Low Cost Farm Shed: రైతులు పోలంకి వాడే ఎరువులు, చిన్న చిన్న పరికరాలు ప్రతి రోజు ఇంటికి తీసుకొని వెళ్లి మళ్ళీ పని ఉన్న రోజు పొలం దగ్గరికి తీసుకొని రావడం చాలా ఇబ్బంది పడుతుంటారు. పొలం దగ్గరే ఎరువుల బస్తాలు పెడితే అకాల వర్షాలకి తడిచిపోయి అవకాశం ఉంది. రైతుల ఇబ్బంది పడకుండా ఉండడానికి పొలం దగ్గర తక్కువ ఖర్చుతో షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ షెడ్ ద్వారా రైతులకి మంచి లాభాలు ఉన్నాయి. నంద్యాల జిల్లా, జంబులదిన్నె గ్రామంలో సుధాకర్ రెడ్డి రైతు ఈ తక్కువ ఖర్చు షెడ్ ఏర్పాటు చేసుకున్నారు.
ఇలా షెడ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల రైతులు ఇంటి నుంచి ఎరువులు పొలం దగ్గరే పెట్టుకొని పోలంకి కావాల్సిన సమయంలో వేసుకోవచ్చు. పరికరాలు కూడా పొలం దగ్గరే పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి తట్టి చెట్లని వాడుకున్న్నారు. తట్టి చెట్టు దంతెలు వాడి షెడ్ పై కప్పు వేసుకున్నారు. ఈ దంతెల పై వెదురు బొంగు కట్టెలు అడ్డంగా వేసుకున్నారు. వాటి పై జమ్మూ ఆకులు వేసుకున్నారు.
Also Read: Rambutan Fruit: మృదువైన ముళ్ళతో కనిపించే పండు రాంభూటన్.!
ఈ షెడ్ 44 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు ఉంది. పొలంలో ఒక వైపు వేసుకున్నారు. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు షెడ్ లోపలికి నీళ్లు రాకండా షెడ్ పై భాగం టార్పాలిన్ వేసుకున్నారు. దీని వల్ల ఎంత ఎక్కువ వర్షం వచ్చిన షెడ్లోకి నీళ్లు రావు. పంట పొలంలోని ధాన్యం కొంత వరకు షెడ్ లోపల పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ షెడ్ ఏర్పాటు చేసుకోవడానికి దాదాపు లక్ష రూపాయల ఖర్చు అవుతుంది. పొలం కంటే కొంచం ఎత్తులో ఈ షెడ్ ఏర్పాటు చేసుకోవాలి. రైతులు రాత్రి సమయంలో పంటకి కాపలా ఉండి , ఈ షెడ్లో కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి కూడా ఉపయోగ పడుతుంది.
Also Read: Mountain Goats: పర్వత మేకలను ఎప్పుడైనా చూశారా.!