తెలంగాణ

Minister Niranjan Reddy: ఆదర్శంగా నిలుస్తున్న రంగారెడ్డి జిల్లా యువ రైతులు – మంత్రి

2
Rangareddy Young Farmers with Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy
Rangareddy Young Farmers with Telangana Agriculture Minister Singireddy Niranjan Reddy

Minister Niranjan Reddy: హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులు కలిసారు. యువరైతులైన అదీప్ అహ్మద్, జైపాల్ నాయక్, యూ ట్యూబర్ శివకుమార్ లను మంత్రి అభినందించారు. ఈసందర్బంగా మాట్లాడుతూ మీరే తెలంగాణ భవిష్యత్ అని కొనియాడారు. వీరు ఎంటెక్ చేసి లండన్ ఉద్యోగం వదిలి వ్యవసాయం మీద మక్కువ తో బొప్పాయి సాగు అవకాడోను పండిస్తున్నారు. అంతేకాకుండా రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల యువ రైతులు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈపంటలే కాక జామ, దొండ, వరి సాగు చేసి పలువురుకి ఆదర్శప్రాయం అయ్యారన్నారు. మొజాయిక్ వైరస్ తో బొప్పాయి సాగు కు దూరమవుతున్న రైతులు దేశీ బొప్పాయి సాగుతో కేజీ రూ.30కి అమ్ముతూ ఆదీప్ అహ్మద్ 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.

ఎకరాకు రూ.5 నుండి రూ.10 లక్షల వరకు లాభాలు

మరో యువరైతు అయినా పండిస్తున్న కందుకూరు మండలం దెబ్బడగూడ తండా వాసి జైపాల్ నాయక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి, లండన్ లో ఎంబీఏ చదివి, వ్యవసాయం మీద ప్రేమతో ఉద్యోగం వదిలేసి ఎకరా 10 గుంటలలో అవకాడో పంట పండిస్తున్నారు. దీని ద్వారా ఎకరాకు రూ.5 నుండి రూ.10 లక్షల వరకు లాభాలు అర్జిస్తున్నామని యువరైతు అన్నాడు. రైతు అయినా జైపాల్ నాయక్ అవకాడో పంట సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నారు. యూట్యూబ్ ద్వారా వ్యవసాయ విజయాలను ప్రపంచానికి తెలియజేస్తున్న కల్వకుర్తికి చెందిన వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి శివకుమార్ లక్ష మంది సబ్ స్క్రబర్లతో విజయవంతంగా రైతుల విజయాల ప్రచారం ను నిర్వహించారు.

Also Read: FSSAI Salary in India 2023: 2,25,000 రూపాయల జీతంతో ఎఫ్‌ఎస్‌సై ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది..

Minister Niranjan Reddy

Minister Niranjan Reddy

వ్యవసాయమే ప్రపంచ దిక్సూచి

మీలాంటి యువతే రేపటి తరానికి ఆదర్శం అని మంత్రి కొనియాడారు. వ్యవసాయమే ప్రపంచ దిక్సూచి అని, వ్యవసాయ రంగం సుభిక్షంగా ఉంటేనే ఈప్రపంచం సురక్షితంగా ఉంటుందన్నారు. సాగుకు దూరమవుతున్న యువత మీలాంటి వారిని చూసి మళ్లీ వ్యవసాయాన్ని ప్రేమించాలని, మట్టి పరిమళాన్ని ఆస్వాదించాలని కోరారు. అంతేకాకుండా సాగు మీద దృష్టి పెట్టి పంటల ఉత్పత్తిలో అద్భుతాలు సృష్టించాలన్నారు. సమాజ ఆలోచనా విధానాన్ని సంపూర్ణంగా మార్చాలని దానికి యువత పునాదిరాళ్లు అని అన్నారు. మీనేతృత్వంలో మరింత మందిని కొత్తరకం వైపు మళ్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా జడ్పీ చైర్మన్ బాలాజీ సింగ్, రంగారెడ్డి జిల్లా ఉద్యాన అధికారి సునంద తదితరులు పాల్గొన్నారు.

Also Read: Casuarina Cultivation: ఈ చెట్లు పెంచడం ద్వారా రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.!

Leave Your Comments

Casuarina Cultivation: ఈ చెట్లు పెంచడం ద్వారా రైతులకి మంచి లాభాలు వస్తున్నాయి.!

Previous article

Aranya Permaculture: యువతీ యువకులకు దిక్సూచిగా మారిన అరణ్య పర్మాకల్చర్‌.!

Next article

You may also like