ఆంధ్రప్రదేశ్

YS Jagan Reviews Flood Relief Measures: వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సీఎం జగన్ సమీక్ష.!

2
YS Jagan Reviews Flood Relief Measures
YS Jagan Reviews Flood Relief Measures in Andhra Pradesh

YS Jagan Reviews Flood Relief Measures: ఆంధ్రప్రదేశ్‌తోపాటు, తెలంగాణ, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణా, ఇతర నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏపీలోని కొన్ని జిల్లాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈసందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. రోజు రోజుకీ భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండటంతో.. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సీఎం ఆదేశించారు.

అధికారులు మంచి చేశారు అని చెప్పుకోవాలి.

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం సుమారు 16 లక్షలకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్న తరుణంలో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని సీఎం తెలిపారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయ, పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలన్నారు. అధికారులు మానవీయ కోణంలో సాయం అందించాలన్నారు. డబ్బుల గురించి ఆలోచించకుండా బాధితులకు అండగా ఉండాలన్నారు. అధికారులు తమకు మంచి చేశారు అన్న మాటే తనకు వినిపించాలని సీఎం చెప్పారు.

Also Read: Tomato linked with Aadhar Card: ఏపీ లో ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే టమాటా.!

YS Jagan Reviews Flood Relief Measures

YS Jagan Reviews Flood Relief Measures

నిత్యావసరాలు అందరికీ అందజేయాలి

ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజల ఇళ్లు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు పంపినట్లు అధికారులు సీఎంకు వివరించారు. అవసరం అనుకుంటే… పరిస్థితిని అంచనా వేసుకుని మిగిలిన ప్రజలను కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సీఎం జగన్‌ తెలిపారు. సహాయ శిబిరాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలన్నారు. సహాయ శిబిరాల నుంచి తిరిగి ఇళ్లకు పంపించేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2వేలు రూపాయలు ఇవ్వాలని, వ్యక్తులైతే వారికి రూ.1000లు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ

ఈనాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామన్నారు. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయివరకూ కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. సచివాలయ స్థాయిలో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సచివాలయాల సిబ్బందిని, వాలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని, ముంపు బాధిత గ్రామాల మీద, లంకల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా చూసుకోవాలన్నారు. లంక గ్రామాలలో జనరేట్లర్లు లాంటివాటిని సిద్ధంచేసుకోవాలన్నారు. తాగునీటి కొరత లేకుండా, తాగునీటి సరఫరా వ్యవస్థలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య శిబిరాలను కూడా ఏర్పాటు చేయాలన్నారు.

Also Read: Modern Agricultural Equipment: ఆధునిక వ్యవసాయ పరికరాలు.!

Leave Your Comments

Tomato linked with Aadhar Card: ఏపీ లో ఇక నుంచి ఆధార్ కార్డు ఉంటేనే టమాటా.!

Previous article

Minister Niranjan Reddy: 24 గంటలు కరెంటు ఉందంటే అది తెలంగాణ మాత్రమే.!

Next article

You may also like