PM Kisan 14th Installment: రైతులకు శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు మోదీ ప్రభుత్వం అందించే నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. తొలి విడత తో పోలిస్తే ప్రతి విడతకు అన్నదాతల సంఖ్య తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధుల్ని ఈరోజు విడుదల చేయనున్నారు. దాదాపు 8.5 కోట్ల మంది భారతీయ రైతుల ఖాతాల్లో రూ. 2000 చొప్పున పడనున్నాయి. రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన ప్రారంభించింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్య కలాపాలు సహా రైతుల అవసరాలు తీర్చేందుకు పంట సాయం కింద ఏటా రూ. 6000 మూడు విడతల కింద అందిస్తున్నారు. దీనిని నాలుగు నెలలకు ఓసారి రూ. 2 వేల చొప్పున అకౌంట్లో జమ చేస్తారు. భూమి ఉన్న రైతులకు సంవత్సరానికి రూ. 6 వేలు అందుతాయి. ఇప్పటికే 13 దఫాలుగా విడుదల చేయగా చివరిసారి ఫిబ్రవరిలో రైతుల అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి.
ఈ కేవైసీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం
కేంద్ర ప్రభుత్వం 2018 ఫిబ్రవరి 1 పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా 2000 చొప్పున మొత్తం ఆరు వేలు రైతులకు ఇస్తున్నారు. ఏప్రిల్-. జూలై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్- మార్చి ఇలా మూడు విడతలుగా ఇస్తున్నారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటికే 13 దఫాలుగా ఇచ్చారు. దీనిలో కొంతమందికి నిధులు జమ కాలేదు. సంవత్సరానికి, సంవత్సరానికి అన్నదాతలను తగ్గిస్తు వచ్చారు.
ఈనేపథ్యంలో 14వ విడతలో రైతులు ఇంకా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. దీనిలో రైతులు అనేక ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. ఈ కేవైసీ బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు మంజూరు కావడం లేదు. రేషన్ కార్డు ఆధారంగా ఇంట్లో ఒక్కరని తీసుకొని, ఆదాయపు పన్ను చెల్లించిన వారికి ఈ పథకం నుంచి తీసేస్తున్నారు. కొత్తగా పట్టాదారు చెందినవాళ్లు 20000 మందికి పైగా ఉన్నారు.
pmkisan.gov.in వెబ్‌సైట్
ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. మొదటి పేజీలోని ఫార్మర్స్ కార్నర్ సెక్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అక్కడ బెనిఫిషియరీ స్టేటస్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే రైతు ఆధార్ నెంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ చేయాలి. తర్వాత Get Data పై క్లిక్ చేయాలి. దీనిపై క్లిక్ చేయగానే.. పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్ మీకు కనిపిస్తుంది. అర్హులైన రైతులు పీఎం కిసాన్ 14వ విడత నిధుల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వర్షాలు పడుతున్నాయి. రైతులు ఖరీఫ్ కు సిద్దమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ఖర్చులు ఇలా చాలా ఖర్చులకు ఉన్నాయి కర్షకులకు. మరీ ఈ 2000 దేనికి సరిపోతాయో కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. మార్కెట్లో 10 గ్రాములు విత్తనాలు కొనాలంటే 2000 అవుతున్నాయి, ఎకరం విత్తనం వేయడానికి 20000 ఖర్చు అవుతుంది మరి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరుతున్నారు.