High Yield Hybrid Chilli Varieties: తెలుగు రాష్ట్రాల్లో పండించే అతి ముఖ్యమైన పంటలలో మిర్చి ఒకటి. ప్రపంచంలో ఇండియాలో ఈపంట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాలో ప్రపంచంలోనే అది పెద్దది గా పేరొందిన మిర్చి యార్డు ఉంది. ప్రసుత్తం ఇరు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు రైతులు పంటలకు సన్నద్ధం అవుతున్నారు. కొంత మంది రైతులు పత్తి, మొక్కజొన్న , సోయా వంటి పంటలు వేస్తుండగా, మరికొంత మంది అన్నదాతలు వరి నాట్లు వేస్తున్నారు. ముఖ్యంగా వాణిజ్య పంటగా పేరు గావించిన మిరపకు సిద్దం అవుతున్నారు. ఈఏడాది లక్ష ఎకరాలకు పైగా సాగు ఆవుతుందన అంచనాలు ఉన్నాయి. రైతులు ఎక్కువగా డబ్బీ, బ్యాడిగి రకాలతో పాటు 273, 2222, 5531, 2043, 4431, 5544, 2544 అనే హైబ్రిడ్ రకాలను ఎక్కువగా సాగు చేస్తారు. విత్తనం రకాన్ని కిలో రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు కొనుగోలు చేస్తున్నారు.
ఎకరానికి 30 నుంచి 50 వేల వరకు కౌలు
ప్రసుత్తం వర్షాలు కురుస్తుండటంతో నేరుగా రైతులు విత్తనం వేస్తున్నారు. గతేడాది మిర్చి దిగుబడులు తగ్గినా, రేట్లు ఆధికంగా పలకడంతో అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను పొందాయి. పెట్టిన పెట్టుబడులు రావడంతో ఉత్సాహంతో రైతులు అధికంగా మిరపను సాగుచేయడానికి సమాయత్తం అవుతున్నారు. రైతులు నర్సరీలు తోటల్లో నారును పెంచుతున్నారు. ఒక్కో ఎకరానికి 15వేల మొక్కలు అవసరం అవుతాయి. కాబట్టి వాటికి అనుగుణంగా నారును సిద్దం చేసుకుంటున్నారు. చాలామంది రైతులు నారును నర్సరీలోనే పెంచుతున్నారు. జలాశయాలకు నీరు చేరడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిరప సాగు చేసే రైతుల్లో ఎక్కువమంది కౌలు రైతులు ఉన్నారు. ఒక్కొక్క ఎకరానికి 30నుంచి 50 వేల వరకు తీసుకొని సాగు చేస్తున్నారు. కొంతమంది ముందుగానే కౌలు చెల్లించి మరీ పంటను సాగు చేస్తున్నారు.
Also Read: Tomato on Paytm: Paytm, ONDCలో సగం ధరకే టమోటా!
మిర్చికే మక్కువ
ఈఏడాది బహిరంగ మార్కెట్లో మిరప ధర క్వింటాకు రూ.25000 ఉండడంతో రైతులకు కూడా కొంత ఉపశమనం కలుగుతుంది. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాది కూడా మిర్చి పంటకు ఎక్కువ మంది రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఎగుమతుల్లో ఎక్కువ ధరలు రావడం, ఆశించిన స్థాయిలో ఆదాయాలు పెరగటమే ప్రధాన కారణం. ఈక్రమంలో రైతులు వాణద్య పంట అయినా మిర్చి వైపు రైతులు చూస్తున్నారు. గడిచిన నాలుగేళ్లలో మిర్చి ఎగుమతుల విలువ రూ.6000 కోట్ల నుంచి రూ.10,500 కోట్ల వరకు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీనిని బట్టి ఎక్కువమంది మిర్చికే మక్కువ చూపుతున్నారు. అయితే మిర్చికి ఎక్కువగా కాలువల ద్వారానే పంటను సాగు చేస్తారు.
Also Read: Electric Pole in Agricultural Land: మీ భూమి లో విద్యుత్ స్తంభం ఉంటే రూ.10,000 సంపాదించవచ్చు.!