ఉద్యానశోభ

నిమ్మ, బత్తాయిపండ్ల తోటలలో బోరాన్ లోపలక్షణాలు – నివారణ

0

నిమ్మ, బత్తాయి పండ్ల తోటల సాగుకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలును సరైన మోతాదులో, సరైన సమయంలో అందించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రధానపోషకాలు మొక్కకి అందుబాటులో ఉన్నప్పటికి, సూక్షపోషకలోపాలు ఉంటే దిగుబడులు తగ్గటాన్ని గమనించవచ్చు. సూక్ష్మపోషకాలులో ముఖ్యమైనటువంటి బోరాన్ లోపించింవినట్లయితే పూత, కాత తగ్గడమేగాక, పండ్ల దిగుబడి, నాణ్యత లోపించి  మార్కెట్లో సరైన ధర లభించక రైతులకు నష్టం కలుగుతుంది.

నిమ్మ:

ఆకులు చర్మం లాగ దళసరిగా మారి, పచ్చ దనం కోల్పోయి, క్రమంగా గోధమ వర్ణంలోకి మారి జీవం లేకుండా పోతాయి. భూమిలో తేమ ఉన్నప్పటికీ ఆకులు ఎండిపోయినట్లుగా కనిపిస్తాయి. ఆకులు అడుగు భాగంలో ఈనెలు ఉభికి, కొన్ని పగిలి బెండులా తయారవుతాయి. ఆకులు వంపు తిరిగి ఉండటాన్ని కూడ గమనించవచ్చు. కాయలు గట్టిపడి తోలు మందంగా తయారవుతాయి. కాయల్లో రసం తగ్గిపోయి పిప్పిలాగ మారిపోతాయి. కాయలోపలి విత్తనాలు సరిగా ఎదగక, రంగు మారిపోతాయి. తెల్లటి తొక్కలో గోధమ రంగు లేదా తేనె రంగు మచ్చలేర్పడి, ఆ ప్రాంతంలో కొద్దిగా బంక ఏర్పడుతుంది.

నివారణ:

లీటరు నీటికి 2 గ్రా. సాల్యుబార్ లేదా గ్రాన్యుబార్, 10 గ్రా. యూరియా + అర మి.లీ. సబ్బు బంక కలిపిన ద్రావణాన్ని చెట్లు కొత్త చిగురు వేసే దశలో ఒక సారి, 15 రోజుల తర్వాత మరోసారి పిచికారి చేయాలి.

బత్తాయి:

భూమిలో బోరాన్ గాఢత 0.5 పి.పి.యం., మొక్కల కణజాలంలో 20 పి.పి.యం. కన్నా తక్కువనప్పుడు బోరాన్ లోప లక్షణాలు ముందుగా లేత ఆకులు, లేత కొమ్మల్లో కనిపిస్తాయి.

లోప లక్షణాలు: లేత ఆకులు దళసరిగా మారి, వంపులు తిరిగిపోతాయి. పత్రహరితం కోల్పోయి క్రమంగా అకులు గోధమ వర్ణంలోకి మారి, ఆకుల పరిమానం కూడ తగ్గిపోతుంది. లేత కొమ్మలు ముందుగా కుళ్ళిపోయి తరువాత చనిపోతాయి. పండ్లు తోలు మందంగా, గరుజుగా మారి నాణ్యత లోపిస్తుంది. అంతేకాకుండా పండు గట్టిపడి, రసం తగ్గి పిప్పిగా మారి, దిగుబడి తగ్గిపోతుంది.

నివారణ:

ఒక లీటరు నీటికి 2.5 గ్రా. బోరాక్స్ + అర మి.లీ. సబ్బు బంక నీరు కలిపి చెట్టంతా తడిచేలా పది రోజుల వ్యవధిలో రెండు లేదా మూడు సార్లు పిచికారి చేసి లోపాన్ని నివారించుకోవచ్చు.

Leave Your Comments

కోడి పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు…

Previous article

Asparagus Cultivation: వేసవి కాలంకు అనువైన తోటకూర పంటలు మరియు రకాలు.!

Next article

You may also like