ఆరోగ్యం / జీవన విధానం

శరీరానికి తగినంత పొటాషియం అందకపోతే కలిగే నష్టాలు..

0

మనం ప్రతి రోజు తీసుకునే ఆహారంలో ఎన్నో విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. అలాంటి ముఖ్యమైన పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి. ఇది మన శరీరంలో కండరాల కదలికలకు నరాలు ఆరోగ్యంగా ఉండటానికి ద్రవాల నియంత్రణలో కీలక పాత్రను పోషిస్తుంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చాలా మందిలో పొటాషియం లోపంతో పలు జబ్బులు వస్తున్నాయి. రోజువారీగా మనం తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా.. పొటాషియం ఎక్కువ ఉండేలా చూసుకోవడం మంచిదని సెలవిస్తున్నారు పోషకాహార నిపుణులు. శరీరానికి కావాల్సినంత స్థాయిలో పొటాషియం అందడం వల్ల గుండె జబ్బులు, రక్తపోటు, పక్షవాతం వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని పలు తేల్చారు. పొటాషియం లోపించడం వల్ల నీరసం, అలసట తరచుగా కనిపిస్తాయి. రక్తంలో పొటాషియం స్థాయిలు తగ్గితే కండరాలు బలహీనంగా మారి విపరీతమైన నొప్పులు వస్తాయి. జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. రక్తంలో పొటాషియం లోపించినప్పుడు ఆ ప్రభావం గుండె మీద కూడా పడుతుంది. గుండె కొట్టుకునే విధానంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది. చేతులు, అరచేతులు, కళ్ళు, పాదాల్లో సూదుల్తో గుచ్చినట్టు ఉండి ఒక్కసారి స్పర్శ కూడా తెలియాకుండా ఉంటుంది.
సరైన ఆరోగ్యానికి సరిపడా పొటాషియం లభించాలంటే తాజా పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. అరటిపండ్లు, బత్తాయి, దోసకాయ, టమాటాలు, ఉప్పు లేకుండా వేయించిన వేరుశనగ, బీన్స్, బంగాళాదుంపలు, మునగాకు, కొత్తిమీరల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం సమృద్ధిగా అందే కొవ్వు లేని వెన్న తీసిన పాలు, పాల ఉత్పత్తులు, పెరుగు రోజూ తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి మామూలు వాడకం కన్నా కాస్త ఎక్కువగా తీసుకున్నా మంచిదే. అవకాడో, చిరుధాన్యాలు, బ్రెడ్ , వాల్ నట్స్, పిస్తా, యాపిల్, కివీ, ఆకుపచ్చని కూరగాయలు వంటి ఆహారాలను తీసుకుంటే పొటాషియం లోపాన్ని అధిగమించవచ్చు.

Leave Your Comments

ఉద్యోగం వదిలి వినూత్న పంటలు సాగు చేస్తున్న సుధాకర్…

Previous article

కోడి పిల్లల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు…

Next article

You may also like