను తీసుకెళతారు. వరి, కంది, సోయా, మినుములు, పెపలు వంటి వాటిని పండించే రైతులకు గ్రామ్ హిత్ సేవలందిస్తోంది. దీని మీద రైతులకు రుణాలు కూడా ఇస్తోంది. పంట అమ్ముకున్నాక తీసుకున్న రుణాలను తిరిగి కట్టేయవచ్చు. ఇప్పటివరకు రైతులు తమ పంటలను మంచి రేటుకు అమ్ముకోవడంలో గ్రామ్ హిత్ చాలావరకు సాయపడింది. సుమారు ఇరవై కోట్ల రూపాయల వరకు రుణాలు పంపిణీ చేసింది. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలోనూ సేవలు అందిస్తున్న ఈ స్టార్టప్ టర్నోవర్ ఇరవై కోట్ల పైమాటే. సాగును, సాంకేతికతను జతచేసి అగ్రిటెక్ విప్లవాన్ని సృష్టిస్తున్న గ్రామోహిత్ సిస్కో గ్లోబల్ ప్రొబ్లమ్ సాల్వర్ ఛాలెంజ్ లో విజేతగా నిలిచి పది లక్షలు సొంతం చేసుకోవడంతో పాటు ఫోర్బ్స్ ఆసియా టాప్- 100 స్టార్టప్ ల జాబితాలో చోటు దక్కించుకుంది.
Also Read: Solar Dehydration Units in AP: రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల సోలార్ డీ హైడ్రేషన్ యూనిట్లు ఏర్పాటు..