July Month Animal Protection: 1. జూలై మాసంలో దుమ్ముతో కూడిన తీవ్రమైన గాలి మరియు అధిక వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ గనుక పశువులను మరియు జీవాలను చిత్తడి, వరదలు, ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణంనుండి కాపాడుకోవాలి.
2. పశువులకు, గొర్రెలకు, మేకలకు నట్టల నివారణ మందులు త్రాపించవలెను.
3. రైతులు ఇప్పటి వరకు పశువులకు మరియు జీవాలకు గాలికుంటు, గొంతువాపు, ఆంథ్రాక్స్ (నల్లజాడ్యం) మరియు ఎంటరో టాక్సీమియా (అతిగా తినడం వల్ల కలిగే వ్యాధి) వ్యాధులకు టీకాలు వేయించకపోయినట్లయితే ఈ నెలలో తప్పక వేయించాలి. ముఖ్యంగా ఎదిగిన గొర్రెలకు మరియు మేకలకు తప్పకుండా ఎంటరో టాక్సీమియా వ్యాధి టీకాలు వేయించాలి.
4. అపుడే పుట్టిన గేదె, ఆవు దూడలకు, గొర్రె, మేక పిల్లలకు పుట్టిన 2 గంటలలోపు రోగనిరోధక శక్తి అధికంగా కలిగిన జున్ను/ముర్రు పాలు త్రాపించాలి.
5. ఈనిన 7-8 రోజులలో పాలిస్తున్న పశువులలో ‘‘పాల జ్వరం’’ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ సమస్యను అధిగమించడానికి పశువు చూడితో ఉన్నపుడే బాగా సూర్యరశ్మి తగిలేలా జాగ్రత్త వహించాలి. దీనితో పాటు పశువు ప్రసవించే సమయంలో మాయ వేయకపోవడం వంటి సమశ్యలు రాకుండా చూడి చివరి మాసంలో పశువుకు విటమిన్-ఇ మరియు సెలినియం ను ఇంజక్షన్ ద్వారా ఇప్పించాలి. రోజూ 5-10 గ్రాముల సున్నం (లైమ్) లేదా 70-100 మి.లీ. కాల్షియం G పాస్ఫరస్ మిశ్రమాన్ని పశువుకు ఇవ్వాలి.
6. పశువులను నీరు పారే పొలంలో పెరిగే పచ్చిగడ్డిలో నేరుగా మేపరాదు. ఎందుకంటే సుదీర్ఘ వేసవికాలం తర్వాత వర్షం కారణంగా త్వరిత గతిన పెరిగిన పచ్చిగడ్డిలో పషపూరితమైన ‘‘సైనైడ్’’ అనబడే విషకారకం ఉంటుంది. ముఖ్యంగా జొన్న పంటలో ఇది అధికంగా ఉంటుంది. కనుక పచ్చి గడ్డి పూర్తి పక్వదశకు వచ్చినప్పుడు మాత్రమే కోసి మేపవలసి ఉంటుంది.
7. దీర్ఘకాలిక గడ్డిరకాలైన పారా గడ్డి, గిని గడ్డి, అంజన్ గడ్డి, రోడ్స్ గడ్డి, దీనానథ్ గడ్డి, హెడ్జి లూసర్న్ మెదలైన వాటిని ఈనెలలోనె నాటుకోవాలి. ఈ రకాలు నాటిన 40-50 రోజుల తర్వాత కోతకు వస్తాయి. సమతుల ఆహారం కొరకు మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి గ్రాసాలను చిక్కుడు జాతి వంటి పశుగ్రాస రకాలతో కలిపి విత్తుకోవాలి.
8. గొర్రెలలో ఉన్ని తీసిన 21 రోజుల తర్వాత వాటి శరీరాలను అంటురోగ క్రిములను చంపు మందులతో (మలాథియాన్, ఫెన్ వలరేట్, సుమిసిడిన్ మొ.) పిచికారి లేదా డిప్పింగ్ చేయాలి.
నీలినాలుక వ్యాధి :
. వర్షాకాలంలో గొర్రెలలో వచ్చే ప్రధాన వ్యాధి నీలినాలుక వ్యాధి.
. మూతి వాపు వ్యాధి, నోటిపుండ్ల వ్యాధి, పూత రోగం అని వివిధ పేర్లతో పిలువబడే ఈ వ్యాధి వర్షాకాలంలో ఎక్కువగా సంక్రమిస్తుంది.
. ఈ వ్యాధి మేకలలో అరుదుగా సోకుతుంది..
వ్యాధి కారకం :
. రిమోవిరిడి కుటుంబంలోని ఆర్బి వైరస్ వలన ఈ వ్యాధి వస్తుంది
. క్యూలికాయిడిస్ అనే దోమ వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.
. వర్షా కాలంలో దోమల తీవ్రత అధికంగా ఉండటం వలన ఈ వ్యాధి తీవ్రత కూడా అధికంగా ఉంటుంది.
Also Read: PM Kisan 14th Installment: నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల.!
వ్యాధి లక్షణాలు :
. దోమ కాటు వలన ఈ వైరస్ గొర్రెల శరీరంలోకి ప్రవేశిస్తుంది.
. గొర్రెలకు 105ళీ-107ళీ%ఖీ (42ళీష%) జ్వరం వచ్చి 5 రోజుల పైగా ఉంటుంది.
. జ్వరం వచ్చిన తర్వాత నోటి నుండి చొంగ కారడం, నోరు మొత్తం ఎర్రగా మారడం, చొంగ నురగలా మారి పెదవులనుండి కారడం చిగుళ్ళ పై దవడ, నాలుక వాయడం, నాలుక రెండు వైపులా పుండ్లు ఏర్పడి ఉబ్బిపోయి నీలి రంగుకు మారుతుంది. తర్వాత నోటి లోపలి బాగం పూర్తిగా దెబ్బ తిని ఆహారం తీసుకొనేందుకు ఇబ్బందులకు గురవుతాయి.
. గొర్రెలలో, ముక్కు లోపలి నుండి చీము రావడం, చీముతో పాటు రక్తం వస్తుంది. ఆ పైన ముక్కులో జిగురు ఎండిపోవడంతో శ్వాస తీసుకోలేని (అస్పెక్సియ) స్థితి ఏర్పడి గొర్రెలు, మేకలు చనిపోయే అవకాశం ఉంది.
. వ్యాధి తీవ్రత పెరిగినప్పుడు వైరస్ నోటినుండి కాళ్ళకు సోకుతుంది.
. గిట్టల మొదటి భాగం ఎర్రగా కందిపోయి (కరో నెట్ ల్యాండ్ వాపు ) వాచి, చీముపట్టి నడవలేక పోతాయి.
. మేత తినలేకపోవడం వలన జీవాలు నీరసించి బరువు కోల్పోతాయి, బక్కచిక్కి చనిపోయే ప్రమాదము ఎక్కువ.
. వ్యాధి ముదిరిన తరువాత నాలుక నీలిరంగుకు మారి నోటి నుండి దుర్వాసన వస్తుంది.
. పిండం మరణించడం, న్యుమోనియా, బక్కచిక్కి పోవడం వంటివి ఆఖరి దశ.
వ్యాధి చికిత్స మరియు నివారణ :
. వైరస్ వలన వచ్చేవ్యాధులకు సరైన చికిత్స లీడు, కావున లక్షణాల ఆధారిత చికిత్స (సింప్టోమాటిక్ చికిత్స) చేయాలి
. ఆరోగ్యవంతమైన జీవాలు, జలుబు చేసిన జీవాల నుండి వేరుచేయాలి. వేరు చేసిన తర్వాత చికిత్స ఆరంభించాలి.
. పోటాషియం పర్మాంగనేట్ 1% ద్రావణంలో నోటి పుండ్లను కడగాలి.
. గిట్టల చుట్టూ ఉన్న పుండ్లకు హిమాక్స్, వేపనూనె పూయాలి.
. పెన్సిలిన్ ఆంటీబయాటిక్ ఓరల్ ఎన్రోఫ్లోక్సియాసిన్ వంటి మందులు 3-5 రోజులు వాడాలి.
. కొన్ని జీవాలలో పారుడు కూడా ఉంటుంది కనుక నూకల జావలో కొంచెం ఉప్పు కలిపి ఇవ్వాలి. సెలైన్స్, ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్ మరియు మినరల్స్ అందించాలి. ఇవి నీరసం పోయి బలాన్ని అందించడానికి తోడ్పడతాయి.
. ఆప్తోకేర్ పౌడర్ వాడటం వలన నోటి పుండ్లు, కాలి పుండ్లు తగ్గుతాయు. ఇవి 15 గ్రా. చొప్పున ఇవ్వాలి.
. ఈ వాధి వ్యాప్తిలో ప్రధాన కారణం కోమకాటు కాబట్టి సాయంత్రం వేళలో అనగా 6:00 నుండి 7:00 గ0. లోపు దోమలు ఎక్కువగా కుడుతాయి కనుక వేపాకు / యుక్టోపస్ / కలబంద ఆకును కాల్చి మంద చుట్టూ పొగ పెట్టడం మంచిది. వ్యాధి అరికట్టడానికి మరియు వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఈ పద్దతి పాటిస్తారు.
టీకాలు :
. రక్షాబ్లూ (ఇండియన్ ఇమ్మునోలాజికల్స్)
మోతాదు : 2 మి.లీ. / ఇంట్రమస్కులర్ (లేదా) సబ్ `క్యూటేనస్ ద్వారా ఇవ్వాలి.
. చూడి జీవలకు ఈ టీకా ఇవ్వకూడదు.
. టీకా వేసిన 21 రోజుల వరకు జీవాలను పంపకూడదు.
లైవ్ అటెన్యూటెడ్ టీకాలు వ్యాధి వ్యాప్తి చెంచే సమయంలో వాడకూడదు.
Also Read: Nutritional Backyard Gardening: పోషకాహార పెరటి తోటల పెంపకం.!