పశుపోషణ

Canadian Pygmy Goat: ప్రపంచంలోనే అత్యంత పోటీ విదేశీ మేక… ఇప్పుడు మన దగ్గర పెంచుతున్నారు..

2
Canadian Pygmy Goat
Canadian Pygmy

Canadian Pygmy Goat: వ్యసాయానికి డిమాండ్ పెరగడం వల్ల ఎక్కువ శాతం మంది వ్యవసాయం పై దృష్టి పెట్టారు. ఉద్యోగాలు చేస్తూ కూడా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొంత మంది ఉద్యోగాలకి రాజీనామా ఇచ్చి వ్యవసాయం మొదలు పెడుతున్నారు. చిత్తూరు జిల్లా, రాగిమాను పెంట గ్రామంలోని తలిపినేని లీల గారు గత 45 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. పెద్ద పెద్ద చదువులు చదివి, మంచి ఉద్యోగాలు వచ్చిన సంతృప్తి లేక వ్యవసాయం మొదలు పెట్టారు.

లీల గారు వ్యవసాయంతో పాటు మేకలను పెంచుతున్నారు. తనుకు ఉన్న మామిడి తోటలో ఒక షెడ్ వేసి మేకలను పెంచుతున్నారు. విదేశీ జాతికి చెందిన ఈ మేకలని కెనడియన్ పిగ్మీ అంటారు. ఈ మేకలు కేవలం ఒకటి నుంచి ఒకటిన్నర అడుగు ఎత్తు మాత్రమే పెరుగుతాయి. తక్కువ ఎత్తు ఉండడంతో ఈ మేకలని ప్రపంచంలోనే అత్యంత చిన్న మేకలుగా ప్రసిద్ధి చెందాయి.

Also Read: Tomato Farmer: టమాట సాగుతో 45 రోజులో 4 కోట్లు సంపాదించారు..

Canadian Pygmy Goat

Canadian Pygmy Goat

కెనడియన్ పిగ్మీ మేకకి పెద్దగా మైంటెనెన్స్ అవసరం ఉండదు. రెండు మేకలను పెంచడం మొదలు పెట్టి లీల గారు ప్రస్తుతం 20 మేకల వరకు పెంచుతున్నారు. ఈ మేకలు ప్రతి సంవత్సరం రెండు సార్లు పునరుత్పత్తి చేస్తాయి. ఒకసారికి 2 లేదా 3 పిల్లలు పుడతాయి. మేకల జాతిని తొందరగా అభివృద్ధి చేయడానికి ఈ రకం మేకలని పెంచుతున్నారు.

విదేశీ మేకలు మన వాతావరణానికి తట్టుకొని బాగా పెరుగుతున్నాయి. దీని వల్ల విదేశీ జాతుల మేకలని కూడా మన భరత దేశంలో పెంచుకోవచ్చు. ఈ మేకలకి అధికంగా మేత ఖర్చు కూడా ఉండదు. వీటికి జీవిత కాలం కూడా ఎక్కువ ఉంటుంది. ఈ మేకలని సులువుగా పెంచుతూ, మంచి లాభాలని పొందుతున్నారు.

Also Read: Lady Finger Farming: ఈ పంట సాగుతో 6 నెలలో 10 లక్షల వరకు సంపాదించడం ఎలా.!

Leave Your Comments

Tomato Farmer: టమాట సాగుతో 45 రోజులో 4 కోట్లు సంపాదించారు..

Previous article

Soil Fertilizer Mixture: మొక్కలు పెరగడంలో మట్టి ఎరువుల మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలి..

Next article

You may also like