Pulses Cultivation Management: అపరాలలో ముఖ్యమైనది పెసర, మినుము ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో తొలకరి, రబీ పంటగా పండిస్తారు. పెసరలో 6 నుండి 7 కిలోలు ఎకరానికి (తొలకరిలో) మినుములో (ఎనిమిది నుండి పది కిలోలు) ఎకరానికి తొలకరి పంటగా వేస్తారు. అపరాల పంట సాగులో ముఖ్యంగా విత్తన శుద్ధి ప్రధాన అంశము.
విత్తన శుద్ధి చేయడానికి కిలో విత్తనానికి 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును వాడాలి లేదా కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా ఐదు గ్రాముల ధయోమిధాక్సమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చుపురుగుల వారి నుండి రక్షించుకోవచ్చు. ఈ పైరును కొత్తగా పండిరచేటప్పుడు రైజోబియం కల్చర్‌ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడి పొందవచ్చు.
Also Read: Monsoon Diseases Precautions: వర్షాకాలం సీజన్లో వ్యాధులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
పంట విత్తిన 20 రోజుల్లో ముఖ్యంగా ఆశించే వేరుకుళ్ళు, ఎండు తెగులు ప్రధానమైనవి ఈ తెగులు ఆశించడం వలన పంటసాంద్రత తగ్గి దిగుబడులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఈ శిలీంద్రం భూమి ద్వారా వ్యాపిస్తుంది. ఈ తెగులు ఆశించినప్పుడు కార్బన్డిజం ఒక గ్రాము లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి లేదా కాపర్ ఆక్సిక్ క్లోరైడ్ (బ్లైటాక్స్) మూడు గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
అలాగే తొలి దశలో ఆశించే రసం పీల్చుపురుగుల నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లీటర్ నీటికి ఇమిడాక్లోప్రిడ్ (0.5 మి.లీ./ లీటర్ ) ఫిప్రోనిల్ ( 2 మి.లీటరు / లీటర్ నీటికి) ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు / 1 లీటరు 15 రోజుల వ్యవధిలో పిచికారి చేసి తెల్ల దోమ నివారణకు పసుపు రంగు డబ్బాలు ఎకరానికి నాలుగు, తామర పురుగుల నివారణకు నీలిరంగు డబ్బాలు ఎకరానికి నాలుగు అమర్చాలి. పంటనాటిన 20 రోజుల తరువాత వేప నూనె ఐదు మి.లీ. లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి తద్వారా తెల్ల దోమను అరికట్టవచ్చు.
Also Read: Agriculture Works in Rain Season: వర్షాకాలంలో పంటసాగుకు ముందు చేపట్టవలసిన వ్యవసాయ పనులు.!