Fish Distribution Scheme: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఏపీ చెరువులలో వేసిన చేపలే దిక్కయ్యేవి. కానీ నేడు మన చెరువుల్లో మత్స్యకారులు చేపలను పంట పండిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో వచ్చిన నీలి విప్లవం. అంటే సీఎం కేసీఆర్ అమలుచేసిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం ఫలితంగా ఈరోజు మత్య్సకారులు పట్టుబడుల విషయంలో విజయాన్ని సాధించారు గతంలో తెలంగాణలో చేపల ఉత్పత్తి తక్కువగా ఉండటంతో తెలంగాణకు అవసరమైన చేపలను అంధ్రప్రదేశ్ నుండే ఎక్కువగా దిగుమతి చేసుకునేవారు. దీని మూలంగా కాలలను బట్టి సీజన్‌తో సంబంధం లేకుండా ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ, రెండు మూడు సంవత్సరాల నుంచి ఏపీ నుంచి చేపల దిగుమతి తగ్గిపోయింది. ఈమధ్య కాలం నుంచి అయితే చేపల దిగుమతి పూర్తిగా బంద్ చేశారు.
తెలంగాణ ఎగుమతి చేసే స్థాయి
తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం బాగా విజయం సాధించింది. మత్స్యకారులకు ఆర్థిక భరోసా కల్పించి, వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో చేపల ఉత్పత్తిని పెంచి ప్రజలకు అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంను ప్రారంభించారు. దీంతో కొంతమందికి ఉపాది కూడా లభించింది. వేరే రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఇప్పుడు వీరే ఎగుమతి చేసుకునే స్ధాయికి చేరుకున్నారు. దాంతో తెలంగాణ మత్స్య సంపద భారీగా పెరిగింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు మనం రాష్ట్రం ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న చేపలను ఇక్కడి వ్యాపారులు కొని ఢిల్లీ, పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఛత్తీస్‌గఢ్ అస్సాం వంటి రాష్ర్టాలకు ఎగుమతి చేస్తుండటం గమనార్హం.
Also Read: Kisan Mulberry Cultivation: నర్సరీ సాగుకు కిసాన్ మల్బరీ సాగు ప్రోత్సాహాం.!
2 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి
2016-17కు ముందు తెలంగాణ రాష్ట్రంలో లక్ష టన్నుల చేపలు ఉత్పత్తి అయితే చాలు ఆది ఒక్క గొప్ప విషయంగా చెబుతారు. ఇవన్ని ఆలోచించిన తెలంగాణ సర్కారు 2016-17లో సీఎం కేసీఆర్ సర్కారు ఉచిత చేపల పంపిణీ పథకం ప్రారంభించారు. అప్పటి నుండి సుమారు 2 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అయినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఈఏడాది 4.38 లక్షల టన్నులకు పెరిగింది. ఇప్పటికి రాష్ట్రంలో చేపల ఉత్పత్తి సుమారు 125 శాతం పెరిగినట్టు అంచనా. ఒకప్పుడు కొర్రమీను అనేది తెలంగాణలో చాలా అరుదుగా ఉండేది. అప్పుడు ఎక్కువగా ఒడిశా రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకునేవారు.
ఈ రకం చేపల ధర కూడా కిలో రూ.800-900 వరకు పలికేది. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో కొర్రమీను ఉత్పత్తి భారీగా పెరిగింది. ప్రస్తుతం కిలో కొర్రమీను రూ.500లకు దిగొచ్చింది. ఇతర చేపల ఉత్పత్తి కూడా భారీగా పెరగడంతో గ్రామాల్లో రవ్వ, బంగారు తీగ చేపలు రూ.100 కిలో దొరకుతున్నాయి. ఇటీవల వర్షాలతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతో నీళ్లతో పాటు చేపలు కూడా బయటకు కొట్టుకొచ్చాయి.
చేపల ను ఎగుమతి చేసే స్థాయి : మంత్రి హరీశ్ రావు
రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు ఉచితంగా చేప పిల్లలను ఇవ్వడం వల్లనే ఈనీలివిప్లవం సాకారమైంది. ఎక్కడ చెరువులు, వాగులు, రిజర్వాయర్ల వద్ద చూసినా చేపల జాతర మనకు కనిపిస్తున్నది. సిద్దిపేట జిల్లా ఇప్పుడు ఆంధ్రాకే చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరిందంటే దీని ఫలితమే ఉచిత చేప పిల్లల పంపిణీ పథకమని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Also Read: Fodder Cultivation: ఉద్యాన చెట్ల మధ్య పశుగ్రాసాల సాగు.!