Tomato on Paytm: ప్రస్తుతం మన దేశంలోనే కాక అన్ని రాష్ట్రాల మార్కెట్లో కూడా టమాట ధరలు కొండెక్కాయి. అంతేకాకుండా ఇప్పటికే సెంచరీ పూర్తి చేసుకున్న టమోటా ధరలు త్వరలో డబుల్ సెంచరీ కొట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్ లో 150 రూపాయలకు పైగా పలుకుతున్న టమాటా ధరలు కొన్ని జిల్లాల్లో ఒక్క రేటు, మరికొన్ని జిల్లాల్లో ఒక రేటు పలుకుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల్లో టమోట ధరలు ఒక్కోలా ఉన్నప్పటికీ వాటి ధర వింటే మాత్రం గుండె దడ అదరగొడుతుంది.
వాతావరణ మార్పులు వల్లన సరైన దిగుబడులు లేక వ్యాపారులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా డిమాండ్‌కు తగ్గ సప్లయి లేకపోవడంతో టమాటా ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో వినియోగదారులు ట‘మాట అంటేనే భయపడిపోతున్నారు. దీంతో టమోట ధర తగ్గించేందుకు అనేక అవకాశాలు ఉన్నప్పటికీ మార్కెట్లో అధిక ధరలకే విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల ఆధార్ ఉంటేనే టమాటా ఇస్తున్నారు. రైతుబజార్లులో వానను లెక్క చేయకుండా టమోటా కోసం క్యూ కడుతున్నారు. అయితే కొన్ని సంస్ధలు మాత్రం మాయాప్ ద్వారా బుక్ చేసుకుంటే తక్కువ ధరకే టమాటాలను ఇస్తామని చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Tomato Farmers: టమాటా నారు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే రైతులారా జాగ్రత్త.!
ONDC ప్లాట్‌ఫామ్, ఫిన్‌టెక్ సంస్థ, Paytm
ప్రభుత్వ ఆధీనంలోని ఉన్న ONDC ప్లాట్‌ఫామ్, ఫిన్‌టెక్ సంస్థ, Paytm వినియోగదారులకు, పేదవారి కుటుంబాల ఒత్తిడిని తగ్గించేందుకు ఈఅవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈయాప్ ద్వారా టమోటాలను సగం ధరకే మనం కొనవచ్చు. అంతేకాదు ఇంటికి ఉచితంగా డెలివరీని కూడా పొందొచ్చు. Paytm ఈటమోటాలను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్(NCCF) ద్వారా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతానికి ఢిలీ-NCR ప్రాంతంలో నివసించే వారికి మాత్రమే ఈఆఫర్ అందుబాటులో ఉంది.
Paytm, ONDC యాప్ నుంచి వీటిని పొందవచ్చు. ముందుగా Paytm యాప్ ఓపెన్ చేసి ఫోన్ నెంబర్‌తో లాగిన్ అవ్వాలి. తరువాత సెర్చ్ బటన్2 పై క్లిక్ చేసి ONDC అని టైప్ చేయండి. ఆ తర్వాత ONDC ఫుడ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఈ ఫుడ్ పేజీలో టమోటాస్ ఫ్రమ్ NCCF లేదా టమోటా @70 ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆతర్వాత ఎంత క్వాంటిటీ కావాలో కిలోల సంఖ్యను మనం ఎంచుకోవాలి. అనంతరం అడ్రస్ ఎంటర్ చేసుకోవాలి. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ప్రీపెయిడ్ ఆప్షన్ లేదా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.ఇలా టమోటాలను సులభంగా సగం ధరలకే ఇంటి వద్దకే రప్పించుకోవచ్చు. ONDC ప్రకారం, వినియోగదారులు Paytm నుంచి పూర్తిగా ఉచిత డెలివరీతో పాటు 140 రూపాయలకు గరిష్టంగా రెండు కిలోల వరకు టమోటాలను కొనుగోలు చేయవచ్చని సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
తగ్గే అవకాశం ఉందని అంచనా
మరో శుభవార్త ఏంటంటే నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ నివేదికల ప్రకారం రాబోయే రోజుల్లో టమోటా ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఇది ప్రభుత్వ సహాయంతో ఈసేవ ప్రారంభించబడింది. ప్రస్తుతం ఈకంపెనీ సేవలు ఢిల్లీ-NCR, ముంబై, కోల్ కత్తా, చెన్నై, కాంచీపురం, హైదరాబాద్, బాగల్ కోట్, లక్నోలో అందుబాటులో ఉన్నాయి. Paytmలో సెర్చ్ చేయడం ద్వారా మీరు ఈఅవకాశాన్ని పొందొచ్చు. దీంతోమనం సగం ధరలకే టమాటాను పొందవచ్చు. కొంతమేరకు మనం ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇలాంటి కొన్ని సంస్థలు ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: Tomato linked with Aadhar Card: ఏపీ లో ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే టమాటా.!