Kisan Mulberry Cultivation: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని అందించేందుకు ప్రభుత్వం కిసాన్ మల్బరీ సాగుకు ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈకిసాన్ మల్బరీ నర్సరీ సాగుతో ఆరు నెలల్లో ఆధిక లాభాలను అర్జించుకోవచ్చు. అంతేకాకుండా నర్సరీ సాగుకు ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. మల్బరీ సాగుకు ఎస్సీ. ఎస్టీలకు 90శాతం, ఓసి, బిసిలకు 75శాతం సబ్సిడీని అందిస్తుంది. ఆసక్తి ఉన్న రైతులు మల్బరీ సాగుకు ముందుకు రావాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో నర్సరీ సాగుకు అవసరమైన మొక్కలను ఏర్పాటు చేసి రైతులకు ఇచ్చేందుకు ప్రొత్సహిస్తోంది.
2లక్షల మల్బరీ మొక్కలే లక్ష్యం
ఒక ఎకరా కిసాన్ నర్సరీలో మల్బరీకి సంబందించి 1.60,000 మొక్కలను నాటితే వాటి పైన ప్రభుత్వం సబ్సిడీని ఇస్తోంది. దీనిలో 4నుంచి 5 నెలలుపాటు మొక్కలను పెంచాలి. తరువాత రైతులు నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్కలను తన పొలంలో సాగు చేసుకోవచ్చు, ఒక్కొక్క మొక్కకు రూ.2 ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్క ఎకరాకు 4000 నుంచి 10000 వరకు మొక్కలను సాగుచేసుకోవచ్చు. నర్సరీ మొక్కలకు ప్రభుత్వం 1.50.000 అందిస్తుంది. దీని ద్వారా రైతులు పూర్తిగా లాభాలను అందుకుంటారు.
Also Read: Fodder Cultivation: ఉద్యాన చెట్ల మధ్య పశుగ్రాసాల సాగు.!
ప్రస్తుతం ప్రభుత్వం రెండు నర్సరీ ద్వారా మొక్కలను పెంచుతోంది. రెండు నర్సరీలు కడపజిల్లాలో ఉన్నాయి. ఒక్కటి ఊటుకురు కాగా, రెండోది మైదుకురు. 2023-2024 సంవత్సరానికి ప్రతి నర్సరీలో 2లక్షల మల్బరీ మొక్కలను సాగుచేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈనేపద్యంలో ప్రభుత్వం నాలుగు వందల ఎకరాలకు మల్బరీ సాగు చేపట్టాలని నిర్ణయించుకుంది.
మైసురులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం
వ్యాధి రహిత పట్టు పురుగులను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మైసురులోని జాతీయ పట్టు గుడ్ల ఉత్పత్తి కేంద్రం నుంచి గుడ్లును తెప్పించి మరీ పెంచ సాగుతోంది. 100 గుడ్లును 1300 లకే తెప్పించి పెంచుతున్నారు. వీటిని కడపతో పాటు గిద్దులూరు, ప్రకాశం వంటి ప్రాంతాలకు సరాఫరా చేస్తున్నారు. నాణ్యమైన మల్బరీ మొక్కలను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు నేస్తోంది. అయితే కిసాన్ మల్బరీ సాగుతో అధిక లాభాలను పొందవచ్చు. అంతేకాకుండా ప్రైవేటు నర్సరీ నిర్వహణకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. ఈసాగుతో ఆరు నెలల్లో 2లక్షలకు పైగా ఆదాయాన్ని పొందవచ్చు. ముందుగా కడపజిల్లాలోని వర్సరీలో మొక్కలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారు. ఈఏడాది 400 ఎకరాలకు సాగు విస్తరించనుంది. అయితే నర్సరీలో 5 నెలలు మొక్కలను పెంచి అప్పుడు రైతులకు అమ్మాలి. దీని సాగు గురించి, రాయితీలు గురించి ఆధికారులు పూర్తి సమాచారం ఇస్తూ ముందుగానే అవగాహన పెంచుతున్నారు.
Also Read: Inspiring Story Woman Organic Farmer: సేంద్రీయ సాగులో మెలకువలు నేర్పుతోన్న మహిళా రైతు.!