ఆరోగ్యం / జీవన విధానం

సోంపు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

0

సోంపును ఎక్కువగా రెస్టారెంట్లలో,హోటల్స్ లో భోజనం చేసిన తర్వాత ఇస్తూ ఉంటారు. పూర్వకాలంలో నిజానికి ఈ సోంపును భోజనం తర్వాత తప్పుకుండా తినేవారు. అయితే సోంపు గింజలతో జీర్ణ సమస్యలు రావని వారు గట్టిగా నమ్మేవాళ్ళు. అంతేకాకుండా సోంపు గింజలతో కేవలం జీర్ణ సమస్యలు మాత్రమే కాదు ఇతర అనారోగ్యాలను కూడా దూరం చేసుకోవచ్చు. అయితే సోంపు భోజనం చేసిన తర్వాత తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సోంపు గింజలలో మనకు కావలసిన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. అందులో ముఖ్యంగా విటమిన్ – సి, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి త్వరగా జబ్బుల బారిన పడకుండా చేస్తాయి. అలాగే ఎముకలు వృద్ధిచెందుతాయి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యి, గాయాలు కూడా త్వరగా మానె అవకాశాలు ఎక్కువ. ఇక సోంపు గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మరీ ముఖ్యంగా 87 రకాలకు పైగా సమ్మేళనాలను నిండి ఉంటుంది ఈ సోంపు. ఈ సోంపు గింజలలో రోజ్మరీనిక్ యాసిడ్, క్లోరోజెనిక్ యాసిడ్, క్వార్సేటిన్, ఆపిజెనిన్ మనబడి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబయల్, యాంటీవైరల్ గుణాలను కలిగి ఉంటాయని సైంటిస్టులు ఒక పరిశోధన ద్వారా తెలిపారు. అంతేకాకుండా ఫ్రీరాడికల్స్ నుంచి కాపాడే శక్తి వీటికి ఉంది. మరీ ముఖ్యంగా ఆకలిని నియంత్రించే గుణాలు సోంపు గింజలలో ఉన్నాయి. ఆకలి ఎక్కువగా అవుతుంది అనుకునేవారు ఈ సోంపు గింజలు తింటే సరిపోతుంది. అంతేకాకుండా ఈ సోంపు గింజలు తినడం వల్ల బరువు కూడా తగ్గుతారు. సోంపు గింజలు తినడం వల్ల గుండె సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఎందుకంటే వీటిలో వుండే మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. అంతేకాకుండా క్యాన్సర్ నివారిణీగా కూడా ఈ సోంపు గింజలు పనిచేస్తాయి.

Leave Your Comments

స్ట్రాబెర్రీస్ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Previous article

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యాన పంటలసాగు ప్రణాళికలు సిద్ధం..

Next article

You may also like