ఉద్యానశోభరైతులు

Flower Cultivation: రైతులకు పరిమళాలు పంచుతున్న పూలసాగు.!

2
Flower Cultivation
Flower Cultivation

Flower Cultivation: పూల సాగు రైతుకు అన్ని కాలాల్లో ఆదాయం తెచ్చి పెడుతుంది. అయితే పూలుఅమ్ముకునే మార్కెట్లు సమీపంలో ఉంటే రైతులకు రవాణా ఖర్చులు కలసి వస్తాయి. కేరళలోని అరళం రైతులు పూలసాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అంతేకాదు వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారు. పూలసాగులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులు కూడా ప్రయోజనాలు పొందుతున్నారు.

ప్రయోగం ఫలించింది

అరళం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ శాఖ, గిరిజన పునరావాస అభివృద్ధి మిషన్‌ ఆధ్వర్యంలో ప్రయోగాత్మకంగా బంతిపూలు, చెమంతి పూల సాగు ప్రారంభించారు. ఇక్కడ ఎక్కువగా జీడి, రబ్బరు, కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. అయితే అడవి ఏనుగులు, ఇతర జంతువులు వాటిని ధ్వంసం చేయడంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ప్రయోగాత్మకంగా సాగు చేసిన పూలు రైతులకు మంచి ఆదాయం తెచ్చి పెట్టడమే కాదు, అడవి జంతువులు కూడా ముట్టుకోవడం లేదు. దీంతో వందలాది గిరిజన రైతులు జీవనోపాధి పొందుతున్నారు.

Also Read: Cardamom Cultivation: యాలకుల పంట సాగు చేయడం ఎలా ?

Chamanthi Flowers

Flower Cultivation

ఓనం సీజన్లో అధిక ధరలు

పూల మార్కెట్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. పంగల సందర్భంలో పంట చేతికి వచ్చేలా రైతులు ప్లాన్ చేసుకోవాలి. అప్పుడే వారు పండించిన పూలకు మంచి ధర దక్కుతుంది. కేరళలో ఓనం పండగను అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. అన్ని రకాల పూలకు మంచి డిమాండ్ ఉంటుంది. అందుకే పండుగల వచ్చే నాటికి పూల దిగుబడి వచ్చేలా గిరిజనులతో పంట సాగు చేయించినట్టు అధికారులు చెబుతున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి కన్నూర్ మార్కెట్ కు పూలు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు ధరలు తగ్గుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నారు. పూల ధరలు బాగా తగ్గినప్పుడు వాటిని కలర్స్ తయారీలో ఉపయోగించేందుకు పలు కంపెనీలతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. వారి చర్చలు ఫలిస్తే ఇక పూల రైతులకు కూడా భరోసా లభిస్తుంది.

అన్ని రకాల పూలకు మంచి డిమాండ్

కేరళలో బంతి, చామంతి, జర్బెరా, మల్లె, గులాబీ పూల సాగు చేపట్టిన రైతులు ఏటా ఎకరాకు రూ.2 లక్షలకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నారు. పూల సాగులో చీడపీడలు కూడా తక్కువే, రసాయనాల వినియోగం చాలా నామమాత్రం. వరదలు,కరవును కూడా తట్టుకుంటాయి. సారవంతమైన అన్ని రకాల నేలల్లో పూలసాగు చేయవచ్చు. కొన్ని రకాల పూలను ఒక్కసారి నాటుకుంటే సంవత్సరాల తరబడి దిగుబడినిస్తాయి. ఇది రైతులు అన్ని విధాలా కలసి వస్తుంది. పూల సాగును ప్రోత్సహించి రైతులకు అండగా నిలిచేందుకు కేరళ కన్నూర్ రైతులు ఫామ్ ఫ్లవర్ ప్రొడ్యూసర్స్ కో ఆపరేటివ్ సొసైటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: 10 Profitable Agricultural Business Ideas: బాగా లాభాలందించే పది వ్యవసాయ వ్యాపారాలు.!

Leave Your Comments

10 Profitable Agricultural Business Ideas: బాగా లాభాలందించే పది వ్యవసాయ వ్యాపారాలు.!

Previous article

Tomato Crop Protection: నైలాన్‌ తెరలు నుంచి టమాటా పంటను కాపాడుకుంటున్న రైతులు..

Next article

You may also like